ఆంధ్రప్రదేశ్‌లో శ్రీచైతన్య CBSE సిలబస్‌తో 27 స్కూల్స్‌ను నడుపుతున్నట్లు స్వయంగా తన వెబ్‌సైట్‌లో పొందుపరిచింది. కానీ CBSE BOARD పర్మిషన్ ఉన్న స్కూల్స్ మాత్రం కేవలం 6 మాత్రమే. ఇది శ్రీచైతన్య నిజాయితీకి, పారదర్శకతకి ఒక నిదర్శనం. CBSE AFFILIATION లేకుండా యధేచ్ఛగా నడుపుతున్న తీరు ఆశ్చర్యకరం. విద్యాధికారులు కళ్ళు మూసుకున్న తీరు విస్మయం కల్గిస్తోంది. ఇక తెలంగాణ విషయానికి వస్తే శ్రీచైతన్య తన వెబ్‌సైట్‌లో పేర్కొన్న సీబీఎస్‌ఈ స్కూల్స్ 17 కాగా, వాటిలో అనుమతి తీసుకున్న సీబీఎస్‌ఈ స్కూల్స్ కేవలం 11 మాత్రమే. అదేవిధంగా తమిళనాడు విషయానికి వస్తే 53 స్కూల్స్ & 19 కాలేజీలు ఉన్నట్లు తన వెబ్‌సైట్‌లో చూపుతున్న శ్రీచైతన్య కేవలం పర్మిషన్ తీసుకున్న స్కూల్స్ ఎన్నో తెలుసా ? కేవలం 32 మాత్రమే. అలాగే కర్ణాటక రాష్ట్రంలో 67 స్కూల్స్, 3 పీయూ కాలేజీలు నడుపుతుండగా, కేవలం 41 మాత్రమే పర్మషన్లు ఉన్నాయి. అలాగే ఓరిస్సాలో 6 స్కూల్స్, 2 పీయూ కాలేజీలు ఉన్నట్లు చూపగా, పర్మిషన్లు ఉన్నవి కేవలం 2 మాత్రమే. అదేవిధంగా మహారాష్ట్రలో 26 స్కూల్స్, 4 పీయూ కాలేజీలు ఉండగా వాటిలో పర్మిషన్ ఉన్నవి కేవలం 4 మాత్రమే. ఇలా దేశవ్యాప్తంగా ఉన్న శ్రీచైతన్య నిర్వహిస్తున్న ఇతర స్కూల్స్‌ను లీజు/ కొనుగోలు చేస్తూ...!
సీబీయస్‌ఈ పర్మిషన్ పొందిన ఇతర స్కూల్స్‌ను కొనుగోలు లేదా లీజుకి తీసుకుని నడిపించుకుంటున్నా కేవలం ఆయా పర్మిషన్ తీసుకున్న స్కూల్స్ పేరు మీదే నడిపించాల్సి ఉంది. కానీ ఆయా స్కూల్స్‌ను శ్రీచైతన్య టెక్నో స్కూల్ పేరు మీద నడిపించటం చట్టవిరుద్ధం. ఒక వేళ శ్రీచైతన్య టెక్నో స్కూల్ పేరు మీద నడిపించాలి అనుకుంటే ఆ విషయాన్ని సిబీఎస్‌ఈకి తెలియజేసి అప్లియేషన్ మార్చవలసి ఉంటుంది. ఒక పేరు మీద పర్మిషన్ తీసుకుని మరోక పేరు వాడటం నిబంధనలకు విరుద్ధం. పర్నిషన్ తీసుకున్న పేరు కాకుండా ఏదేని సంస్థ పేరు వాడుతున్నా, కరిక్యులమ్‌లు తగిలించినా, విద్యాసహాకారం అని పేరు వేసుకున్నా అది పూర్తి చట్టవిరుద్దం. ఉదాహరణకు చింతడపల్లి, కడియాడ పోస్ట్, తాడేపల్లిగూడెం, ఆంధ్రప్రదేశ్‌లో గల వాసవి ఐడల్ పబ్లిక్ స్కూల్‌ని లీజు లేదా కొనుగోలు చేసిన శ్రీచైతన్య పర్మిషన్ ఉన్న వాసవి ఐడల్ పేరు మీద కాకుండా శ్రీచైతన్య టెక్నో స్కూల్ పేరు మీద స్కూల్‌ను నిర్వహిస్తోంది. అలాగే హైద్రాబాద్, దిల్‌సుఖ్‌నగర్‌లోని పాణినీయ మహావిద్యాలయ పబ్లిక్ స్కూల్ వేరే మేనేజ్‌మెంట్ పరిధిలోనిది, కానీ నడిపిస్తుంది మాత్రం శ్రీచైతన్య. గణపవరంలో నడుపుతున్న సీబీఎస్‌ఈ స్కూల్ సాధన స్కూల్ పేరు మీద ఉంది. అలాగే కర్నూల్‌లో శ్రీచైతన్య తన పేరుతో ఉన్నట్టు చెప్తున్న స్కూల్ కట్టమంచి గ్లోబల్ స్మార్ట్ స్కూల్ పేరు మీద ఉంది. నడుపుతున్నది మాత్రం శ్రీచైతన్య. ప్రస్తుతం నడుస్తున్న దమ్మాయిగూడలోని సీబీఎస్‌ఈ స్కూల్‌కి అసలు గుర్తింపే లేదు. ఇలాంటివి చాలా ఉన్నాయని మా పరిశోధనలో తేలింది.
