Ticker

6/recent/ticker-posts

Narayana : కర్నూల్‌ నారాయణ డీన్‌ రాసలీలల రికార్డు ! ఆపై బ్లాక్‌మెయిల్‌ !

  • అక్కడ పనిచేసే మహిళలతో తన కార్యాలయంలోనే కోర్‌ డీన్‌ కామ క్రీడలు
  • ఆ వ్యవహారాలను స్పై కెమెరాతో రికార్డు చేసి.. డీన్‌ను బ్లాక్‌మెయిల్‌ చేస్తున్న ఉద్యోగులు
  • పోలీసులకు ఫిర్యాదు చేసిన డీన్‌ లింగేశ్వరరెడ్డి

ఇప్పటి వరకూ నారాయణ విద్యా సంస్థల్లో ఒత్తిడితో విద్యార్థుల ఆత్మహత్యలు, సరైన భోజనం, సౌకర్యాలు లేక విద్యార్థులు అవస్థలు పడుతున్న ఘటనలే వెలుగు చూశాయి. తాజాగా ఉద్యోగి రాసలీలల వీడియోలు కలకలం సృష్టిస్తున్నాయి. నారాయణ విద్యాసంస్థల కోర్‌ డీన్‌ లింగేశ్వరరెడ్డి ఆక్కడ పనిచేసే కొందరు మహిళలతో జరిపిన రాసక్రీడల వీడియోల వ్యవహారం చర్చనీయాంశమైంది. నారాయణ విద్యాసంస్థల కోర్‌ డీన్‌ లింగేశ్వరరెడ్డి.. జూనియర్‌ కాలేజీల విభాగాన్ని పర్యవేక్షిస్తున్నారు. ఈ క్రమంలో తన కార్యాలయంలోనే అక్కడి మహిళలతో ఆయన సాగిస్తున్న సరస సల్లాపాలను గమనించిన అక్కడ పనిచేసే గోపీకృష్ణ, నజీర్‌ అనే ఉద్యోగులు ఆ గదిలో స్పై కెమెరాలు అమర్చారు. ఇందులో పదుల సంఖ్యలో రాసలీలల వీడియోలు రికార్డయ్యాయి. గోపీకృష్ణ, నజీర్‌లు ఆ వీడియోలను డీన్‌ లింగేశ్వరరెడ్డి వాట్సాప్‌కు పంపగా.. వారిని రాజీకి పిలిపించి ఒక ఇల్లు, రెండు విలువైన ప్లాట్లు వారి పేరిట రిజిస్ట్రేషన్‌ చేయించారు. అంతేగాక వారి వేతనాలు కూడా పెంచేందుకు హామీ ఇచ్చారు.

మరింత మంది బ్లాక్‌మెయిలింగ్‌

మరికొంత మంది బ్లాక్‌మెయిల్‌ తర్వాత ఆ వీడియోలు ఓ ఉద్యోగి ద్వారా నబీ రసూల్‌ అనే వ్యక్తికి చేరాయి. ఇతను చంద్రశేఖరరెడ్డి, రవిశంకర్‌రెడ్డి, శ్రీనివాసరెడ్డి అనేవారికి వీడియోలను పంపడంతో వారు లింగేశ్వరరెడ్డి వద్ద డబ్బులు డిమాండ్‌ చేశారు. వీరితోనూ రాజీకి వెళ్లి పెద్ద మొత్తంలో నగదు ఒప్పందం చేసుకున్నారు. కొంత డబ్బులు ఇచ్చి, మిగిలిన మొత్తం ఇవ్వకపోవడంతో తిరిగి వీళ్లు ఈ వీడియోలను సోషల్‌ మీడియాలో వైరల్‌ చేస్తామని బ్లాక్‌ మెయిల్‌ చేయసాగారు.దీంతో ఇంకెంతమంది ఇలా బ్లాక్‌ మెయిల్‌ చేస్తారోనని భయంతో లింగేశ్వరరెడ్డి స్పందనలో ఎస్పీకి వినతి పత్రం ఇచ్చారు. దీంతో తాలూకా పోలీస్‌స్టేషన్‌కు బ్లాక్‌మెయిలర్స్‌ను పిలిపించి సెల్‌ఫోన్‌లు తీసుకుని వారి దగ్గర ఉన్న వీడియోలను డిలీట్‌ చేయించి వారిపై బైండోవర్‌ కేసులు నమోదు చేశారు. ఆయన ఆస్తులను కూడా తిరిగి అతని పేరిట రిజిస్ట్రేషన్‌ చేయించారు. నిందితులను కర్నూలు రూరల్‌ తహసీల్దార్‌ ఎదుట హాజరు పరిచి బైండోవర్‌ కేసు నమోదు చేయించారు. తనను బ్లాక్‌ మెయిల్‌ చేసిన ఉద్యోగులను కోర్‌ డీన్‌ హైదరాబాద్‌కు బదిలీ చేయించారు. తనను కొందరు బ్లాక్‌మెయిల్‌ చేస్తున్నారని లింగేశ్వరరెడ్డి స్పందనలో ఫిర్యా­దు చేయడంతో విచారించి నిందితులపై బైండోవర్‌ కేసులు నమోదు చేసినట్టు కర్నూలు ఎస్పీ కృష్ణకాంత్‌ చెప్పారు. బాధితులు వచ్చి ధైర్యంగా ఫిర్యాదు చేస్తే ఆ దిశగా కూడా చర్యలు తీసుకుంటామన్నారు.

