
- సొసైటీల సొమ్మును ఇష్టారీతిన వర్సిటీకి మళ్ళిస్తున్న శ్రీచైతన్య !
- సర్వీసు ధరను ఎక్కువ చూపటం, ఫేక్ ఇన్‌వాయిస్‌లతో తతంగం నడిపిస్తున్న శ్రీచైతన్య !
- వర్సిటీ నుండి ఇతర షెల్ కంపెనీల్లో పెట్టుబడులు !
- ఇన్‌కంటాక్స్ అధికారుల నజర్ !
- వర్సిటీ అక్రమాలపై EDకి ఫిర్యాదులు !
వర్సిటీలో వర్సీటీ వాటా నామమాత్రమే !
అసలు
వర్సిటీ ఎడ్యుకేషన్ మేనేజ్‌మెంట్‌కి 16502002 షేర్స్ ఉంటే మెజార్టీ వాటా
14755584 షేర్లు కోయిస్ ఎడ్యుకేషన్ మేనేజ్‌మెంట్ ఎల్.ఎల్.పి. అనే
సంస్థకు చెందినదే. దీని నిర్వాహకులు బొప్పన సుష్మ, బొప్పన సీమ. వీరిద్దరూ
వర్సిటీ ఎడ్యుకేషన్ మేనేజ్‌మెంట్ ప్రై.లి.కి చెందిన డైరెక్టర్సే. అంటే
వర్సిటీ ఎడ్యుకేషన్ మేనేజ్‌మెంట్ ప్రై.లి.కి దాదాపు 88% వాటా కోయిస్
ఎడ్యుకేషన్ మేనేజ్‌మెంట్ ఎల్.ఎల్.పి.దే. 19`10`2022 వ తేదీన షేర్‌ల
బైబ్యాక్ పేరుతో రూ. 5 ముఖ విలువ కలిగిన 11, 08, 976 షేర్లను ఒక్కొ
షేరుకు రూ. 1893.64 రూ. చెల్లించి రూ. 210000131/` కోయిస్ ఎడ్యుకేషన్
మేనేజ్‌మెంట్‌కి చెల్లించారు. అదే విధంగా 30`09`2024 న మరోసారి షేర్‌ల
బైబ్యాక్ పేరుతో రూ. 5 ముఖ విలువ కలిగిన 637428 షేర్లను ఒక్కొ షేరుకు
రూ. 3916.42 రూ. చెల్లించి రూ. 249,64, 35768 /` కోయిస్ ఎడ్యుకేషన్
మేనేజ్‌మెంట్‌కి చెల్లించారు. అంటే వర్సిటీ నుండి డబ్బును తమ మరో షెల్
కంపెనీ అయిన కోయిస్ ఎడ్యుకేషన్‌కి తరలించారు. ఈ లెక్కన వర్సిటీలో వర్సిటీ
విలువ నామమాత్రమే. అదే సమయంలో కోయిస్ ఎడ్యుకేషన్ మేనేజ్‌మెంట్
ఎల్.ఎల్.పి. రద్దు చేయబడిరది. 26`07`2023న ప్రై.లి. క్రిందకు మార్చారు.
రుణం తీసుకుని శ్రీవాల్మీకిని మింగేసిన వర్సిటీ !
వర్సిటీ
ఎడ్యుకేషన్ మేనేజ్‌మెంట్ ప్రై.లి. కంపెనీ 8, జూలై 2021 బజాజ్
ఫైనాన్స్, పుణె నుండి 350 కోట్ల అప్పు, 21, జూన్ 2021 హీరో ఫిన్
కార్ప్, డిల్లీ నుండి 135 కోట్ల రుణం, 14, జూన్ 2021 టాటా క్యాపిటల్,
ముంబాయి నుండి 335 కోట్ల రుణం పొందినట్లు పుస్తకాల్లో చూపించారు. ఇదే అప్పు
శ్రీవాల్మీకి ఎడ్యుకేషన్ మేనేజ్‌మెంట్ ప్రై.లి. పేరు మీద ఒక నెల
అటుఇటుగా ఎస్.ఆర్.ఎన్. మరియు ఛార్జ్ ఐడీల మార్పుతో 820 కోట్లు రుణం
తీసుకున్నట్లు చూపించారు. ప్రైవేట్ పైనాన్స్ కంపెనీ అయిన టాటా
క్యాపిటల్‌లో రూ. 335 కోట్ల రుణాన్ని ఒకే నంబరు మీద అటు వర్సిటీ
ఎడ్యుకేషన్ మేనేజ్‌మెంట్ ప్రై.లి. లోనూ, ఇటు శ్రీవాల్మీకి ఎడ్యుకేషన్
మేనేజ్‌మెంట్ ప్రై.లి.లోనూ చూపించారు. అలాగే ఆదిత్య బిర్లా క్యాపిటల్‌లో
తీసుకున్న రుణం రూ. 150 కోట్లు శ్రీ వాల్మీకి ఎడ్యుకేషన్ పేరు మీద, రూ.