ఇతర సొసైటీల/ట్రస్ట్‌ల ఫలితాలు...శ్రీచైతన్యవి ఎలా అవుతాయి ?
వివిధ ట్రస్ట్‌లు / సొసైటీల పేరు మీద నడుస్తున్న శ్రీచైతన్య టెక్నో స్కూల్స్ ప్రతి సంవత్సరం సీబీఎస్‌ఈ ఫలితాలన్నీ తమవితా ప్రకటించుకుంటోంది. ఇతర విద్యాసంస్థల పేర్ల మీద నడిచే స్కూల్స్‌కి చెందిన ఫలితాలు శ్రీచైతన్య టెక్నో స్కూల్ ఫలితాలకు ప్రకటించుకోవటం ఎంత వరకు సమంజసం, ఎంత వరకు నైతికం. ఇలాంటి చర్య కచ్ఛితంగా చట్టవిరుద్ధం. శ్రీచైతన్య టెక్నో స్కూల్ పేరుతో స్కూల్స్ నడుపుతూ ఒకే సొసైటీ క్రింద ఉన్నట్లయితే ఎవరికీ ఎలాంటి అభ్యంతరాలు ఉందవు, కానీ వివిధ పేర్ల మీద ఉన్న సొసైటీలు/ ట్రస్ట్‌ల సమూహానికి సంబంధించిన ఫలితాలు అన్నింటినీ క్రోడీకరించి కేవలం శ్రీచైతన్య తమవిగా ప్రకటించుకోవటం శ్రీచైతన్య అనైతిక చర్యలకు ప్రతీకగా నిలుస్తోంది.
శ్రీచైతన్య ప్రకటనలపై నిషేధం విధించాలి !
శ్రీచైతన్య దేశవ్యాప్తంగా ఉన్న తన బ్రాంచీలలోని ఫలితాలను క్రోడీకరించి శ్రీచైతన్య విద్యాసంస్థలు మరియు శ్రీచైతన్య టెక్నో స్కూల్స్ పేరుతో ప్రకటిస్తోంది. ఇది చట్టవిరుద్దం. దేశంలోని వివిధ రాష్ట్రాలలోని వివిధ ప్రాంతాలలో వివిధ చిరునామాల పేరుతో రాష్ట్ర , కేంద్ర ప్రభుత్వ ప్రత్యేక అనుమతులతో మరియు గుర్తింపుతో స్కూల్స్ మరియు కళాశాలలను నడుపుతోంది శ్రీచైతన్య. కానీ ఆ స్కూల్స్ / కాలేజీలు అన్నీ ఒకే సొసైటీ క్రింద నడవటం లేదు. వివిధ సొసైటీల సమూహంతో శ్రీచైతన్య స్కూల్స్ మరియు కాలేజీలు నడుస్తున్నాయి. అదేసమయంలో మరికొన్ని లీజు/ కొనుగోలు పేరుతో వివిధ పేర్లతో ఉన్న సంస్థలను శ్రీచైతన్య ఆధీనంలో కార్యకలాపాలు నిర్వహిస్తోంది. ఆయా సంస్థల ఫలితాలను శ్రీచైతన్య తన ఫలితాలుగా ప్రకటిస్తోంది. ఇక పోతే మరికొన్ని సంస్థలకు అసలు గుర్తింపే లేదు. వాటిని శ్రీచైతన్య తన ఫలితాల ఖాతాలో వేసుకుని తల్లిదండ్రులను మభ్యపెట్టే ప్రయత్నం చేస్తోంది. ఆయా స్కూల్స్ మరియు కాలేజీలకు సంబంధించిన ఫలితాలు కేవలం ఆయా ప్రాంతాలనే పరిమితం అవ్వాల్సి ఉండగా, అన్ని సంస్థల ఫలితాలను శ్రీచైతన్య ఒక్కటే సాధించింది అని బహిరంగ పత్రిక, టెలివిజన్ మరియు ఇతర సామాజిక మాధ్యమాల ద్వారా ప్రకటించటం వినియోగదారుల రక్షణ చట్టం 2019కి పూర్తిగా వ్యతిరేకం. మరోక విషయం ఏమిటంటే శ్రీచైతన్య విద్యాసంస్థలు పేరు మీద ఎలాంటి గుర్తింపు లేదు. ఉన్నా దేశంలోని అన్ని బ్రాంచీల ఫలితాలను కలిపి ప్రకటించుకునే అధికారం కానీ, వెసులుబాటు కానీ లేదు.

0 Comments