అది ఒక నామమాత్రపు కంపెనీ. పెయిడప్ క్యాపిటల్ కేవలం లక్ష రూపాయలు మాత్రమే. ఏటేటా ఆదాపపన్ను రిటర్నులు కూడా దాఖలు చేయటం లేదు. అలాంటి కంపెనీలో ఒక్కసారే కోటాను కోట్ల డబ్బు రుణాల రూపంలో నిధుల వరద పారింది. ఎలా ? ఎలా ? ఎలా ? ఇదేలా సాధ్యం అని అందరూ జుట్టు పీక్కుంటున్నారు అంటే నమ్ముతారా. ఇందుకు శ్రీ వాల్మీకి ఎడ్యుకేషన్ మేనేజ్‌మెంట్ ప్రై.లి. వేదిక అయ్యింది. ఇక వివరాల్లోకి వెళితే బొప్పన సత్యనారాయణ రావు, బొప్పన రaాన్సీలక్ష్మీ బొప్పన భాయి పేరు మీద శ్రీ వాల్మీకి ఎడ్యుకేషన్ మేనేజ్‌మెంట్ ప్రై.లి. కంపెనీ రిజిస్టర్ అయ్యింది. మార్చి 31, 2020 నాటికి కంపెనీ మూలధనం 7,69,560/- రూపాయలుగా ఫైనాన్షియల్ స్టేట్‌మెంట్‌లో చూపింది. ప్రైమరీ ఎడ్యుకేషన్‌లో తన ఆబ్జెక్ట్‌గా చూపిన శ్రీవాల్మీకి ఎడ్యుకేషన్ సడెన్‌గా 8, జూలై 2021 బజాజ్ ఫైనాన్స్, పుణె నుండి 350 కోట్ల అప్పు, 31 మే 2021 న ఆదిత్యబిర్లా క్యాపిటల్ నుండి రూ. 150 కోట్లు రుణం, 21, జూన్ 2021 హీరో ఫిన్ కార్ప్, డిల్లీ నుండి 135 కోట్ల రుణం, 14, జూన్ 2021 టాటా క్యాపిటల్, ముంబాయి నుండి 335 కోట్ల రుణం మొత్తం ఒక నెల వ్యవధిలోనే దాదాపు 970 కోట్ల రుణం పొందింది. దీనికి గాను వర్సిటీ ఎడ్యుకేషన్ మేనేజ్‌మెంట్ ప్రై.లి కంపెనీ తన పూచీకత్తు మీద వర్సిటీ ఎడ్యుకేషన్ మేనేజ్‌మెంట్ షేర్లను తనఖా పెట్టింది. అసలు వర్సిటీకి శ్రీవాల్మీకి సంస్థ అనుబంధ సంస్థ కాదు, ఉమ్మడి నియంత్రణలో నడిచే సంస్థ కాదు, కానీ వర్సిటీ ఎడ్యుకేషన్ మేనేజ్‌మెంట్ తన షేర్లను తనఖా ఎందుకు పెట్టింది ? శ్రీవాల్మీకి, వర్సిటీ ఎడ్యుకేషన్ మేనేజ్‌మెంట్ ఉన్న సంబంధం ఏమిటి ? లోన్లు తీసుకున్న వెంటనే విలీనం !
కేవలం 45 రోజుల వ్యవధిలో 970 కోట్లు సమకూర్చుకన్న శ్రీ వాల్మీకి ఆ వెంటనే వర్సిటీ ఎడ్యుకేషన్ మేనేజ్‌మెంట్ ప్రై.లి.కంపెనీలోకి విలీన ప్రక్రియను ప్రారంభించింది. ఈ ప్రక్రియ అంతా ప్రీ ప్లాన్స్‌డ్‌గా జరిగినట్లు తెలుస్తోంది. లోన్ తీసుకున్న వెంటనే 30 జూన్ 2021న కంపెనీని విలీనం చేయబోతున్న నిర్ణయం బోర్డు తీసుకుంది. ఆ వెంటనే 19 ఆగష్టు, 2021 న రెండు కంపెనీల బోర్డ్ మీటింగ్ జరగటం, 15 ఫిబ్రవరి, 2022 న కోర్టులో అఫిడవిట్ దాఖలు చేయటం, 23, మార్చి 2022 నాటికి విలీన ప్రక్రియ పూర్తి కావటం జరిగిపోయింది. కంపెనీ విలీన ప్రక్రియలో భాగంగా ముందుగా కేటాయించిన 62, 17, 410 షేర్లను విరమించుకుని తదనంతరం కేవలం 3,20,000 షేర్లను శ్రీవాల్మీకి ఎడ్యుకేషన్ మేనేజ్‌మెంట్ సభ్యులకు కేటాయించింది. బి.ఎస్. రావు 1, 60, 000 , బి.రaాన్సీలక్ష్మీ బాయికి 1, 60,000 వర్సిటీ ఎడ్యుకేషన్ షేర్లు ప్రకటించింది. కానీ శ్రీ వాల్మీకి కంపెనీ నెట్ వర్త్ రూ. 6, 70, 99, 463/- ఉండగా, కేటాయించిన కంపెనీ షేర్ల విలువ కేవలం రూ. 16 లక్షలు మాత్రమే ఉండటం గమనార్హం. అంటే ఇంకా సుమారు 6.55 కోట్ల నష్టానికి కంపెనీని విలీనం చేశారు అన్నమాట. శ్రీవాల్మీకి కంపెనీకి చెందిన 25,00,000 లక్షల ఆథరైడ్జ్ క్యాపిటల్‌ను ఎంచక్కా వర్సిటీ ఎడ్యుకేషన్ మేనేజ్‌మెంట్ ప్రై.లి. కంపెనీలో 15, 31, 00,000 కలిపేసుకుంది. ఇక్కడే ఒక చిన్న సందేహం మొదలైంది. కేవలం ఒక లక్ష రూపాయల పెయిడప్ క్యాపిటల్ ఉన్న శ్రీ వాల్మీకి 970 రుణం ప్రైవేటు ఫైనాన్స్ కంపెనీలు ఎలా ఇచ్చాయి ? కార్పొరేట్ గ్యారెంటీగా వర్సిటీ ఎడ్యుకేషన్ మేనేజ్‌మెంట్ ఎందుకు తన షేర్లు తనఖా పెట్టింది. డైరెక్ట్‌గా వర్సిటీ ఎడ్యుకేషన్ మేనేజ్‌మెంటే తన షేర్లను తాకట్టు పెట్టి లోన్ తీసుకోవచ్చు కానీ వయా శ్రీవాల్మీకి రూటు ఎందుకు ఎంచుకున్నట్లు ? 970 కోట్ల నిధులు ఏమైనట్టు ? ఎవరి ఖాతాలకు మళ్ళినట్టు ? ఈ నిధులన్నీ రియల్ ఎస్టేట్‌లో పెట్టుబడికి నిధుల మళ్ళించినట్లు పెద్ద ఎత్తున ఆరోపణలు వినిపిస్తున్నాయి.


0 Comments