165.17 కోట్లు వర్సిటీ ఎడ్యుకేషన్ మేనేజ్‌మెంట్ పేరు మీద తీసుకోగా ఈ
రెండిరటి రుణాలను వర్సిటీలోనే చూపటం గమనార్హం. అలాగే హీరో ఫిన్ కార్ప్‌లో
రూ. 135 కోట్ల రుణం శ్రీ వాల్మీకి ఎడ్యుకేషన్ పేరు మీద తీసుకుని వర్సిటీ
ఎడ్యుకేషన్ బుక్స్‌లో చూపించారు. అప్పులన్నీ శ్రీవాల్మీకి ఎడ్యుకేషన్
మేనేజ్‌మెంట్ ప్రై.లి పేరు మీద తీసుకుని ఆ అప్పులకు వర్సిటీ ఎడ్యుకేషన్
మేనేజ్‌మెంట్‌కి సెక్యూరిటీ ప్రొవైడర్‌గా ఉంది. అప్పులు తీసుకున్న
కొన్నిరోజులకే శ్రీవాల్మీకి ఎడ్యుకేషన్ మేనేజ్‌మెంట్ ప్రై.లి. కంపెనీని
వర్సిటీ ఎడ్యుకేషన్ విలీనం చేసుకుంది. అప్పులు అనేవి వర్సిటీ ఎడ్యుకేషన్
మేనేజ్‌మెంట్ పేరు మీద రిజిస్టర్ కాకుండా క్లీన్‌గా ఉంచుకుని ఇతర చిన్న
కంపెనీల పేరుతో అప్పులు తీసుకుని వెంటనే తనలో విలీనం చేసుకునేందుకు చాలా
షెల్ కంపెనీలకు సిద్ధం చేసుకుంది. శ్రీవాల్మీకి ఎడ్యుకేషన్ మేనేజ్‌మెంట్
ప్రై.లి. నిర్వాహకులు ఎవరంటే డా॥బి.ఎస్.రావు, బి. రaాన్సీ లక్ష్మీభాయి కి
చెందినది. వర్సిటీ ఎడ్యుకేషన్ మేనేజ్‌మెంట్ ప్రై.లి. నిర్వాహకుల అమ్మా,
నాన్నలదే.
క్విడ్‌ప్రో కో పాల్పడిన వర్సిటీ !
22,
మే 2021లో శ్రీవాల్మీకి ఎడ్యుకేషన్ మేనేజ్‌మెంట్ ప్రై.లి. వివిధ
కార్పొరేట్ ఫైనాన్స్ కంపెనీల నుండి మొత్తంగా 1135.17 కోట్ల రుణం
తీసుకుంది. ఆ అప్పుకు వర్సిటీ ఎడ్యుకేషన్ మేనేజ్‌మెంట్ ప్రై.లి
ష్యూరిటీగా షేర్లను తనఖా పెట్టింది. అనంతరం జూలై 16, 2021లో నియోపోలీస్
పేరుతో హెచ్‌ఎండిఏ నిర్వహించిన భూముల వేలంలో పాల్గొంది వర్సిటీ
ఎడ్యుకేషన్. అంటే ఒక నెల ముందుగానే కోకాపేటలో భూముల అమ్మకం గురించి దానిని
తెర వెనుక దక్కించుకునేందుకు వివిధ సంస్థల నుండి అప్పుల రూపంలో డబ్బు
సమకూర్చుకుంది అనటానికి సాక్ష్యాలు ఉన్నాయి. ఫలానా వారికే భూములు దక్కేలా
అధికారుల ద్వారా చక్రం తిప్పినట్లు తెలుస్తోంది. దీనిలో భాగంగా ముందుగానే
నిర్ణయించిన శ్రీచైతన్య యాజమాన్యానికి చెందిన వర్సిటీ ఎడ్యుకేషన్
మేనేజ్‌మెంట్‌కి కోకాపేటలో ఎకరం 42.2 కోట్లు చొప్పున 296.95 కోట్ల విలువైన
7.57 ఎకరాల భూమికి అప్పటి ప్రభుత్వం కట్టబెట్టింది. భూమిని
దక్కించుకోవడానికి సహకరించినందుకు గాను ప్రభుత్వం నుండి ఆక్షన్‌కి
సహాకరించినందుకు గాను దాదాపు 12 కోట్లు బీఆర్‌ఎస్ పార్టీకి విరాళాలు
అందించి శ్రీచైతన్య క్విడ్ ప్రో కో పాల్పడినట్టు తెలుస్తోంది.
0 Comments