- దేశవ్యాప్తంగా 30కి పైగా ట్రస్ట్‌లు/ సొసైటీలు శ్రీచైతన్యవే !
- పెద్ద మొత్తంలో డబ్బు తరలింపు కోసం ఎక్కువ సంఖ్యలో ట్రస్ట్‌లు/ సొసైటీల ఏర్పాటు !
- ఆపై సొంత ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీల్లోకి డబ్బు తరలింపు !
- కోరవడిన ప్రభుత్వాల నిఘా ! చట్టంలోని లోసుగులతో శ్రీచైతన్య డేంజర్ గేమ్ !
దేశవ్యాప్తంగా ఉన్న శ్రీచైతన్య విద్యాసంస్థలు ప్రకటించే ఫలితాలు శ్రీచైతన్య విద్యాసంస్థలవి కాదు. దాదాపు 30కి పైగా వివిధ ట్రస్ట్‌లు/ సొసైటీలకు సంబంధించినవని తేటతెల్లం అయ్యింది. శ్రీచైతన్య స్కూల్స్ / విద్యాసంస్థలు/ అకాడమీల పేరుతో ఒక సంస్థకు చెందిన ఫలితాలుగా ప్రకటిస్తున్న శ్రీచైతన్య, ఒకే ట్రస్ట్ / సొసైటీ పేరు మీద ఎందుకు కార్యకలాపాలు నిర్వహించం లేదు అన్నది తల్లిదండ్రులను, మేధావులను వేదిస్తోన్న మిలియన్ డాలర్ల ప్రశ్న. అసలు శ్రీచైతన్య ప్రకటిస్తున్న ఫలితాలు వివిధ పేర్లతో రిజిస్టర్ కాబడిన వేర్వేరు ట్రస్ట్‌లు/ సొసైటీల ఫలితాలను క్రోడీకరించి ప్రకటిస్తున్నట్లు పరిశోధనలో వెల్లడైంది. ప్రతి బ్రాంచ్‌కి ప్రత్యేకంగా అనుమతి తీసుకునే శ్రీచైతన్య కొన్ని బ్రాంచీలను కలిపి ఒక ట్రస్ట్ క్రింద నమోదు చేసినట్లు రికార్డుల్లో చూపుతోంది. అంటే వివిధ ట్రస్ట్‌లు/ సొసైటీల పేరుతో నడుస్తున్న శ్రీచైతన్య స్కూల్స్, కాలేజీలు, అకాడమీల పేరుతో మోసపూరిత ప్రకటనలతో ప్రజలను, తల్లిదండ్రులను తప్పుదోవ పట్టిస్తోందని ఈ చర్యలతో అర్థం అవుతోంది. అసలు ఒక ట్రస్ట్‌కి మరో ట్రస్ట్‌కి, ఒక సొసైటీకి మరో సొసైటీకి ఎలాంటి సంబంధం ఉండదు. ఒక ట్రస్ట్‌కి సంబంధించిన వ్యవహరాలు మరో ట్రస్ట్‌లో చూపించటం ఏ విధంగా నైతికత అవుతుందో శ్రీచైతన్య యాజమాన్యమే చెప్పాలి. ఒక్క ముక్కలో చెప్పాలంటే శ్రీచైతన్య విద్యాసంస్థ ప్రకటించే ఫలితాలు వివిధ ట్రస్ట్ లు/ సొసైటీల సమూహం అనే చెప్పాలి.
