Ticker

6/recent/ticker-posts

FIITJEE : రూ. 300 కోట్లు ఆశచూపుతూ మరో బోగస్‌ స్కాలర్‌షిప్‌


  • సోషల్‌మీడియా వేదికగా  ప్రకటనలు గుప్పిస్తున్న FIITJEE
  • ఎగ్జామ్‌ ఫీజులతోనే కోట్లు దండుకునే వ్యూహం
  • బహుమతులు, స్కాలర్‌షిప్‌లు ఉత్తమాటే.
  • ఇతర స్కూల్స్‌/కాలేజీల్లో టాపర్ల వివరాలను తెలుసుకోవటమే టార్గెట్‌.

300 కోట్ల స్కాలర్‌షిప్‌...అంటే చాలా పెద్ద అమౌంట్‌. మా పిల్లాడిని పరీక్ష వ్రాయిస్తే...ఈ సంవత్సరం ఫీజు కట్టవలసిన అవసరం ఉండదేమో అని ఓ మధ్య తరగతి తండ్రి ఆలోచన. ఇలా ఆలోచించే మధ్యతరగతి, దిగువ మధ్య తరగతి తల్లిదండ్రుల ఆశల్ని ఆసరాగా చేసుకుని ఓ భారీ ప్రకటనతో ప్రజల్ని మభ్యపెడుతోంది FIITJEE విద్యాసంస్థ. ఇప్పటికే సోషల్‌ మీడియా వేదిక FIITJEE విద్యాసంస్థపై ఉన్న నమ్మకాన్ని క్యాష్‌ చేసుకునే ఉద్ధేశ్యంతో ఫిడ్జి టాలెంట్‌ రివార్డ్‌ ఎగ్జామ్‌ పేరుతో భారీ ప్రచారానికి తెరతీసింది.

భారీ ప్రచారం !

డిసెంబర్‌ 24 నుండి జనవరి 7 వరకు 300 కోట్ల స్కాలర్‌షిప్‌ అంటూ భారీ మరియు ఆకర్షణీమమైన ప్రకటనలో సోషల్‌ మీడియా వేదికగా ప్రచారాన్ని హోరెత్తిస్తోంది FIITJEE. పైకి స్కాలర్‌షిప్‌ టెస్ట్‌ మాత్రమే, కానీ దీని వెనుక పెద్ద తతంగమే నడుస్తుంది. దేశవ్యాప్తంగా ప్రతిభావంతులైన విద్యార్థులను వెతికి వెతికి పట్టుకోవటమే ఈ స్కాలర్‌షిప్‌ ఎగ్జామ్‌ యొక్క ముఖ్య ఉద్ధేశ్యం. ఫిడ్జి విద్యాసంస్థల్లో చదువుతున్న విద్యార్థులు కాకుండా ఇతర విద్యాసంస్థల్లోని ప్రతిభావంతులైన విద్యార్థుల వివరాలు తెలుసుకునేందుకు వేసిన వలే ఈ ఫిడ్జి టాలెంట్‌ రివార్డ్‌ ఎగ్జామ్‌.  స్కాలర్‌షిప్‌ కోసం ఆశపడి ఫిడ్జి స్కాలర్‌షిప్‌కి చిక్కారా...అంతే. మీ వివరాలు మొత్తం లాగేసుకుంటుంది ఫిడ్జి. దేశవ్యాప్తంగా ఏ ఏ రాష్ట్రాల్లో ఏ ఏ స్కాల్స్‌లో ప్రతిభావంతులైన విద్యార్థులు ఉన్నారో వారి వివరాలు సేకరిస్తుంది. ఆ డేటాను ఉపయోగించి ఇతర విద్యాసంస్థల్లో చదువుతున్న వారికి  ఫిడ్జి హాస్టల్స్‌లో ఉచిత విద్యను ఆఫర్‌ చేయటం దగ్గర నుండి  వేరే ఇతర ప్రోత్సాహకాలు ఆశచూపి తమ విద్యాసంస్థల్లో చేరేలా మభ్యపెట్టటమే ఈ స్కాలర్‌షిప్‌ వెనుక ఉన్న అసలు లక్ష్యం. ఎందుకంటే బాగా టాలెంటెడ్‌ విద్యార్థులు రాబోయే రోజల్లో నీట్‌, జెఈఈ అడ్వాన్స్‌డ్‌ లాంటి ఎగ్జామ్స్‌లో 10 లోపు ర్యాంకు సాధిస్తే సంస్థ తలరాతే మారిపోతుంది. ఒక్క ర్యాంకు సాధిస్తే చాలు వేలాది అడ్మిషన్లు వచ్చేస్తాయి. గత సంవత్సరం ఫిడ్జి ఫలితాలను తీసుకుంటే జెఇఇ మెయిన్‌, అడ్వాన్స్‌డ్‌, నీట్‌ వంటి ఎగ్జామ్స్‌లో ఆలిండియా ఓపెన్‌ కేటగిరీలో 100 లోపు మంచి ర్యాంకులను సాధించింది. ఆ ర్యాంకులతోనే ఇప్పుడు మార్కెటింగ్‌ చేసుకుంటోంది. ఫిడ్జిలో చదివితే ఫస్ట్‌ ర్యాంకు వస్తుంది అని నమ్మిస్తోంది. కేవలం కొద్ది మంది ర్యాంకులు చూపి వందలు, వేలల్లో విద్యార్థులను సంస్థల్లో చేర్పించుకుంటున్నారు. అసలు ర్యాంకులు రాని వారు ఎందరో ఉన్నారు. కానీ వారి వివరాలు మాత్రం ఎక్కడా ప్రచురించరు. ఫిడ్జి సంస్థలో చదివే ప్రతి విద్యార్థికి ఆలిండియా ఫస్ట్‌ ర్యాంకు వస్తుందా ? కనీసం 100 లోపు ర్యాంకైనా వస్తుందా ? ఫిడ్జి గ్యారెంటీ ఇవ్వగలదా ? పేరెంట్స్‌ ఎందుకు ఆలోచించటం లేదో వారికే తెలియాలి. ఎందుకంటే తమ పిల్లాడికి మంచి ర్యాంకు వస్తుందేమోనని ఆశ. అదే ఆశే ప్రైవేటు విద్యాసంస్థలకు వరంగా మారింది. కాసుల వర్షం కురిపిస్తోంది.

