Ticker

6/recent/ticker-posts

sri chaitanya : తవ్వేకొద్ది బయటపడుతున్న శ్రీచైతన్య షెల్‌ కంపెనీల అక్రమాలు !

  • ఆశ్రియ ఎడ్యుకేషన్‌ ప్రై.లి. కంపెనీ షేర్లు అన్నీ బ్రౌన్‌స్టోన్‌ ఎడ్యుకేషన్‌ ప్రై.లి. కంపెనీకి 
  • బ్రౌన్‌స్టోన్‌ ఎడ్యుకేషన్‌ ప్రై.లి. కంపెనీ షేర్లు అన్నీ కోయస్‌ ఎడ్యేకేషన్‌కు చెందినవి.  
  • అంటే రెండు కంపెనీలు కోయస్‌ ఎడ్యుకేషన్‌కి చెందినవే.  ఇప్పటికే కోయస్‌ ఎడ్యుకేషన్‌ ప్రై.లి. మూసివేత. 
  • శ్రీచైతన్య యాజమాన్యం షెల్‌ కంపెనీల్లో భాగస్వాములు, వాటాదారులు ఉండరు, ఒక కంపెనీలో మరో కంపెనీ భాగస్వామిగా ఉంటుంది. 
  • అక్రమాలపై దృష్టిపెట్టని మినిస్ట్రీ ఆఫ్‌ కార్పొరేట్‌ అఫైర్స్‌ ! 

శ్రీ వర్ష హర్టికల్చర్‌ ప్రై.లి అనే విజయవాడ కేంద్రంగా ఉన్న ఒక ప్రై.లి.కంపెనీ కాలక్రమంలో ఆశ్రియ ఎడ్యుకేషన్‌ ప్రై.లి.కంపెనీగా మారుతుంది. డా॥బి.ఎస్‌.రావు, రaాన్సీలక్ష్మీభాయి గార్లకు చెరో 5000 (మొత్తం 10000) షేర్లు ఉన్నాయి. డా॥బి.ఎస్‌.రావు గారు కాలం చేసిన తర్వాత 2 కూతుర్లు ఆశ్రియలో భాగస్వాములయ్యారు. ఇక్కడే ఒక మతలబు ఉంది. 28-06-2024న అన్‌సెక్యూర్డ్‌ క్రెడిటార్స్‌గా పేరుతో రaాన్సీలక్ష్మీభాయి గారికి 18.28%, వర్సిటీ ఎడ్యుకేషన్‌ ప్రై.లి. కంపెనీకి 77.01%, శివకృష్ణ & నారాయణ్‌ ఛార్టర్డ్‌ అకౌంటెంట్‌కి 2.87%, శుభలక్ష్మీ ఎడ్యుకేషనల్‌ సొసైటీకి 1.87% చెందినవిగా ప్రకటించారు. కానీ వెంటనే అదే రోజు షేర్లు 9999 షేర్లు బ్రౌన్‌స్టోన్‌ ఎడ్యుకేషన్‌ ప్రై.లి కంపెనీకి బదిలీ అయ్యాయి. బొప్పన సీమ పేరు మీద ఒక షేరు రిజిస్టర్‌ అయినట్లు చూపారు. ఎక్కడా అగ్రిమెంట్లు లేవు, షేర్‌ని ఎంతకు అమ్మారు అనే వివరాలు పొందుపరచలేదు. డబ్బు ఏ రూపంలో బదిలి అయ్యిందో చూపలేదు. ఇక బ్రౌన్‌స్టోన్‌ ఎడ్యుకేషన్‌ ప్రై.లి. కంపెనీకి చెందిన షేర్లు అన్నీ 9999 షేర్లు కోయస్‌ ఎడ్యుకేషన్‌ ప్రై.లి. కంపెనీకి చెంది ఉన్నాయి. అంటే ఈ రెండు కంపెనీల షేర్ల అన్నీ టెక్నికల్‌గా కోయస్‌ ఎడ్యుకేషన్‌ ప్రై.లి.కు చెందినట్లే లెక్క. అసలు కోయస్‌ ఎడ్యుకేషన్‌ కంపెనీ బ్రౌన్‌స్టోన్‌ ప్రై.లి. కంపెనీని ఎలా కొనుగోలు చేసింది. ఎంతకు కొనుగోలు చేసింది అనే వివరాలు ఎక్కడా ఉండవు. ఎందుకంటే కోయస్‌ ఎడ్యుకేషన్‌ ప్రై.లి. కంపెనీ కేవలం 3 కోట్లు ఉన్న చిన్న కంపెనీ. కోయస్‌ కంపెనీని అడ్డం పెట్టుకుని కోట్లాది రూపాయలు దారి మళ్ళించినట్లు ఆరోపణలు, ఆధారాలు లభ్యమయ్యాయి కూడా. అసలు ఒక కంపెనీలో నుండి మరో కంపెనీకి,  మరో కంపెనీ నుండి వేరే కంపెనీలోకి షేర్ల బదలాయింపు ఎందుకు ? ఒకే కంపెనీ మీద వ్యాపార కార్యకలాపాలు సాగించవచ్చు అన్నది సామాన్యుల అభిప్రాయం. ఇలా చేయటం వెనుక పన్ను ఎగవేత, ఆర్థిక అక్రమాలు జరిగేందుకు అవకాశాలు పుష్కలంగా ఉన్నాయని ఆర్థిక రంగ నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ఇప్పటికే వర్సిటీ ఎడ్యుకేషన్‌ ప్రై.లి. కంపెనీని కోయస్‌ ఎడ్యుకేషన్‌ ప్రై.లి. కంపెనీలోకి విలీనం చేసి, కోయస్‌ ఎడ్యుకేషన్‌ ప్రై.లి. కంపెనీ మూసివేశారు. వీటికి అనుబంధంగా వర్సిటీ సౌత్‌ ఎడ్యుకేషన్‌ ప్రై.లి., వర్సిటీ ఎడిఫికేషన్‌ ప్రై.లి. కంపెనీలను ప్రస్తుతం రన్‌ చేస్తోంది శ్రీచైతన్య యాజమాన్యం. 

