- దోపిడీకి అలవాటు పడిన శ్రీచైతన్య !
- కొంచం కొంచంగా కొల్లగొట్టడమే శ్రీచైతన్య విధానం !
అమెరికాలోని నేషనల్ స్పేస్ సొసైటీ ప్రతిష్టాత్మకంగా నిర్వహించే గెరార్డ్ కె. ఓ నీల్ స్పేస్ సెటిల్‌మెంట్ డిజైన్ కాంటెస్ట్‌లోనూ దోపిడీకి తెరతీసింది శ్రీచైతన్య. దీని కోసం చురుకైన ధనవంతుల పిల్లలకు ఎరవేస్తుంది. అమెరికా వెళ్ళి రావడానికి 4.5 నుండి 5 లక్షలు ఖర్చు పెట్టగలిగే విద్యార్థులను ఏరి కోరి ఎంపిక చేసుకుంటుంది. డబ్బులేమో విద్యార్థులవి, పేరేమో శ్రీచైతన్యకి. ఎంత దారుణమైన గేమ్ అడుతుందో తల్లిదండ్రులారా గమనించండి.
లాభసాటి యాపారం !
శ్రీచైతన్యలో చదువుతున్న దాదాపు 4 లక్షల మంది స్కూల్ విద్యార్థుల నుండి వడపోసి 18000 మంది చురుకైన విద్యార్థులను సెలక్ట్ చేసుకుంది శ్రీచైతన్య. అనంతరం ఇండివిడ్యువల్ (ఒక్కరు), స్మాల్ గ్రూప్, లార్జ్ గ్రూప్ పేరుతో విద్యార్థులచే ప్రాజెక్ట్ డిజైన్‌తో పాటు కాంటెస్ట్‌లో పాల్పొనేందుకు ఆసక్తి గల వారిని డబ్బులు తీసుకురమ్మంటుంది. వ్యక్తిగతంగా ఒక్కరు పాల్పొనే విద్యార్థికి రూ.10000/-, స్మాల్ గ్రూప్ వారికి ఒక్కోక్కరికీ రూ. 5000/-, లార్జ్ గ్రూప్ వారికి ఒక్కొక్కరికీ రూ. 3000/- చొప్పున వసూలు చేస్తోంది. కానీ ప్రతి విద్యార్థి కాంటెస్ట్‌లో పాల్పొనటానికి నేషనల్ స్పేస్ సొసైటీకి కట్టే ఫీజు కేవలం 10 డాలర్లు ( రూ. 850)మాత్రమే. మిగతాది అంతా శ్రీచైతన్య ఖాతాలో వేసుకుంటోంది. ఒక్క 2023లోనే నాసా కాంటెస్ట్ నుండి శ్రీచైతన్య కూడగట్టిన లాభం ఎంతో తెలుసా ....అక్షరాలా 8 కోట్ల 40 లక్షలు.
సెలక్ట్ అయినవి 28 ప్రాజెక్టులు మాత్రమే !
2023-24లో ఇండియా నుండి 31 ప్రాజెక్టులు సెలక్టయితే అందులో 28 శ్రీచైతన్య విద్యార్థులు సాధించారు. ఇండివిద్యువల్ విభాగంలో ఒక్కరు కూడా సెలక్ట్ కాకపోవటం విశేషం. 18000 మంది విద్యార్థులతో కేవలం 28 ప్రాజెక్టులు సాధించటం ఎలాంటి విజయమో తల్లిదండ్రులారా ఆలోచించండి. ఇక పోతే నాసా కోసం తయారు చేసే ప్రాజెక్టులు కూడా స్టూడెంట్స్ చేయరు. స్టూడెంట్స్‌కి ఆయా కాన్సెప్టులపై కేవలం అవగాహన కల్పిస్తుంది. అంతే మిగతాది అంతా శ్రీచైతన్య నాసా టీమ్ తయారు చేస్తుంది. ప్రాజక్ట్ డిజైన్లు, సమాచారం అంతా ఇంటర్‌నెట్ నుండి సేకరించి నాసా కాంటెస్ట్‌కి పంపించటం జరుగుతుంది. స్టూడెంట్స్‌కి ప్రజంటేషన్ స్కిల్స్ నేర్పి మమ అన్పిస్తారు. కావాలంటే శ్రీచైతన్యలో చదివి నాసా ప్రాజెక్టుల్లో విజయం సాధించిన ఏ ఒక్క విద్యార్థి సైంటిస్ట్ అయిన దాఖలాలు లేవు, అసలు ఏ ఇతర పోటీపరీక్షల్లో టాప్ ర్యాంకులు కూడా సాధించక పోవటం గమనార్హం.
0 Comments