Ticker

6/recent/ticker-posts

Sri chaitanya Directors : షెల్‌ కంపెనీలకు సారథులు...ఈ అక్కాచెల్లెళ్ళు !

ఇప్పటి దాకా విద్యారంగంలో మాత్రమే రాణిస్తున్న అక్కాచెల్లెళ్ళు అయిన బొప్పన సుష్మశ్రీ, బొప్పన సీమ రియల్‌ ఎస్టేట్‌ రంగంలోనూ రాణిస్తున్నారు. ఈ కంపెనీలు పేపర్‌ మీద మాత్రమే ఉంటాయి. భౌతికంగా ఎక్కడా కనిపించవు, కార్యకలాపాలు ఉండవు, ఉద్యోగులు ఉండరు. ఇలాంటివి ఎన్నింటికో శ్రీచైతన్య యాజమాన్యం గుట్టుచప్పుడు కాకుండా నిర్వహిస్తోంది. అందులో ఒక రెండు కంపెనీలు పరిశీలిద్దాం.

శ్రీవిద్య ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ పై.లి. 

2019 లక్షరూపాయల అథరైడ్జ్‌ క్యాపిటల్‌తో 10000 షేర్స్‌తో మొదలైన ప్రస్థానం 11 జూన్‌ 2021 నాటికి లక్ష నుండి 150 కోట్లకు తన అథరైడ్జ్‌ క్యాపిటల్‌ పెంచేసింది. ఒకేసారి ఇంత మొత్తం ఎక్కడ నుండి వచ్చింది అంటే వర్సిటీ ఎడ్యుకేషన్‌ మేనేజ్‌మెంట్‌ నుండి అన్‌సెక్యూర్డ్‌ రుణాన్ని పొందింది. అనంతరం 25 ఫిబ్రవరి 2022 మరోసారి రూ. 150 కోట్ల నుండి 300 కోట్లకు కంపెనీ అథరైడ్జ్‌ క్యాపిటల్‌ను పెంచేసింది. వందల కోట్లు కంపెనీలోకి వచ్చి పడ్డాయి. అనంతరం 15 డిసెంబర్‌ 2022లో రూ. 300 కోట్లు ఉన్న శ్రీవిద్య ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ అథరైడ్జ్‌ క్యాపిటల్‌ అమాంతం రూ. 400 కోట్లకు పెంచింది. మరోసారి కంపెనీలోకి వర్సిటీ నుండి డబ్బులు పడ్డాయి. మరోసారి జూలై 10 2023 రూ. 400 కోట్లు ఉన్న ఆథరైడ్జ్‌ క్యాపిటల్‌ రూ. 600 కోట్లకు పెంచేసింది. ప్రతి 8 నెలల కాలంలో ఒకసారి అప్పుల రూపంలో వర్సిటీ నుండి శ్రీవిద్య ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌లోకి కోట్లాది రూపాయలను మళ్ళించారు. వర్సిటీ ఎడ్యుకేషన్‌ మేనేజ్‌మెంట్‌ నుండి మనీ వచ్చినట్లు అగ్రిమెంట్స్‌లు, షేర్ల బదలాయింపు, కంపెనీ మీటింగ్‌లు జరిగినట్టు చూపించారు, కానీ శ్రీవద్య ఇన్‌ఫ్రా నుండి మళ్ళీ వర్సిటీ ఎడ్యుకేషన్‌ మేనేజ్‌మెంట్‌కి డబ్బులు తిరిగి చెల్లించిన పత్రాలు ఒక్కటీ లేదు. శ్రీవిద్య ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ కంపెనీలో 99.99% షేర్‌ విలువ అంతా వర్సిటీ ఎడ్యుకేషన్‌ మేనేజ్‌మెంట్‌ ప్రై.లి. పేరు మీద బదలాయించారు. ఇక్కడ అంతా బాగానే ఉన్నా...శ్రీవిద్య ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌లోకి గత 3 ఏళ్ళలో వచ్చిన వందల కోట్ల రూపాయల సంబంధించిన వివరాలు ఎక్కడున్నాయి. ఆ నిధులన్నీ ఎటువైపు దారి మళ్ళాయి. రియల్‌ ఎస్టేట్‌లో ఎలాంటి కార్యకలాపాలకు వినియోగించింది అంటే సమాధానం లేదు, సాక్ష్యాలు లేవు.  శ్రీవిద్య ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ ఫేక్‌ కంపెనీ అనడానికి వారి ఇచ్చిన చిరునామా, కరెంట్‌ బిల్‌ మరియు అడ్రస్‌ ప్రూఫ్‌ కోసం పెట్టిన డాక్యుమెంట్స్‌ చూస్తే ఇట్టే అర్థం అవుతుంది. పైగా మినిస్ట్రీ ఆఫ్‌ కార్పొరేట్‌ ఆఫైర్స్‌లో ఎక్కడ గత 3 ఎళ్ళుగా AOC-4 ఫామ్‌ కానీ, MGT-7 ఫామ్‌ కానీ సమర్పించిన దాఖలాలు లేవు.  శ్రీవిద్య ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌లోకి వచ్చిన డబ్బు అంతా ఎటు పోతుందో ఆ పెరుమాళ్ళకే ఎరుక. 

