Ticker

6/recent/ticker-posts

VARSITY : కంపెనీలు అన్నీ ఒకరివే...మరి ఎందుకు కనికట్టు !


  • వర్సిటీ ఎడ్యుకేషన్‌ సృష్టించిన షెల్‌ సోదరులు ! 
  • రూ. 1200 కోట్లు ఏమయ్యాయి ?  
  • కంపెనీలు అన్నీ ఒకరివే...మరి ఎందుకు కనికట్టు !

లాభాలను ఆశించి మాత్రమే ఏ కంపెనీ అయినా మరో కంపెనీలో పెట్టుబడులు పెడుతుంది. కానీ శ్రీచైతన్య యాజమాన్యం ఆధ్వర్యంలోని కంపెనీల్లో ఎలాంటి లాభాలు లేని, కార్యకలాపాలు లేని కంపెనీల్లోకి కేవలం 2 ఏళ్ళ వ్యవధిలోనే రెండు కంపెనీల్లో రూ. 1200 కోట్లు పెట్టుబడులు పెట్టింది. శ్రీవిద్య ఇన్‌ఫ్రాస్ట్రక్చర్స్‌ ప్రై.లి. కంపెనీకి రూ.600 కోట్లు, అప్‌టౌన్‌ లైఫ్‌ ప్రాజెక్ట్స్‌ ప్రై.లి. కంపెనీకి రూ.600 కోట్లు అప్పుల రూపంలో బదలాయించింది. దీనికి బదులుగా ఆయా కంపెనీల షేర్లు అన్నీ వర్సిటీకి తనఖా పెట్టబడ్డాయి. అసలు ఉత్తుత్తి (డొల్ల)కంపెనీల్లో వర్సిటీ ఎందుకు పెట్టుబడులు పెడుతోంది. పన్ను ఎగవేత కోసమే ఇతర డొల్ల కంపెనీల్లో పెట్టుబడులు చూపిస్తున్నట్లు నిపుణులు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.

షెల్‌ కంపెనీల్లోకి వచ్చిన నిధులు ఏమయ్యాయి !

వర్సిటీ ఎడ్యుకేషన్‌ మేనేజ్‌మెంట్‌ ప్రై.లి. నుండి వచ్చిన దాదాపు 1200 కోట్లు ఏమయ్యాయి. అయ్యప్పసొసైటీలోని సంతోష్‌ టవర్‌ చిరునామాతో రిజిస్టర్‌ అయిన రెండు కంపెనీలు ఎలాంటి కార్యకలాపాలు నిర్వహించటం లేదు. ఇక్కడ గమనించాల్సిన ఇంకో ముఖ్య విషయం ఏమిటంటే వర్సిటీ ఎడ్యుకేషన్‌ మేనేజ్‌మెంట్‌ ప్రై.లి. కంపెనీ యాజమాన్యం శ్రీవిద్య ఇన్‌ఫ్రాస్ట్రక్చర్స్‌ ప్రై.లి. మరియు అప్‌టౌన్‌ లైఫ్‌ ప్రాజెక్ట్స్‌ ప్రై.లి. సంస్థల యాజమాన్యం ఒక్కటే. అందుకే వందల కోట్లు బ్లాక్‌ మనీని వైట్‌ మనీగా మార్చుటంతో పాటు విదేశాలకి మనీని ట్రాన్స్‌ఫర్‌ చేసి బీనామీల పేరు మీద ఆస్తులు కొనుగోలు చేస్తున్నట్లు ఆరోపణలు వెలువెత్తుతున్నాయి.

అసలు శ్రీవిద్య ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ పై.లి.లో ఏం జరుగుతోంది.

