Ticker

6/recent/ticker-posts

China Virus : చైనాలో మరో కొత్త వైరస్‌ ! మరో విలయం తప్పదా ?

చైనా కొత్త తరహా వ్యాధులకు పుట్టినిల్లుగా మారింది. చైనాలో పుట్టిన మరో వ్యాధి ప్రపంచాన్ని భయాందోళనలకు గురి చేస్తోంది. ఇప్పుడిప్పుడే కరోనా మిగిల్చిన విషాదం నుంచి ప్రపంచ దేశాలు కోలుకుంటుండగా, ఇంతలోనే అక్కడి నుంచి మరో వ్యాధి పుట్టుకురావడం ప్రపంచాన్ని కలవరానికి గురి చేస్తోంది. చైనాలోని పాఠశాల్లో అంతుచిక్కని న్యుమోనియా తరహా కొత్త వ్యాధి విజృంభిస్తోంది. ఈ వ్యాధి ప్రధానంగా చిన్నారులపై ప్రభావం చూపిస్తుండడం కలవరపరుస్తోంది. దీని కారణంగా పిల్లలో శ్వాసకోశ సంబంధిత సమస్యలు, ఊపరితిత్తుతుల ఇన్‌ఫెక్షన్‌, జ్వరం వంటివి వ్యాపిస్తున్నాయి. దీంతో బీజింగ్‌, లియోనింగ్‌ నగరాల్లోని ఆసుపత్రులు బాధిత చిన్నారులతో కిక్కిరిసిపోతున్నాయి. దీంతో ఈ అంటువ్యాధి ప్రబలకుండా చైనాలోని స్కూళ్లకు తాత్కాలికంగా సెలవులు ప్రకటించారు. 

చైనా అధికారుల నిర్లక్ష్యమే

టీచర్లలో కూడా ఈ వ్యాధి లక్షణాలు కనిపిస్తుండడం మరింత ఆందోళనకు గురిచేస్తోంది. చైనాలో కరోనా నియంత్రణ కోసం విధించిన ఆంక్షలు ఎత్తివేయడంతో ఇన్‌ప్లూఎంజా, మైకో ప్లాస్మా, న్యూమోనియా, శ్వాసకోశ సిన్సిటియల్‌ వైరస్‌ వంటి అంటువ్యాధులు ప్రబలుతున్నాయని, ఈ వ్యాధికారక వ్యాప్తికి చైనా అధికారుల నిర్లక్ష్యమే కారణమని ప్రపంచ ఆరోగ్య సంస్థ పేర్కొంది. ఈ క్రమంలో దేశంలోని ఉత్తరాన వ్యాపిస్తున్న శ్వాసకోశ అనారోగ్యాలకు సంబధించిన మరింత సమాచారం ఇవ్వాలని చైనాను ప్రపంచ ఆరోగ్య సంస్థ కోరింది. సంక్రమణ ప్రమాదాన్ని తగ్గించడానికి చైనీయులు చర్యలు తీసుకోవాలని సూచించింది.. డబ్ల్యూహెచ్‌ఓ ప్రకారం గత మూడు సంవత్సరాల్లో ఇదే కాలంలో ఉత్తర చైనాలో ఇన్‌ఫ్లుఎంజా అనారోగ్యం పెరుగుతోంది. ‘‘పిల్లలలో శ్వాసకోశ వ్యాధుల పెరుగుదల, న్యుమోనియా సమూహాలను నివేదించడంపై వివరణాత్మక సమాచారం ఇవ్వాలని డబ్ల్యూహెచ్‌ఓ చైనాకు అధికారిక అభ్యర్థన చేసింది’’ అని ఐక్యరాజ్యసమితి ఆరోగ్య సంస్థ బుధవారం ఒక ప్రకటనలో తెలిపింది. ఇన్‌ఫ్లుఎంజా సార్క్‌ సిఓబి`2 (కోవిడ్‌-19కి దారితీసే వైరస్‌), శిశువులను ప్రభావితం చేసే ఆర్‌ఎస్‌వీ, మైకోప్లాస్మా న్యుమోనియాతో సహా తెలిసిన వ్యాధికారక వ్యాప్తిలో ఇటీవలి పోకడలపై కూడా డబ్ల్యూహెచ్‌ఓ అదనపు సమాచారాన్ని కోరింది. ఈలోగా టీకాలు వేసుకోవడం, అనారోగ్య వ్యక్తుల నుంచి దూరంగా ఉండడం, మాస్కులు ధరించడం వంటి నివారణ చర్యలు తీసుకోవాలని ప్రజలను కోరింది.

