Ticker

6/recent/ticker-posts

Fake Olympiads Conducted By Narayana : ఫేక్‌ ఒలంపియాడ్‌ నిర్వహిస్తూ తల్లిదండ్రుల్ని మోసం చేస్తున్న నారాయణ !



  • CNAPS ఒలింపియాడ్‌ పేరుతో దోపిడీ దందా !
  • ఒక్క 2022 లోనే రూ. 9 కోట్లు లూటీ !
  • గత 3 ఏండ్లలో సుమారు రూ. 25 కోట్ల వసూళ్లు !
  • అక్రమ  సంపాదన కోసం నారాయణ అడ్డదారులు !

తల్లి, తండ్రి, గురువు, దైవం... తల్లిదండ్రుల తర్వాత గురువుకి అంత ప్రాధాన్యత ఉంది. కానీ ఆ గురువే నమ్మక ద్రోహానికి పాల్పడితే అంత కంటే ఘోరం మరోకటి ఉంటుందా ? సరిగ్గా అదే సంఘటనను గుర్తు చేస్తూ  గురువు లాంటి నారాయణ సంస్థ తన స్టూడెంట్స్‌తో చేస్తుంది. తన స్టూడెంట్స్‌ పట్ల బాధ్యతగా వ్యవహరించాల్సిన నారాయణ తల్లిదండ్రుల నమ్మకాన్ని సొమ్ము చేసుకుంటోంది. ఇప్పటికే వివిధ రకాల ఫీజలు, బుక్స్‌, డ్రస్‌ల పేరుతో వసూలు చేస్తున్న నారాయణ వచ్చే సంపాదనతో సంతృప్తి చెందలేదు. కాసుల కోసం కకుర్తి పడుతూ అడ్డదారులు వెతికింది. నారాయణ స్కూల్స్‌ CNAPS ( Council For Nurturing Academic Potential In Students ) పేరుతో ఫేక్‌ ఒలంపియాడ్స్‌కు తెరతీసింది. ఒక్కో ఎగ్జామ్‌కు రూ. 150 /- చొప్పున దాదాపు  2 లక్షల మంది విద్యార్థులతో  విద్యార్థుల ఆర్థిక స్తోమతను బట్టి కనీసం 3 రకాల ఎగ్జామ్స్‌  గరిష్టంగా  5 రకాల ఎగ్జామ్స్‌ కోసం ఒక్కొక్కరి దగ్గర నుండి రూ. 450/- దగ్గర నుండి  రూ. 750 /- వసూలు చేసింది.  ఒక్క  2022 సంవత్సరంలోనే దాదాపు  రూ. 9 కోట్లు  విద్యార్థుల దగ్గర నుండి పిందుకుంది. నారాయణ. గత 3 సంవత్సరాలుగా  6,45,890 మంది విద్యార్థులతో మొత్తం 17,12,676 ఎగ్జామ్స్‌ను నిర్వహించింది. అంటే 25 కోట్ల 69 లక్షల రూపాయలు కొల్లగొట్టింది.

ఒలింపియాడ్‌ పేరుని వాడుకుంటూ మోసం !