అప్‌టౌన్‌ లైఫ్‌ ప్రాజెక్ట్స్‌ పై.లి...శ్రీవిద్య ఇన్‌ఫ్రాను దించేశారు.

అప్‌టౌన్‌ లైఫ్‌ ప్రాజెక్ట్స్‌ పై.లి. 2019 లక్షరూపాయల అథరైడ్జ్‌ క్యాపిటల్‌తో 10000 (బొప్పన రaాన్సీలక్ష్మీ బాయి 5000 , బొప్పన సీమ 5000) షేర్స్‌తో మొదలైన ప్రస్థానం 19 జూన్‌ 2021 నాటికి లక్ష నుండి 150 కోట్లకు తన అథరైడ్జ్‌ క్యాపిటల్‌ పెంచేసింది. ఒకేసారి ఇంత మొత్తం ఎక్కడ నుండి వచ్చింది అంటే వర్సిటీ ఎడ్యుకేషన్‌ మేనేజ్‌మెంట్‌ నుండి అన్‌సెక్యూర్డ్‌ రుణాన్ని పొందింది. అనంతరం 25 ఫిబ్రవరి 2022 మరోసారి రూ. 150 కోట్ల నుండి 300 కోట్లకు కంపెనీ అథరైడ్జ్‌ క్యాపిటల్‌ను పెంచేసింది. వందల కోట్లు కంపెనీలోకి వచ్చి పడ్డాయి. అనంతరం 15 డిసెంబర్‌ 2022లో రూ. 300 కోట్లు ఉన్న శ్రీవిద్య ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ అథరైడ్జ్‌ క్యాపిటల్‌ అమాంతం రూ. 400 కోట్లకు పెంచింది. మరోసారి కంపెనీలోకి వర్సిటీ నుండి డబ్బులు పడ్డాయి. మరోసారి జూలై 10 2023 రూ. 400 కోట్లు ఉన్న ఆథరైడ్జ్‌ క్యాపిటల్‌ రూ. 600 కోట్లకు పెంచేసింది. ప్రతి 8 నెలల కాలంలో ఒకసారి అప్పుల రూపంలో వర్సిటీ నుండి శ్రీవిద్య ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌లోకి కోట్లాది రూపాయలను మళ్ళించారు. వర్సిటీ ఎడ్యుకేషన్‌ మేనేజ్‌మెంట్‌ నుండి మనీ వచ్చినట్లు అగ్రిమెంట్స్‌లు, షేర్ల బదలాయింపు, కంపెనీ మీటింగ్‌లు జరిగినట్టు చూపించారు, కానీ అప్‌టౌన్‌ లైఫ్‌ ప్రాజెక్ట్స్‌ నుండి మళ్ళీ వర్సిటీ ఎడ్యుకేషన్‌ మేనేజ్‌మెంట్‌కి డబ్బులు తిరిగి చెల్లించిన పత్రాలు ఒక్కటీ లేదు. కంపెనీకి ఉన్న 60 కోట్ల షేర్లలో 37, 88,61473 షేర్లు వర్సిటీ ఎడ్యుకేషన్‌ మేనేజ్‌మెంట్‌ అధీనంలో ఉన్నాయి. మిగతావి కూడా బొప్పన సీమ, బొప్పన