Ticker

6/recent/ticker-posts

INFINITY META APP : ఆన్‌లైన్‌ పేరుతో ఇన్ఫినిటీ దోపిడీ !



శ్రీచైతన్యలో తమ పిల్లల్ని చేర్చిన తల్లిదండ్రులూ ఇప్పుడు నిలువుతోపిడీకి గురైవుతున్నారు. ఫీజులతో సరిపెట్టుకుంటుందా అంటే అదీ లేదు, ఒలింపియాడ్స్‌ ఎగ్జామ్స్‌, స్కాలర్‌షిప్‌ ఎగ్జామ్స్‌, INFINITY ONLINE APP పేరుతో అడ్డగోలుగా అదనపు ఫీజులు వసూలు చేస్తూ  తల్లిదండ్రుల నడ్డి విరుస్తోంది శ్రీచైతన్య యాజమాన్యం. ఈ అదనపు ఫీజులు అసలు ఫీజులకు సమానంగా ఉంటున్నాయి అంటే అతిశయోక్తి కాదు. శ్రీచైతన్యలో చేర్పించటమే తల్లిదండ్రుల పాపం అన్నట్టు తయారైంది. డైరెక్ట్‌గా క్లాస్‌రూమ్‌లో లెక్చరర్స్‌ మధ్య క్లాసులు జరుగుతుండగా, ONLINE APP యాప్‌లకు శ్రీచైతన్య ఫీజలు ఎందుకు వసూలు చేస్తోందో తెలియక తల్లిదండ్రులు తలలు పట్టుకుంటున్నారు. కరోనా సమయంలో డైరెక్ట్‌ కాంటాక్ట్‌ లేని సమయంలో ఆన్‌లైన్‌ ద్వారా బోధన ఏర్పాటు చేసుకున్న యాప్‌లను ఇంకా తల్లిదండ్రులపై బలవంతంగా రుద్ది ముక్కు పిండి ఫీజులు వసూలు చేస్తున్నారు అని విద్యార్థులు, తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు.

బలవంతంగా ఇన్ఫినిటీ వసూళ్ళు !

దేశవ్యాప్తంగా ఉన్న శ్రీచైతన్య స్కూల్స్‌ మరియు కాలేజ్‌లలో చదివే 9 లక్షల మంది దగ్గర నుండి INFINITY META JR APP పేరుతో స్కూల్‌ పిల్లల దగ్గర రూ. 3000/-   INFINITY LEARN APP పేరుతో కాలేజీ విద్యార్థుల దగ్గర రూ. 5000/- ముక్కుపిండి వసూలు చేస్తోంది శ్రీచైతన్య. ప్రతి స్టూడెంట్‌ నుండి రూ. సరాసరిన రూ. 4000/- చొప్పుశ్రీ కోటానుకోట్ల రూపాయలు వసూలు చేస్తోంది. ఈ నిధులన్నీ నెక్ట్‌జన్‌ ఎడ్యుకేషనల్‌ సొసైటీ నుండి శ్రీచైతన్య యాజమాన్యం ఆధ్వర్యంలోని ర్యాంక్‌గురు టెక్నాలజీ సొల్యుషన్స్‌ ప్రై.లి. కంపెనీలోకి తరలిస్తోంది. అసలు ఈ యాప్‌ని వినియోగించుకునే వారి సంఖ్య అత్యల్పం. దీని వలన ప్రయోజనం లేదని తల్లిదండ్రులు వాపోతున్నారు. పుస్తకాలతో పాటు యాప్‌కి కూడా డబ్బు కడితేనే పుస్తకాలు ఇస్తామని బ్లాక్‌మెయిల్‌ చేస్తున్నారని తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. ఈ దోపిడీని అడ్డుకోవలసినదిగా ప్రభుత్వాలను కోరుతున్నారు. పైకి ఇన్ఫినిటీ మెటా జూనియర్‌ యాప్‌ ఉచితం అని చెప్తూనే డబ్బుల చెల్లించిన శ్రీచైతన్య విద్యార్థులకు మాత్రమే యాక్సిస్‌ కల్పిస్తోంది.