మహిళలే సమిధలు

నారాయణ విద్యాసంస్థల్లో పనిచేసే మహిళలపై లైంగిక వేధింపుల ఈనాటివి కావు. ఎప్పటి నుండో వస్తున్నా ఎలాంటి మార్పు లేదు. లైంగింక వేధింపులు, ఆపై లొంగదీసుకునే వ్యక్తులపై యాజమాన్యం ఆ దిశగా ఎలాంటి కఠిన చర్యలు తీసుకోవటం లేదు. అందుకే మళ్ళీ మళ్ళీ అవే సంఘటనలు నారాయణలో పునరావృతం అవుతున్నాయి. 2016లో అశోక్‌నగర్‌లోని నారాయణ స్కూల్‌ మాజీ ప్రిన్సిపాల్‌ శ్రీలత అనే టీచర్‌తో సహా పలువురు మహిళా సిబ్బందిపై డీన్‌ జయసింహారెడ్డి లైంగిక వేధింపులకు పాల్పడ్డారు ఆ విషయం అప్పట్లో ఓ సంచలనంగా మారింది. ప్రిన్సిపాల్‌, డీన్‌ వేధింపుల వల్లే శ్రీలత ఆత్మహత్య చేసుకుందని నారాయణ సిబ్బందే స్వయంగా ఫోన్‌ సంభాషణల్లో మాట్లాడుకోవటం మీడియా ద్వారా ప్రపంచానికి తెలిసింది. పెద్ద హోదాలో ఉన్న వ్యక్తులు తన క్రింద ఉన్న మహిళలతో శారీరకంగా లోబరుచుకోవడానికి వృత్తిపరమైన ఒత్తిడికి గురిచేసి, ఆ తర్వాత అశక్తతను ఆసరా చేసుకుని లోబరుచుకోవటం నారాయణలో కంటిన్యూగా జరుగుతుంది. 

Post a Comment

0 Comments

Popular Posts

Sri chaitanya : శ్రీచైతన్య స్కూల్‌ సీజ్‌ !
Scholarships : కార్పొరేట్‌ విద్యాసంస్థల కుతంత్రం ! బోగస్‌ స్కాలర్‌షిప్‌లతో విద్యార్థులపై దండయాత్ర !!
JEE ADVANCED 2025 : IIT ర్యాంకుల పేరుతో తల్లిదండ్రుల్ని బకరాల్ని చేస్తున్న శ్రీచైతన్య !
Sri Chaitanya Trust : ఇష్టారాజ్యంగా ఎడ్యుకేషనల్‌ ట్రస్ట్‌లు/ సొసైటీలు !
SRI CHAITANYA NEET 2025 : కూలిపోతున్న డాక్టర్‌ కలలు !
Sri Chaitanya : వర్సిటీ మూసివేత ! శ్రీచైతన్య ఉద్యోగుల్లో కలవరం ?
SriChaitanya Fake Olympiad Scam : ఫేక్‌ ఒలింపియాడ్స్‌కు అడ్డాగా శ్రీచైతన్య స్కూల్స్‌ !
AP : వేసవి సెలవుల్లో తరగతులకు కార్పొరేట్లు సిద్ధం..ప్రభుత్వ చర్యలు శూన్యం !
SriChaitanya School : సుచిత్రలో శ్రీచైతన్య బరితెగింపు !!
JEE Main Results : సిగ్గులేని శ్రీచైతన్య... మరీ ఇంతగా దిగజారాలా ?