2019 కేవలం లక్షరూపాయల అథరైడ్జ్‌ క్యాపిటల్‌తో 10000 షేర్స్‌తో మొదలైన ప్రస్థానం 11 జూన్‌ 2021 నాటికి లక్ష నుండి 150 కోట్లకు తన అథరైడ్జ్‌ క్యాపిటల్‌ పెంచేసింది. ఒకేసారి ఇంత మొత్తం ఎక్కడ నుండి వచ్చింది అంటే వర్సిటీ ఎడ్యుకేషన్‌ మేనేజ్‌మెంట్‌ ప్రై.లి. నుండి అన్‌సెక్యూర్డ్‌ రుణాన్ని పొందింది. అనంతరం 25 ఫిబ్రవరి 2022 మరోసారి రూ. 150 కోట్ల నుండి 300 కోట్లకు కంపెనీ అథరైడ్జ్‌ క్యాపిటల్‌ను పెంచేసింది. వందల కోట్లు కంపెనీలోకి వచ్చి పడ్డాయి. అనంతరం 15 డిసెంబర్‌ 2022లో రూ. 300 కోట్లు ఉన్న శ్రీవిద్య ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ అథరైడ్జ్‌ క్యాపిటల్‌ అమాంతం రూ. 400 కోట్లకు పెంచింది. మరోసారి కంపెనీలోకి వర్సిటీ నుండి డబ్బులు పడ్డాయి. మరోసారి జూలై 10 2023 రూ. 400 కోట్లు ఉన్న ఆథరైడ్జ్‌ క్యాపిటల్‌ రూ. 600 కోట్లకు పెంచేసింది. ప్రతి 8 నెలల కాలంలో ఒకసారి అప్పుల రూపంలో వర్సిటీ నుండి శ్రీవిద్య ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌లోకి కోట్లాది రూపాయలను మళ్ళించారు. వర్సిటీ ఎడ్యుకేషన్‌ మేనేజ్‌మెంట్‌ నుండి మనీ వచ్చినట్లు అగ్రిమెంట్స్‌లు, షేర్ల బదలాయింపు, కంపెనీ మీటింగ్‌లు జరిగినట్టు చూపించారు, కానీ శ్రీవద్య ఇన్‌ఫ్రా నుండి మళ్ళీ వర్సిటీ ఎడ్యుకేషన్‌ మేనేజ్‌మెంట్‌కి డబ్బులు తిరిగి చెల్లించిన పత్రాలు ఒక్కటీ లేదు. శ్రీవిద్య ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ కంపెనీలో 99.99% షేర్‌ విలువ అంతా వర్సిటీ ఎడ్యుకేషన్‌ మేనేజ్‌మెంట్‌ ప్రై.లి. పేరు మీద బదలాయించారు. ఇక్కడ అంతా బాగానే ఉన్నా...శ్రీవిద్య ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌లోకి గత 3 ఏళ్ళలో వచ్చిన వందల కోట్ల రూపాయల సంబంధించిన వివరాలు ఎక్కడున్నాయి. ఆ నిధులన్నీ ఎటువైపు దారి మళ్ళాయి. రియల్‌ ఎస్టేట్‌లో ఎలాంటి కార్యకలాపాలకు వినియోగించింది అంటే సమాధానం లేదు, సాక్ష్యాలు లేవు.  శ్రీవిద్య ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ ఫేక్‌ కంపెనీ అనడానికి వారి ఇచ్చిన చిరునామా, కరెంట్‌ బిల్‌ మరియు అడ్రస్‌ ప్రూఫ్‌ కోసం పెట్టిన డాక్యుమెంట్స్‌ చూస్తే ఇట్టే అర్థం అవుతుంది.



అసలు అప్‌టౌన్‌ లైఫ్‌ ప్రాజెక్ట్స్‌ పై.లి. ఏం జరుగుతోంది.