ఇంటర్నేషనల్‌ స్టాండర్డ్‌ మ్యాధమ్యాటిక్స్‌ ఒలింపియాడ్‌ (ISMO), ఇంటర్నేషనల్‌ స్టాండర్డ్‌ సైన్స్‌ ఒలింపియాడ్‌ (ISSO), ఇంటర్నేషనల్‌ స్టాండర్డ్‌ నాలెడ్జ్‌ ఒలింపియాడ్‌ (ISKO), ఇంటర్నేషనల్‌ స్టాండర్డ్‌  ఇంగ్లీష్‌ ఒలింపియాడ్‌ (ISEO), ఇంటర్నేషనల్‌ స్టాండర్డ్‌ సైబర్‌ ఒలింపియాడ్‌ (ISCO) ఇలా 5 రకాల ఒలింపియాడ్స్‌ నిర్వహిస్తున్న నారాయణ స్కూల్స్‌ ఈ విద్యాసంవత్సరం నుండి  నేషనల్‌ టాలెంట్‌ ఎగ్జామ్‌ (NTEX), రీజనల్‌ ఒలింపియాడ్‌ ఇన్‌ మ్యాథమ్యాటిక్స్‌ (ROM), జూనియర్‌ ఒలింపియాడ్‌ ఇన్‌ సైన్స్‌ & ఆస్ట్రానమీ  ( JOSA)  వంటి మరో 3 రకాల ఒలింపియాడ్స్‌ను  అదనంగా  అందుబాటులోకి తెస్తున్నట్లు ప్రకటించి దోపిడీని కొనసాగించేందుకు ప్రణాళికను సైతం విడుదల చేసింది.  పాత ఒలింపియాడ్స్‌ కి రూ. 250 /- చొప్పున,  కొత్త ఒలింపియాడ్స్‌కి రూ. 300 /- చొప్పున ఎగ్జామ్‌ ఫీజుగా నిర్ణయించింది. ఆగష్టు 20, 2023 తేదీ నాటికి ఫీజులు వసూలు చేయాలని నారాయణ ప్రిన్సిపాల్స్‌కు ఆదేశాలు సైతం జారీ అయ్యాయి. 

CNAPS సంస్థ ఓనర్‌ ఎవరు ?

CNAPS అనే సంస్థ నారాయణ సృష్టించిన ఓ బినామీ సంస్థ. ఈ CNAPS సంస్థ పైకి ఓ సంతంత్ర సంస్థలాగా తన కార్యకలాపాలు నిర్వహిస్తున్న ఆ వెబ్‌సైట్‌లో సంస్థ నిర్వాహకలు వివరాలు కానీ, కార్యవర్గ సభ్యుల వివరాలు పొందుపరచలేదు. కానీ దీనిలో విధులు నిర్వర్తించేది మాత్రం నారాయణ ఉద్యోగులే.  కె.ఎన్‌.  మహేశ్వరరావు (NSPIRA MANANAGEMENT SERVICES PVT LTD) మేనేజ్‌మెంట్‌ సర్వీసెస్‌ ఉద్యోగి) కాంపిటీటీవ్‌ ఎగ్జామ్స్‌ కో అర్డినేటర్‌గా వ్యవహరిస్తున్నారు.. ఈయన నుండి  నారాయణ స్కూల్స్‌లోని అందరి ప్రిన్సిపాల్‌కు 2023  సంవత్సరానికి పరీక్షల నిర్వహణకు సంబంధించిన సమాచారం ఇప్పటికే వెళ్ళిపోయింది. వీరి సూచనలను  బట్టి అన్ని నారాయణ స్కూల్స్‌లో తమ విద్యార్థుల దగ్గర నుండి ఫీజులతో పాటు ఒలింపియాడ్స్‌ కోసం డబ్బులు వసూలు చేసే ప్రక్రియకు శ్రీకారం చుడుతున్నారు. నిజంగా చెప్పాలంటే నారాయణ ప్రిన్సిపాల్స్‌కు ఈ CNAPS ఒలింపియాడ్స్‌ నారాయణ సంస్థది అనే విషయం తెలియదు. ఓ ప్రైనేట్‌ సంస్థ నిర్వహించే ఒలింపియాడ్స్‌ అని మాత్రమే  తెలుసు అంటే ఎంత గోప్యంగా నిర్వహిస్తున్నారో అర్థం చేసుకోవచ్చు. 



MY SUPER BRAIN పేరు వాడుకుంటూ కథ నడిపిస్తున్న నారాయణ !