అడ్డుకట్ట వేయలేకపోతున్న కార్పొరేట్‌ ఆఫైర్స్‌ ! 

ఎన్ని కఠిన నియమనిబంధనలు పొందుపరచినా అక్రమార్కులు షెల్‌ కంపెనీలను నెలకొల్పటంలో ఆరితేరిపోతున్నారు. ఒక్క శ్రీచైతన్య యాజమాన్యం దగ్గరే దాదాపు 30 కిపైగా ప్రై.లి. కంపెనీలు ఉన్నాయంటే పరిస్థితి ఏ విధంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. అవసరమైనప్పుడు షెల్‌ కంపెనీని ద్వారా మెయిన్‌ కంపెనీ షేర్లు తాకట్టు పెట్టి వెంటనే ఆయా షెల్‌ కంపెనీలను విలీనం చేసుకోవటం శ్రీచైతన్య యాజమాన్యం టెక్నిక్‌గా కనిపిస్తోంది. 

Post a Comment

0 Comments

Popular Posts

Resonance Schools : J.D.లక్ష్మీనారాయణ రెజొనెన్స్‌కి ప్రచారకర్తగా మారారా ?
Resonance Schools : టీచర్లు లేకుండా బోధన ఎలా ?
Kadapa Sri Chaitanya : శ్రీచైతన్య హాస్టల్స్‌లో ఆగని మరణమృదంగం !
Physics Wallah : 'సరసమైన ధరకే చదువు' ఫిజిక్స్‌ వాలా IPOని గట్టెక్కిస్తుందా ?
Sri Chaitanya Fake Olympiads : ఆగని శ్రీచైతన్య ఫేక్‌ ఒలింపియాడ్స్‌ దందా !
Sri Chaitanya Score Scholarship : శ్రీచైతన్య రూ.350 కోట్లు మాయాజాలం !
sri chaitanya : తవ్వేకొద్ది బయటపడుతున్న శ్రీచైతన్య షెల్‌ కంపెనీల అక్రమాలు !
Resonance Schools : పర్మిషన్లు లేకుండా అడ్మిషన్లు ఎలా ?
Sri Chaitanya Sisters : శ్రీచైతన్య షెల్‌ కంపెనీల గుట్టు రట్టు !
Sri Chaitanya Prodigy : తల్లిదండ్రులపై మోయలేని పెనుభారం !