అప్రమత్తం చేస్తున్న ప్రోమెడ్‌ 

చైనాలో వ్యాపిస్తున్న ఈన్యుమోనియా వ్యాధి గురించి ప్రోమెడ్‌ బయటపెట్టింది. ప్రోమెడ్‌ అనేది ప్రపంచ దేశాల్లో మనుషులు, జంతువుల్లో వ్యాపించే వ్యాధుల గురించి ట్రాక్‌ చేసే సర్వైవలెన్స్‌ ప్లాట్‌ఫామ్‌. ఈ ప్రోమెడే చైనాలోని న్యుమోనియో వ్యాప్తి గురించి బయటి ప్రపంచానికి చెప్పింది. 2019లో చైనాలో పుట్టిన కరోనా గురించి ఈ ప్రోమెడ్‌ సంస్థనే మొదట బయటపెట్టింది. అయితే చైనాలో ప్రస్తుత న్యుమోనియా వ్యాధి ఎప్పుడు మొదలైందనే విషయం స్పష్టంగా తెలియదని ప్రోమెడ్‌ తెలిపింది. అయితే ఈ న్యుమోనియా కూడా మరో కరోనా మహమ్మారి మాదిరిగా మారుతుందా? లేదా అనేది కూడా ఇప్పుడే చెప్పలేమని వివరించింది. అయితే దీని కారణంగా మరోసారి కరోనా తరహా విలయం తప్పదేమోననే భయం కూడా పలువురిలో ఉంది.

పూర్తి వివరాలు కోరిన డబ్ల్యూహెచ్‌వో

ఉత్తర చైనాలో గత మూడు సంవత్సరాలలో ఇదే కాలంతో పోలిస్తే అక్టోబరు మధ్య నుండి ఇన్‌ఫ్లుఎంజా వంటి అంటువ్యాధులు పెరిగాయనివరల్డ్‌ హెల్త్‌ ఆర్గనైజేషన్‌ తెలిపింది. అనారోగ్యం, వ్యాధి లక్షణాలు, చిన్నారులు ఉండే ప్రాంతాల పూర్తి సమాచారాన్ని ఇవ్వమని చైనా ప్రభుత్వాన్ని కోరింది. వరల్డ్‌ హెల్త్‌ ఆర్గనైజేషన్‌ అదనపు సమాచారాన్ని కోరుతూ టీకాతో సహా శ్వాసకోశ వ్యాధుల ప్రమాదాన్ని తగ్గించడానికి చైనాలోని ప్రజలు నివారణ చర్యలను అనుసరించాలని సిఫార్సు చేస్తోంది. వ్యాధి బారిన పడిన వ్యక్తులను దూరం ఉంచడం.. అవసరమైన పరీక్షలు నిర్వహించడం, వైద్య సంరక్షణ పొందడం, మాస్క్‌ లు ధరించడం , మంచి గాలి వెలుతురు వచ్చే ప్రాంతాల్లో నివసించడం, చేతులను తరచుగా శుభ్రపరచుకోవడం వంటి తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించింది.

Post a Comment

0 Comments

Popular Posts

Sri Chaitanya Fake Olympiads : ఆగని శ్రీచైతన్య ఫేక్‌ ఒలింపియాడ్స్‌ దందా !
Sri Chaitanya Score Scholarship : శ్రీచైతన్య రూ.350 కోట్లు మాయాజాలం !
Physics Wallah : 'సరసమైన ధరకే చదువు' ఫిజిక్స్‌ వాలా IPOని గట్టెక్కిస్తుందా ?
 Ram Charan Talking About Mega Priences : పాప ఖచ్చితంగా నాన్నలానే ఉంటుంది
 School Seized : నివాస భవనంలో శ్రీ చైతన్య స్కూల్‌.. కుత్బుల్లాపూర్‌లో పాఠశాల భవనం సీజ్‌
JADDAR NEW POLITAL PARTY IN TELANGANA : దొరలపాలనకు జరుగుతోంది అందుకే ‘‘గద్దర్‌’’  ప్రజాపార్టీ !
Resonance Schools : పర్మిషన్లు లేకుండా అడ్మిషన్లు ఎలా ?
Kadapa Sri Chaitanya : శ్రీచైతన్య హాస్టల్స్‌లో ఆగని మరణమృదంగం !
Sri Chaitanya : శేరిలింగంపల్లిలో శ్రీ చైతన్య స్కూల్‌ సీజ్‌.. భవన నిర్మాణంలో ఉల్లంఘనలు..!
Scholarships : కార్పొరేట్‌ విద్యాసంస్థల బోగస్‌ స్కాలర్‌షిప్‌ ట్రాప్‌  !!