CNAPS ఒలింపియాడ్స్‌ను MY SUPER BRAIN అనే సంస్థ నిర్వహిస్తున్నట్లు  ఉంటుంది. కానీ  MY SUPER BRAIN వారికి రాయల్టీకి క్రింద నామమాత్రపు సొమ్మును చెల్లిస్తోంది CNAPS సంస్థ. అసలు MY SUPER BRAIN అనే సంస్థ అనేక రంగాలకు సంబంధించిన వివిధ కోర్సులతో పాటు ప్రతిభావంతులైన విద్యార్థులకు ప్రోత్సహించే వేదిక. MY SUPER BRAIN సంస్థకి ఎలాంటి ఒలింపియాడ్స్‌ లేవు, ఎగ్జామ్స్‌ నిర్వహించిన చరిత్ర లేదు. కేవలం మై సూపర్‌ బ్రెయిన్‌ పేరును వాడుకుంటూ సొమ్మును తన ఖాతాతో వేసుకుంటోంది CNAPS.  సినాప్స్‌ ఒలింపియాడ్‌కి సంబంధించిన ఎగ్జామ్‌ పేపర్లు తయారీ, నిర్వహణ అంతా నారాయణ స్కూల్స్‌లోనే జరుగుతోంది. ఈ ఎగ్జామ్స్‌ నిర్వహణ అనంతరం కనీసం బహుమతులు కూడా అందించే ప్రయత్నం చేయటం లేదు నారాయణ. ర్యాంక్‌ సర్టిఫికేట్‌తో పాటు ఓ మెడల్‌ని ప్రదానం చేసి చేతులు దులుపుకుంటోంది.  ఈ చర్యతో దోచుకోవటం తప్ప మరో ఉద్ధేశ్యం లేదు అని చెప్పకనే తెలుస్తుంది. ఆ సర్టిఫికేట్స్‌కి ఎలాంటి గుర్తింపు  లేదు, ఎలాంటి భవిష్యత్తు ప్రయోజనం లేదని తల్లిదండ్రులు గుర్తించాలి. ప్రభుత్వ  లేక ప్రభుత్వ అనుబంధ సంస్థల అనుమతి లేని ఒలింపియాడ్‌ను నారాయణ ఎందుకు నిర్వహిస్తుందో  నిర్వాహకులు తెలియజేయాల్సి ఉంది. సీనాప్స్‌ ఒలింపియాడ్‌  పరీక్షల కోసం వసూలు చేసే సొమ్ము నారాయణ స్కూల్స్‌ ఎందుకు వసూలు చేస్తోంది. వసూలు చేసిన సొమ్ము  మై సూపర్‌ బ్రెయిన్‌ అకౌంట్‌కే వెళుతోందా లేదా సీనాప్స్‌ సంస్థకు వెళుతోందా అనేది మేనేజ్‌మెంట్‌ సమాధానం చెప్పాల్సి ఉంది.





Post a Comment

0 Comments

Popular Posts

Scholarships : కార్పొరేట్‌ విద్యాసంస్థల కుతంత్రం ! బోగస్‌ స్కాలర్‌షిప్‌లతో విద్యార్థులపై దండయాత్ర !!
Sri Chaitanya Trust : ఇష్టారాజ్యంగా ఎడ్యుకేషనల్‌ ట్రస్ట్‌లు/ సొసైటీలు !
JEE ADVANCED 2025 : IIT ర్యాంకుల పేరుతో తల్లిదండ్రుల్ని బకరాల్ని చేస్తున్న శ్రీచైతన్య !
SRI CHAITANYA NEET 2025 : కూలిపోతున్న డాక్టర్‌ కలలు !
Sri Chaitanya : వర్సిటీ మూసివేత ! శ్రీచైతన్య ఉద్యోగుల్లో కలవరం ?
JEE MAIN 2025 ఫలితాల్లో మరో సరికొత్త మోసానికి తెరతీసిన శ్రీచైతన్య !
INFINITY META JR APP పేరుతో అడ్డంగా దండుకుంటున్న శ్రీచైతన్య !
SriChaitanya School : సుచిత్రలో శ్రీచైతన్య బరితెగింపు !!
Sri Chaitanya Sisters : శ్రీచైతన్య షెల్‌ కంపెనీల గుట్టు రట్టు !
Sri Chaitanya : షెల్‌ కంపెనీల పుట్ట...నల్లధనం గుట్ట ....శ్రీచైతన్య !