ఇప్పటి ఎంత మందికి ఇచ్చారో లిస్ట్‌ ప్రకటించగలరా ?

రూ.300 కోట్ల స్కాలర్‌షిప్‌ ఇవ్వటం అనేది ఉత్తమాట. ఒకవేళ వేరే సంస్థలో చదువుతూ ఫిడ్జిలో ఫిడ్జి టాలెంట్‌ రివార్డ్‌ ఎగ్జామ్‌లో మంచి ఫలితం వచ్చినా ప్రయోజనం దక్కదు. ఎందుకంటే ఫిడ్జి సంస్థలో అడ్మిషన్‌ తీసుకున్న వారికే మాత్రమే ఆ ప్రయోజనం వర్తిస్తుంది. కావలంటే నిశితంగా గమనించండి రూ. 300 కోట్ల వద్ద స్టార్‌ మార్క్‌తో షరతులు వర్తిస్తాయి అని ఉంటుంది. ఆ షరతులు అన్నీ ఫిడ్జి సంస్థకు అనుకూలంగా ఉంటాయి. చివరికి మోసపోతున్నది విద్యార్థులే. ప్రతిభావంతులని గుర్తించటం, వారిని తమ సంస్థల్లో చేర్చుకోటం. ఎగ్జామ్‌ రాసే ప్రతి స్టూడెంట్‌ దగ్గర నుండి సరాసరిన 150/`  200/` వరకు వసూలు చేయటం చేస్తున్నారు. టెస్ట్‌లో బాగా రాణించిన విద్యార్థులకు కొద్ది మొత్తంలో నగదు, ల్యాప్‌ట్యాప్‌లు, ట్యాబ్‌లు వంటి చిన్న చిన్న బహుమతులు ఇచ్చి చేతులు దులుపుకోవటం కనిపిస్తుంది. రిజల్ట్‌ రోజున రూ. 300 కోట్ల రూపాయలు స్కాలర్‌షిప్‌ సాధించిన వారి వివరాలు బహిరంగంగా ప్రకటించగలదా ? ఫిడ్జికి అంత దమ్ము ఉందా ?  


 


Post a Comment

0 Comments

Popular Posts

Sri Chaitanya Fake Olympiads : ఆగని శ్రీచైతన్య ఫేక్‌ ఒలింపియాడ్స్‌ దందా !
Sri Chaitanya Score Scholarship : శ్రీచైతన్య రూ.350 కోట్లు మాయాజాలం !
Physics Wallah : 'సరసమైన ధరకే చదువు' ఫిజిక్స్‌ వాలా IPOని గట్టెక్కిస్తుందా ?
 Ram Charan Talking About Mega Priences : పాప ఖచ్చితంగా నాన్నలానే ఉంటుంది
 School Seized : నివాస భవనంలో శ్రీ చైతన్య స్కూల్‌.. కుత్బుల్లాపూర్‌లో పాఠశాల భవనం సీజ్‌
JADDAR NEW POLITAL PARTY IN TELANGANA : దొరలపాలనకు జరుగుతోంది అందుకే ‘‘గద్దర్‌’’  ప్రజాపార్టీ !
Resonance Schools : పర్మిషన్లు లేకుండా అడ్మిషన్లు ఎలా ?
Kadapa Sri Chaitanya : శ్రీచైతన్య హాస్టల్స్‌లో ఆగని మరణమృదంగం !
Sri Chaitanya : శేరిలింగంపల్లిలో శ్రీ చైతన్య స్కూల్‌ సీజ్‌.. భవన నిర్మాణంలో ఉల్లంఘనలు..!
Scholarships : కార్పొరేట్‌ విద్యాసంస్థల బోగస్‌ స్కాలర్‌షిప్‌ ట్రాప్‌  !!