క్లాస్‌రూమ్‌లో డైరెక్ట్‌గా బోధిస్తున్నప్పుడు ఆన్‌లైన్‌తో పనేంటి ?

నిర్ణీత ఫీజుతోనే ఒక తరగతిలోని అన్ని పరీక్షలతో పాటు అన్ని సౌకర్యాలు అందించాలి. కానీ శ్రీచైతన్య బుక్స్‌కి ఎక్స్‌ట్రా, డ్రస్‌కి ఎక్స్‌ట్రా, ఒలింపియాడ్స్‌కి ఎక్స్‌ట్రా,  INFINITY META JR APPకి ఎక్స్‌ట్రా.. ఇలా తల్లిదండ్రుల్ని వివిధ రకాల ఫీజుల పేరుతో స్కూల్‌ ఫీజు కన్నా ఎక్కువగా దోచుకుంటోంది శ్రీచైతన్య. శ్రీచైతన్యలో చదువుతున్న వారికి మళ్ళీ ప్రత్యేకంగా యాప్‌ అవసరం లేదు. డైరెక్ట్‌గా అన్నీ శిక్షణలో భాగంగా అందించవలసి ఉంటుంది. యాప్‌ అవసరం ఉందీ అంటే డైరెక్ట్‌గా శ్రీచైతన్యలో యాప్‌ వాడకుండా టీచింగ్‌ అందించలేకపోతున్నారా అన్న సందేహాలు తలెత్తుతున్నాయి. శ్రీచైతన్య దోపిడీకి అలవాటు పడిరది అని ఈ విషయం చెప్పకనే చెబుతోంది. INFINITY META JR APP వలన ఏమైనా ఉపయోగం ఉందా అంటే అదీ లేదు. కనీసం యాప్‌ని ఓపెన్‌ చేయని వాళ్ళ సంఖ్య లక్షల్లో ఉంటుంది అంటే అతిశయోక్తి కాదు.  

శ్రీచైతన్య స్టూడెంట్సే ఇన్ఫినిటీలెర్న్‌ ఆదాయవనరులు !