అప్‌టౌన్‌ లైఫ్‌ ప్రాజెక్ట్స్‌ పై.లి. 2019 లక్షరూపాయల అథరైడ్జ్‌ క్యాపిటల్‌తో 10000 (బొప్పన రaాన్సీలక్ష్మీ బాయి 5000 , బొప్పన సీమ 5000) షేర్స్‌తో మొదలైన ప్రస్థానం 19 జూన్‌ 2021 నాటికి లక్ష నుండి 150 కోట్లకు తన అథరైడ్జ్‌ క్యాపిటల్‌ పెంచేసింది. ఒకేసారి ఇంత మొత్తం ఎక్కడ నుండి వచ్చింది అంటే వర్సిటీ ఎడ్యుకేషన్‌ మేనేజ్‌మెంట్‌ నుండి అన్‌సెక్యూర్డ్‌ రుణాన్ని పొందింది. అనంతరం 25 ఫిబ్రవరి 2022 మరోసారి రూ. 150 కోట్ల నుండి 300 కోట్లకు కంపెనీ అథరైడ్జ్‌ క్యాపిటల్‌ను పెంచేసింది. వందల కోట్లు కంపెనీలోకి వచ్చి పడ్డాయి. అనంతరం 15 డిసెంబర్‌ 2022లో రూ. 300 కోట్లు ఉన్న శ్రీవిద్య ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ అథరైడ్జ్‌ క్యాపిటల్‌ అమాంతం రూ. 400 కోట్లకు పెంచింది. మరోసారి కంపెనీలోకి వర్సిటీ నుండి డబ్బులు పడ్డాయి. మరోసారి జూలై 10 2023 రూ. 400 కోట్లు ఉన్న ఆథరైడ్జ్‌ క్యాపిటల్‌ రూ. 600 కోట్లకు పెంచేసింది. ప్రతి 8 నెలల కాలంలో ఒకసారి అప్పుల రూపంలో వర్సిటీ నుండి శ్రీవిద్య ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌లోకి కోట్లాది రూపాయలను మళ్ళించారు. వర్సిటీ ఎడ్యుకేషన్‌ మేనేజ్‌మెంట్‌ నుండి మనీ వచ్చినట్లు అగ్రిమెంట్స్‌లు, షేర్ల బదలాయింపు, కంపెనీ మీటింగ్‌లు జరిగినట్టు చూపించారు, కానీ అప్‌టౌన్‌ లైఫ్‌ ప్రాజెక్ట్స్‌ నుండి మళ్ళీ వర్సిటీ ఎడ్యుకేషన్‌ మేనేజ్‌మెంట్‌కి డబ్బులు తిరిగి చెల్లించిన పత్రాలు ఒక్కటీ లేదు. కంపెనీకి ఉన్న 60 కోట్ల షేర్లలో 37, 88,61473 షేర్లు వర్సిటీ ఎడ్యుకేషన్‌ మేనేజ్‌మెంట్‌ అధీనంలో ఉన్నాయి. మిగతావి కూడా బొప్పన సీమ, బొప్పన రaాన్సీలక్ష్మీ భాయి అథీనంలోనే ఉన్నాయి. మొత్తంగా షెల్‌ కంపెనీలు సృష్టించటం వాటిల్లోకి పెట్టుబడుల రూపంలో నిధులు మళ్ళించటం ఆయా కంపెనీల షేర్లు వర్సిటీ ఆధీనంలో ఉన్నట్లు చూపటం ఒక తంతులా జరుగుతోంది. ఇంకా చెప్పాలి అంటే  వర్సిటీ ఎడ్యుకేషన్‌ మేనేజ్‌మెంట్‌ నుండి మనీ వచ్చినట్లు అగ్రిమెంట్స్‌లు, షేర్ల బదలాయింపు, కంపెనీ మీటింగ్‌లు జరిగినట్టు చూపించారు, కానీ అప్‌టౌన్‌ లైఫ్‌ ప్రాజెక్ట్స్‌ నుండి మళ్ళీ వర్సిటీ ఎడ్యుకేషన్‌ మేనేజ్‌మెంట్‌కి డబ్బులు తిరిగి చెల్లించిన పత్రాలు ఒక్కటీ లేదు. కంపెనీ బ్యాలెన్స్‌ షీట్స్‌, యాన్సువల్‌ రిటన్స్‌ కూడా దాఖలు చేయలేదు. ఈ కంపెనీల్లోకి వెళ్ళిన సొమ్ము అంతా సొంత ఖాతాల ద్వారా భూములు, సొంత బిల్డింగ్‌లు కొనుగోలు చేస్తున్నట్లు ఆరోపణలు ఉన్నాయి



Post a Comment

0 Comments

Popular Posts

Resonance Schools : J.D.లక్ష్మీనారాయణ రెజొనెన్స్‌కి ప్రచారకర్తగా మారారా ?
Resonance Schools : టీచర్లు లేకుండా బోధన ఎలా ?
Kadapa Sri Chaitanya : శ్రీచైతన్య హాస్టల్స్‌లో ఆగని మరణమృదంగం !
Physics Wallah : 'సరసమైన ధరకే చదువు' ఫిజిక్స్‌ వాలా IPOని గట్టెక్కిస్తుందా ?
Sri Chaitanya Fake Olympiads : ఆగని శ్రీచైతన్య ఫేక్‌ ఒలింపియాడ్స్‌ దందా !
Sri Chaitanya Score Scholarship : శ్రీచైతన్య రూ.350 కోట్లు మాయాజాలం !
sri chaitanya : తవ్వేకొద్ది బయటపడుతున్న శ్రీచైతన్య షెల్‌ కంపెనీల అక్రమాలు !
Resonance Schools : పర్మిషన్లు లేకుండా అడ్మిషన్లు ఎలా ?
Sri Chaitanya Sisters : శ్రీచైతన్య షెల్‌ కంపెనీల గుట్టు రట్టు !
Sri Chaitanya Prodigy : తల్లిదండ్రులపై మోయలేని పెనుభారం !