INFINITY LEARN బై శ్రీచైతన్య పేరుతో నడుస్తున్న సంస్థకు మాతృసంస్థ అయిన RANK GURU TECHNOLOGY SOLUTIONS PVT LTD 2021 సంవత్సరంలో ONLINE EDUCATION కోసం స్థాపించబడిరది. 2021 సంవత్సరంలోనే ఎన్నో ఒడుదుడుకులు ఎదుర్కొని రూ. 37 కోట్ల నష్టాన్ని చవిచూసింది. అక్కడ నుండి ఒక్కసారి పుంజుకుని 2022-23 ఆర్థిక సంవత్సరానికి రూ. 100 కోట్ల టర్నోవర్ సాధించిన సంస్థగా ప్రచారం చేసుకుంది. అలాగే 2023-24 ఆర్థిక సంవత్సరానికి రూ. 200 కోట్ల పైనే టర్నోవర్ సాధించినట్లు పేర్కొంది. ఆన్‌లైన్ ఎడ్యుకేషన్ బిజినెస్‌లో అగ్రగామిగా తనను తాను ప్రకటించుకుంది. కానీ ఇక్కడే పెద్ద మతలబు దాగి ఉంది. RANK GURU TECHNOLOGY SOLUTIONS PVT LTD ఆదాయపన్ను శాఖకు చూపే లాభనష్టాల ఖాతాలో VARSITY EDUCATION MANAGEMENT PVT LTD కంపెనీ నుండి డిబెంచర్ల రూపంలో అప్పులు తీసుకువచ్చినట్లు చూపింది. అప్పులను ఆదాయంగా చూపుతూ బురిడీ కొట్టిస్తున్న ర్యాంక్‌గురు !
అదాయపన్ను శాఖకేమో వర్సిటీ ఎడ్యుకేషన్ మేనేజ్‌మెంట్ ప్రై.లి. కంపెనీ నుండి డిబెంచర్ల రూపంలో 5 సంవత్సరాల కాలానికి అప్పు తీసుకున్నట్లు చూపిస్తోంది. మరో వైపు RANK GURU TECHNOLOGY SOLUTIONS PVT LTD కంపెనీ రూ.100ల కోట్లతో పురోగతి చెందుతున్నట్లు పత్రికల్లో సమాచారం ఇస్తూ బురిడీ కొట్టిస్తోంది. అసలు ర్యాంక్‌గురు ఎందుకు డబుల్ గేమ్ ఆడుతోంది. లేని కంపెనీ ఆదాయాన్ని ఉన్నట్లు ఎందుకు చూపుతోంది. సత్యం రామలింగరాజు కంపెనీ తరహాలోనే లేని ఆదాయాన్ని చూపి భారీ స్కామ్‌కు పాల్పడబోతోందా లేక బైజూస్ లాగా కుప్పకూలబోతున్న ర్యాంక్‌గురును అప్పులతో నెట్టుకొచ్చి చేతులు ఎత్తేయనుందా అన్నది భవిష్యత్తే నిర్ణయించనుంది.
అసలు ఏంటి డిబెంచర్ల కథ !
డిబెంచర్లు అంటే ప్రజల నుండి మూలధనాన్ని సేకరించడానికి కంపెనీలు జారీ చేసే దీర్ఘకాలిక ఆర్థిక సాధనాలు. అవి భవిష్యత్తులో ఒక నిర్దిష్ట తేదీలో స్థిర వడ్డీ రేటుతో కంపెనీ చట్టబద్ధంగా తిరిగి చెల్లించాల్సిన ఒక రకమైన రుణం. వాటాదారుల మాదిరిగా కాకుండా, డిబెంచర్లను కలిగి ఉన్న వ్యక్తులు కంపెనీలో ఏ హోదాని కలిగి ఉండరు. బదులుగా, వారు ఇచ్చిన డబ్బును వడ్డీతో తిరిగి చెల్లిస్తామని కంపెనీ నుండి డిబెంచర్ రూపంలో వాగ్దానం కలిగి ఉంటారు. కానీ ప్రజల నుండి కాక VARSITY EDUCATION MANAGEMENT PVT LTD కంపెనీ నుండి 5 సంవత్సరాల కాలానికి గాను 250 కోట్లను డిబెంచర్ల రూపంలో RANK GURU TECHNOLOGY SOLUTIONS PVT LTD అప్పులు సేకరించింది. ఈ VARSITY EDUCATION MANAGEMENT PVT LTD సంస్థ ఎవరిదో కాదు, SRI CHAITANYA MANAGEMENT యాజమాన్యం ఆధ్వర్యంలో నడిచే ప్రధానమైన ప్రైవేట్ లిమెటెడ్ కంపెనీ. 21-12-2022 నాటికి 105 కోట్లు విలువైన డిబెంచర్లు కేటాయించి వర్సిటీ నుండి అప్పు పొందింది. కానీ ఇక్కడే ఒక మతలబు ఉంది. ర్యాంక్‌గురు టెక్నాలజీస్ తన 2022-23 ఆర్థిక సంవత్సరానికి 100 కోట్ల స్ట్రాంగ్ రెవిన్యూ గ్రోత్‌తో లాభాలు సాధిస్తున్నట్లు ప్రచారం చేసుకుంది. అలాగే 2023-24 ఆర్థిక సంవత్సరానికి స్థిరమైన రెవెన్యూ గ్రోత్‌తో 200 కోట్లకు పైగా కంపెనీ టర్నోవర్ ఎగబాకినట్లు తెలిపింది. ఇదంతా కేవలం రెండు సంవత్సరాల్లోనే సాధించిన ఘనతగా పేర్కొంది. ఇదంతా చూస్తుంటే ర్యాంకుగురు టెక్నాలజీ సొల్యుషన్ ప్రై.లి. పలు అనుమానాలు రేకెత్తుతున్నాయి.

0 Comments