Ticker

6/recent/ticker-posts

Sri Chaitanya : పొలిటికల్‌ పార్టీలకు ఫండిరగ్‌ కోసం...శ్రీచైతన్య స్టూడెంట్స్‌ ఫెసిలిటీస్‌ మేనేజ్‌మెంట్‌

శ్రీచైతన్య విద్యాసంస్థల్లో స్టూడెంట్స్‌ వరుస మరణాలు సంభవిస్తున్నా తెలుగు రాష్ట్రాల్లోని అధికారుల తీరు నిమ్మకు నీరెత్తినట్టు ఉంటుంది. ఆయా పోలీస్‌ స్టేషన్ల పరిధిలో కేవలం కేసుల నమోదు తప్పించి చర్యలు తీసుకున్న దాఖలాలు శూన్యం. ఎలాంటి అనుకోని సంఘటనలు జరిగినా పార్టీలకు సంబంధించిన అధినాయకుల ఒత్తిడితో అన్నీ వాటికవే సమసిపోతాయి. అందుకుగాను పొలిటికల్‌ పార్టీలకు శ్రీచైతన్య యాజమాన్య కంపెనీ అయిన SRI CHAITANYA STUDENT FACILITY MANAGEMENT PVT LTD కంపెనీ నుండి భారీ మొత్తంలో విరాళాలు చేరిపోతాయి. ఇలా పొలిటికల్‌ పార్టీలను, ముఖ్యమైన నాయకుల తమ గుప్పిట్లో పెట్టుకుని ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తోంది. కోచింగ్‌ సెంటర్లకు అనుమతులు లేకపోయినా చర్యలు తీసుకోరు, ఫీజులు అడ్డగోలుగా వసూలు చేస్తున్న పట్టించుకోరు, విద్యార్థులు బలవన్మరణాలకు పాల్పడుతున్నా చూసిచూడనట్టు వ్యవహరిస్తారు. విద్యారంగాన్ని ప్రైవేటు రంగానికి అప్పగించి ప్రభుత్వాలు వేడుక చూస్తున్నాయి.

రాజకీయ పార్టీలకు భారీ విరాళం !

SRI CHAITANYA STUDENT FACILITY MANAGEMENT PVT LTD   ఏప్రిల్‌ 8, 2022న బీఆర్‌ఎస్‌ పార్టీకి రూ. 10 కోట్లు , శ్రీచైతన్య మరో కంపెనీ అయిన VARSITY EDUCATION MANAGEMENT PVT LTD పేరు మీద బీఆర్‌ఎస్‌ పార్టీకి మరో రూ. 2 కోట్లు మొత్తం రూ. 12 కోట్లు బీఆర్‌ఎస్‌ పార్టీకి ఎలక్టోరల్‌ బాండ్స్‌ ద్వారా పార్టీకి విరాళాలు అందించింది. వీటితో పాటు జనవరి 11, 2024న తెలుగుదేశం పార్టీకి 5 కోట్లు , జనవరి 11, 2024న జనసేన పార్టీకి  రూ.1 కోటి చెల్లింపులు జరిపింది. కేవలం పార్టీ ఫండ్‌ కోసం కోట్ల విలువైన ఎలక్టోరల్‌ బాండ్లను కొనుగోలు చేసినట్లు ఈసీ రికార్డుల్లో తేలింది. అద్దె చెల్లింపుల కోసం ఓనర్లను ఇబ్బందులకు గురి చేసే శ్రీచైతన్య యాజమాన్యం తన కంపెనీలపై ఎటువంటి చర్యలు తీసుకోకుండా రాజకీయ పార్టీలకు నిధులు సమకూర్చుతుంది. ప్రభుత్వంలోని పెద్దల అండతో అధికారులపై వత్తిడి పెంచి శ్రీచైతన్య సంస్థల్లో జరిగే లోపాలు, అవకతవలపై నోరెత్తకుండా ఈ విరాళాలు అందిస్తున్నట్లు తెలుస్తోంది.

బిల్డింగ్‌ అద్దెలు చెల్లించకుండా యజమానులకు ఇబ్బందులు !