ఇన్ఫినిటీ లెర్న్‌ బై శ్రీ చైతన్య, భారతదేశం యొక్క ఏకైక ఎడ్‌టెక్‌ ప్లాట్‌ఫారమ్‌. ఎడ్‌టెక్‌ పరిశ్రమలో అత్యంత వేగవంతమైన అభివృద్ధి కనబరచిన స్టార్టప్‌గా తనను తాను ప్రకటించుకుంది. 2021-22లో కేవలం 37 కోట్ల నష్టంతో ఉన్న కంపెనీ 2022-23లో కార్యకలాపాల ద్వారా కంపెనీ ఆదాయం 100 కోట్లకు చేరుకున్నట్లు ప్రకటించింది. మార్చి 31, 2023తో ముగిసే ఆర్థిక సంవత్సరంలో కంపెనీ ఆదాయం రూ. 100 కోట్లు ప్రకటించింది. 2023`24 ఆర్థిక సంవత్సరానికి 200 కోట్లపైన ఆదాయం ప్రకటించింది. ప్రస్తుతం, ఇన్ఫినిటీ లెర్న్‌ దాని ప్లాట్‌ఫారమ్‌లో 7.5 మిలియన్లకు పైగా సబ్‌స్క్రైబర్‌లను కలిగి ఉంది మరియు 7.5 మిలియన్ల మంది అభ్యాసకులు ఏదో ఒక రూపంలో కంటెంట్‌ను యాక్సెస్‌ చేస్తున్నట్టు ప్రకటించింది. బైజూస్‌ లాంటి ఆన్‌లైన్‌ కార్పొరేట్‌ దిగ్గజం ఆన్‌లైన్‌ ద్వారా ఆదాయం లేక నష్టాల బాటలో పయనించి మూసివేత దగ్గరలో ఉంటే ఆప్‌లైన్‌ బోధిస్తూ, ఆన్‌లైన్‌ డబ్బులు వసూలు చేస్తూ లాభాల బాటలో నడుస్తోంది. 2025 నాటికి తన ప్లాట్‌ఫారమ్‌లో 50 మిలియన్ల అభ్యాసకులను చేరుకోవాలని కంపెనీ లక్ష్యంగా పెట్టుకుంది. కానీ ఇన్ఫినిటీ మెటా జూనియర్‌ యాప్‌ పేరుతో శ్రీచైతన్య స్కూల్‌ పిల్లల దగ్గర రూ. 3000/- ఇన్ఫినిటీ లెర్న్‌ యాప్‌ పేరుతో శ్రీచైతన్య కాలేజీ విద్యార్థుల దగ్గర రూ. 5000/- ఆన్‌లైన్‌ యాప్‌ల పేరుతో విద్యార్థుల దగ్గర నుండి బలవంతంగా వసూలు చేస్తుందని తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. శ్రీచైతన్యలో చదువుతున్నప్పుడు యాప్‌లపై ఆధారపడాల్సిన అవసరం ఏముందని ప్రశ్నిస్తున్నారు. శ్రీచైతన్య దోపిడీని బహిరంగంగానే విమర్శిస్తున్నారు. ఒక్క సీనియర్‌ ఇంటర్‌ విద్యార్థులు ఆన్‌లైన్‌ టెస్ట్‌ సిరీస్‌ల కోసం, పరీక్ష పేపర్ల కోసం తప్పించి ఇతర తరగతుల వారికి ఉపయోగం లేదని వాపోతున్నారు. జైజూస్‌ తరహాలోనే ఆన్‌లైన్‌ కంటెంట్‌ అందించే ఇన్ఫినిటీ లెర్న్‌..కేవలం శ్రీచైతన్య విద్యార్థులపై ఆధారపడి ఆదాయాన్ని ఆర్జిస్తోంది. ఒక్క సారి తల్లిదండ్రులు ఆన్‌లైన్‌ యాప్‌లకు ఫీజలు ఎందుకు కట్టాలి అని ఎదురుతిరిగితే ఇన్ఫినిటీ లెర్న్‌ (ర్యాంక్‌గురు టెక్నాలజీస్‌ ప్రై.లి) మూసుకోవాల్సిందే.

Post a Comment

0 Comments

Popular Posts

Resonance Schools : J.D.లక్ష్మీనారాయణ రెజొనెన్స్‌కి ప్రచారకర్తగా మారారా ?
Resonance Schools : టీచర్లు లేకుండా బోధన ఎలా ?
Kadapa Sri Chaitanya : శ్రీచైతన్య హాస్టల్స్‌లో ఆగని మరణమృదంగం !
Physics Wallah : 'సరసమైన ధరకే చదువు' ఫిజిక్స్‌ వాలా IPOని గట్టెక్కిస్తుందా ?
Sri Chaitanya Fake Olympiads : ఆగని శ్రీచైతన్య ఫేక్‌ ఒలింపియాడ్స్‌ దందా !
Sri Chaitanya Score Scholarship : శ్రీచైతన్య రూ.350 కోట్లు మాయాజాలం !
sri chaitanya : తవ్వేకొద్ది బయటపడుతున్న శ్రీచైతన్య షెల్‌ కంపెనీల అక్రమాలు !
Resonance Schools : పర్మిషన్లు లేకుండా అడ్మిషన్లు ఎలా ?
Sri Chaitanya Sisters : శ్రీచైతన్య షెల్‌ కంపెనీల గుట్టు రట్టు !
Sri Chaitanya Prodigy : తల్లిదండ్రులపై మోయలేని పెనుభారం !