రaాన్సీలక్ష్మీ భాయి అథీనంలోనే ఉన్నాయి. మొత్తంగా షెల్‌ కంపెనీలు సృష్టించటం వాటిల్లోకి పెట్టుబడుల రూపంలో నిధులు మళ్ళించటం ఆయా కంపెనీల షేర్లు వర్సిటీ ఆధీనంలో ఉన్నట్లు చూపటం ఒక తంతులా జరుగుతోంది. ఇంకా చెప్పాలి అంటే  వర్సిటీ ఎడ్యుకేషన్‌ మేనేజ్‌మెంట్‌ నుండి మనీ వచ్చినట్లు అగ్రిమెంట్స్‌లు, షేర్ల బదలాయింపు, కంపెనీ మీటింగ్‌లు జరిగినట్టు చూపించారు, కానీ అప్‌టౌన్‌ లైఫ్‌ ప్రాజెక్ట్స్‌ నుండి మళ్ళీ వర్సిటీ ఎడ్యుకేషన్‌ మేనేజ్‌మెంట్‌కి డబ్బులు తిరిగి చెల్లించిన పత్రాలు ఒక్కటీ లేదు. కంపెనీ బ్యాలెన్స్‌ షీట్స్‌, యాన్సువల్‌ రిటన్స్‌ కూడా దాఖలు చేయలేదు. ఈ కంపెనీల్లోకి వెళ్ళిన సొమ్ము అంతా సొంత ఖాతాల ద్వారా భూములు, సొంత బిల్డింగ్‌లు కొనుగోలు చేస్తున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. 



Post a Comment

0 Comments

Popular Posts

JEE ADVANCED 2025 : IIT ర్యాంకుల పేరుతో తల్లిదండ్రుల్ని బకరాల్ని చేస్తున్న శ్రీచైతన్య !
SRI CHAITANYA NEET 2025 : కూలిపోతున్న డాక్టర్‌ కలలు !
JEE MAIN 2025 ఫలితాల్లో మరో సరికొత్త మోసానికి తెరతీసిన శ్రీచైతన్య !
JEE Main Results : సిగ్గులేని శ్రీచైతన్య... మరీ ఇంతగా దిగజారాలా ?
Sri Chaitanya : వర్సిటీ మూసివేత ! శ్రీచైతన్య ఉద్యోగుల్లో కలవరం ?
Sri Chaitanya : తల్లిదండ్రుల్ని దోచేస్తున్న ఒలింపియాడ్స్‌ మాఫియా
JAGANANNA ANIMUTYALU : ప్రభుత్వ పాఠశాలల్లో అంతర్జాతీయస్థాయి విద్య అందించటమే ధ్యేయం !
Sri Chaitanya : షెల్‌ కంపెనీల పుట్ట...నల్లధనం గుట్ట ....శ్రీచైతన్య !
TALLENTEX : టాలెంటెడ్‌ స్టూడెంట్సే టార్గెట్‌గా...స్కాలర్‌షిప్‌ ఎర !
AP Introduce GPS : ఏపీలో ఉద్యోగుల కోసం కొత్త పెన్షన్‌ విధానం !