పదుల సంఖ్యలో ట్రస్ట్‌లు/ సొసైటీలు
భారతీయ చట్టాల ప్రకారం అసలు శ్రీచైతన్య ఎడ్యుకేషనల్ ట్రస్ట్ అనే ఒకే పేరు మీద తన కార్యకలాపాలు నిర్వహించాలి. కానీ అలా జరగటం లేదు. ఇలా పదుల సంఖ్యలో ట్రస్ట్‌లు/ సొసైటీలు నెలకొల్పటం వెనుక నేరపూరిత కుట్ర దాగి ఉందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఇలా పదుల సంఖ్యలో ట్రస్ట్‌లు/ సొసైటీల నెలకొల్పటం ద్వారా సులభంగా డబ్బును తమ సొంత ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీలకు పెద్దమొత్తంలో తరలించే ఆలోచనతోనే ఇలా పదుల సంఖ్యలో ట్రస్ట్‌లు/సొసైటీల నిర్మాణం జరిగిందని తెలుస్తోంది. ముఖ్యంగా తమిళనాడు రాష్ట్రంలో వివిధ బ్రాంచీలను రిజిస్టర్ చేసిన ట్రస్ట్‌లను చూస్తే దిమ్మతిరుగుతుంది. కేవలం అక్షరాల మార్పుతో 5 ట్రస్ట్‌లను నెలకొల్పింది. శ్రీ మురుగన్ ఎడ్యుకేషనల్ ట్రస్ట్, శ్రీ మురగన్ ఎడ్యుకేషనల్ ట్రస్ట్ అంటూ ప్రభుత్వ అధికారులను ఏమార్చి ట్రస్ట్‌లను నెలకొల్పింది. అలాగే శ్రీ చైతన్య ఎడ్యుకేషనల్ కమిటీ. శ్రీచైతన్య ఎడ్యుకేషనల్ సొసైటీ, శ్రీచైతన్య ఎడ్యుకేషనల్ ట్రస్ట్ ఒకే పేరుతో 3 ట్రస్ట్‌లను నెలకొల్పింది. అలాగే ఎక్ట్స్‌జెన్ ఎడ్యుకేషన్ ట్రస్ట్, నెక్ట్‌జెన్ ఎడ్యుకేషనల్ ట్రస్ట్, నెక్ట్‌జెన్ ఎడ్యుకేషనల్ ట్రస్ట్ `హైద్రాబాద్ ఇలా కేవలం ఒకే పేరులో అక్షరాల మార్పుతో మూడు అంతకు మించి ట్రస్ట్‌లను నెలకొల్పింది. కేవలం అక్షరాల మార్పుతో ప్రభుత్వాలను, అధికారులను ఏమార్చుతోంది. ఈ సొసైటీలు, ట్రస్ట్‌లు అన్నీ చాలా వరకు నష్టాలు చూపిస్తున్నారు. ఆపై సొమ్మును పక్కదారి పట్టిస్తున్నారు. ఈ ట్రస్ట్‌లు, సొసైటీలకు సంబంధించిన నిధులను మళ్ళించుకునేందుకు శ్రీచైతన్య కుటుంబ సభ్యులైన బొప్పన సుష్మ, బొప్పన సీమ, వై శ్రీధర్‌లు మేనేజ్‌మెంట్ ఆధ్వర్యంలో వర్సిటీ సౌత్ ఎడ్యుకేషన్ మేనేజ్‌మెంట్ ప్రైవేట్ లిమిటెడ్‌ని స్థాపించారు. తద్వారా కంపెనీలోకి సేవల పేరుతో డబ్బును మళ్ళిస్తున్నారు. దాని నుండి షెల్ కంపెనీలకు మళ్ళించి వాటి నుండి సొంత ఖాతాలకు, సొంత ఆస్తులు కూడకట్టుకునేందుకు వాడుకుంటున్నారు.
కవిత ముద్దన ఎవరు ?
30 కి పైగా అధికారిక ట్రస్ట్‌లు/ సొసైటీలు బయటపడిన తరుణంలో ఆయా ట్రస్ట్‌లు/ సొసైటీల్లోని సభ్యులు ఎవరు అని ఆరా తీయగా విస్తుపోయే నిజాలు వెలుగులోకి వచ్చాయి. దాదాపు చాలా కంపెనీలకు కవిత ముద్దన అనే మహిళ నెక్ట్‌జెన్ ఎడ్యుకేషనల్ ట్రస్ట్ కి ట్రస్టీగా, అలాగే మధ్యప్రదేశ్‌లోని ఇండోర్‌లో స్థాపించిన శుభలక్ష్మీ ఎడ్యుకేషనల్ ట్రస్ట్ కి వైస్ ప్రెసిడెంట్‌గా, హైద్రాబాద్ కేంద్రంగా స్థాపించిన శ్రీ వశిష్ట ఎడ్యుకేషనల్ ట్రస్ట్‌కి మేనేజింగ్ ట్రస్టీగా సేవలు అందిస్తున్నారు. ఈమె శ్రీచైతన్య విద్యాసంస్థలో పనిచేసే ఉద్యోగి అని తెలుస్తోంది. అలాగే శ్రీచైతన్య యాజమాన్యం ఆధ్వర్యంలోని చాలా వరకు ట్రస్ట్‌లు /సొసైటీల్లో వివిధ హోదాల్లో పని చేస్తున్నట్లు తెలుస్తోంది. అలాగే త్రిపురనేని నాగేంద్రకుమార్, యలమంచిలి బాలాజీ ట్రస్ట్ / సొసైటీలు నెలకొల్పటంలో కీలక భూమిక పోషిస్తున్నట్లు తెలుస్తోంది.
0 Comments