మరో వైపు SRI CHAITANYA STUDENT FACILITY MANAGEMENT PVT LTD శ్రీచైతన్య అద్దెకు తీసుకున్న భవనాలకు రెంట్‌ చెల్లించకుండా యజమానులను ఇబ్బందులకు గురి చేస్తోంది. ఆ వివరాల్లోకి వెళితే...విజయవాడ, గూడవల్లిలోని సర్వే నెంబరు : 183/ 212 లోని స్థలంలోని బిల్డింగ్‌కి రూ. 2,60,20,843/- అద్దె చెల్లించని కారణంగా ఆ బిల్డింగ్‌ యజమాని కె. రామ మోహన రావు ఏకంగా శ్రీచైతన్య యాజమాన్యంపై దివాలా పరిష్కార ప్రక్రియకు దిగారు. దీనికోసం ముంబాయిలోని నేషనల్‌ కంపెనీ లా ట్రిబ్యునల్‌ను సంప్రదించారు. దీంతో దిగి వచ్చిన యాజమాన్యం ఇవ్వవలసిన అద్దె బకాయిలను చెల్లించి 11 జూలై 2023న సెటిల్‌మెంట్‌ చేసుకుంది. చట్టపరంగా దివాలా వేటును తప్పించుకుంది. కానీ ఎక్కడాSRI CHAITANYA STUDENT FACILITY MANAGEMENT PVT LTD తన కంపెనీ ఆబ్జక్ట్‌లో చూపిన విధంగా హోటల్స్‌ కానీ, మోటెల్స్‌ కానీ ఎక్కడా నిర్వహించటం లేదు. శ్రీచైతన్య విద్యాసంస్థలకు సంబంధించిన హాస్టల్స్‌ నిర్వహణను శ్రీచైతన్య స్టూడెంట్స్‌ ఫెలిసిటీస్‌ మేనేజ్‌మెంట్‌ ప్రై.లి. తన కార్యకలాపాలుగా చూపుతూ శ్రీచైతన్య విద్యాసంస్థల సొసైటీలలోని డబ్బును ఈ కంపెనీలోకి తరలిస్తోంది. శ్రీచైతన్య స్టూడెంట్స్‌ ఫెలిసిటీస్‌ మేనేజ్‌మెంట్‌ ప్రై.లి నుండి షేర్‌ల రూపంలో వర్సిటీ ఎడ్యుకేషన్‌ మేనేజ్‌మెంట్‌ కంపెనీకి తరలిస్తోంది. శ్రీచైతన్య స్టూడెంట్స్‌ ఫెలిసిటీస్‌ మేనేజ్‌మెంట్‌ ప్రై.లి కంపెనీకి రోజు వారీ కార్యకలాపాలు లేవు,  02-06-2021 నాటికి 367,68,30,000 కోట్లు కంపెనీ రిజర్వ్‌ క్రింద చూపింది. ఆ రిజర్వ్‌లు ఎలా వచ్చాయి , ఏ వ్యాపారం మీద అంత లాభం వచ్చింది. అన్నింటినీ మించి రాజకీయ పార్టీలకు ఇన్ని కోట్లు విరాళాలుగా ఎలా ప్రకటిస్తోంది అని మిలియన్‌ డాలర్ల ప్రశ్న. శ్రీచైతన్య స్టూడెంట్స్‌ ఫెలిసిటీస్‌ మేనేజ్‌మెంట్‌ ప్రై.లి తన చిరునామాగా చూపిన ప్లాట్‌ నెం. 80, శ్రీ సాయి ప్లాజా, అయ్యప్ప సొసైటీ, మాదాపూర్‌లో వర్సిటీ ఎడ్యుకేషన్‌ మేనేజ్‌మెంట్‌ ప్రై.లి.కు చెందిన కార్యకలాపాలే నడుస్తున్నాయి.

Post a Comment

0 Comments

Popular Posts

Sri Chaitanya : వర్సిటీ మూసివేత ! శ్రీచైతన్య ఉద్యోగుల్లో కలవరం ?
JEE MAIN 2025 ఫలితాల్లో మరో సరికొత్త మోసానికి తెరతీసిన శ్రీచైతన్య !
 SRI CHAITANYA : షెల్‌ కంపెనీలతో  శ్రీచైతన్య డైరెక్టర్ల అంతులేని అక్రమాలు !
IT RIDES : రూ. 230 కోట్లకు పైగా పన్ను ఎగవేతకు పాల్పడిన శ్రీచైతన్య !
Suicides in Sri chaityana Hostels: కార్పొరేట్‌ హాస్టల్స్‌లో ఘోషిస్తున్న ఆత్మలు !
INFINITY LEARN : ర్యాంక్‌గురు (ఇన్ఫినిటీ లెర్న్‌ ) మరో బైజూస్‌ కానుందా ?
Sri Chaitanya Hostel : శ్రీచైతన్యపై చర్యలు ఉండవా ? రంగంలోకి AP ‘ముఖ్య’నేత !?
Sri chaitanya Block Money : శ్రీచైతన్య...నల్లధనం కేరాఫ్‌గా వర్సిటీ !
Score Edge 2024 : చీటింగ్‌ శ్రీచైతన్య ! రూ. 1000 కోట్లు బోగస్‌ స్కాలర్‌షిప్‌ !!
INFINITY META APP : ఆన్‌లైన్‌ పేరుతో ఇన్ఫినిటీ దోపిడీ !