Ticker

6/recent/ticker-posts

Leo Update to Thalapathy Vijay Fans : లియో అప్‌డేట్‌ వస్తోంది, రెడీనా ?


జూన్‌ 22న  విజయ్‌ బర్త్‌డే ఉండడంతో ఫాన్స్‌ అంతా సోషల్‌ మీడియాలో విజయ్‌కి సంబంధించిన సినిమాల అప్డేట్స్‌ కోసం ఈగర్‌ గా వెయిట్‌ చేస్తున్నారు. ఈ సమయంలో డైరెక్టర్‌ లోకేష్‌ కానగరాజ్‌ ‘రెడీ నా’ అంటూ ట్వీట్‌ చేసి అందరినీ సంభ్రమాశ్చర్యాల్లో ముంచాడు. జూన్‌ 22నే లోకేష్‌ కనగరాజ్‌ తో విజయ్‌ చేస్తున్న ‘లియో’ మూవీ టీజర్‌ రిలీజ్‌ కి సంబంధించిన అనౌన్స్మెంట్‌ ఏ క్షణంలో అయినా రిలీజ్‌ అయ్యే అవకాశం ఉంది. కోలీవుడ్‌ బిగ్గెస్ట్‌ యాక్షన్‌ డ్రామాగా రూపొందుతున్న ‘లియో’ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. ఈ అంచనాలని మరింత పెంచాలి అంటే మేకర్స్‌ ప్రమోషన్స్‌ సాలిడ్‌ గా స్టార్ట్‌ చేయాలి. అందుకే విజయ్‌ బర్త్‌ డే రోజునే ప్రమోషన్స్‌ ని స్టార్ట్‌ చేస్తే సాలిడ్‌ బజ్‌ జనరేట్‌ చెయ్యొచ్చు అనేది మేకర్స్‌ ప్లాన్‌. దీపావళి రిలీజ్‌ టార్గెట్‌ గా రానున్న లియో మూవీలో విజయ్‌ గ్యాంగ్‌స్టర్‌ గా కనిపించనున్నాడు. 

‘నా రెడీనా’ అనే లిరికల్‌ సాంగ్‌ రిలీజ్‌

లియో మూవీ అప్డేట్‌ తో పాటు విజయ్‌ ఫాన్స్‌ కి జూన్‌ 22న కిక్‌ ఇచ్చే మరో న్యూస్‌ బయటికి వచ్చింది. లియో నుంచి ‘నా రెడీనా’ అనే లిరికల్‌ సాంగ్‌ ను మేకర్స్‌ రిలీజ్‌ చేయనున్నట్టు తెలిపారు.ఈ డైరెక్టర్‌-హీరో కాంబినేషన్‌ లో ‘మాస్టర్‌’ సినిమా బాక్సాఫీస్‌ దగ్గర ‘బుల్స్‌ ఐ’ని హిట్‌ చెయ్యడంలో మిస్టేక్‌ జరిగింది. ఈసారి మాత్రం ఆ తప్పు జరగకుండా అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్న లోకేష్‌ కనగరాజ్‌, పాన్‌ ఇండియా సంభవం సృష్టించడానికి రెడీ అయ్యాడు. 90 రోజుల్లో షూటింగ్‌ పార్ట్‌ కంప్లీట్‌ చెయ్యడానికి ప్లాన్‌ చేసుకున్న లియో చిత్ర యూనిట్‌, శరవేగంగా సినిమా షూటింగ్‌ చేస్తున్నారు. అక్టోబర్‌ లో ఎట్టి పరిస్థితిలో లియో సినిమా రిలీజ్‌ చేసి ఈ దసరా నుంచి దీపావళి వరకూ బాక్సాఫీస్‌ ని సొంతం చేసుకోవాలనేది లియో డైరెక్టర్‌-హీరో ప్లాన్‌ మరి ఇది ఎంత వరకూ వర్కౌట్‌ అవుతుందో చూడాలి.

Post a Comment

0 Comments

Popular Posts

Sri Chaitanya Sisters : శ్రీచైతన్య షెల్‌ కంపెనీల గుట్టు రట్టు !
Sri Chaitanya : వర్సిటీ మూసివేత ! శ్రీచైతన్య ఉద్యోగుల్లో కలవరం ?
JEE MAIN 2025 ఫలితాల్లో మరో సరికొత్త మోసానికి తెరతీసిన శ్రీచైతన్య !
Scholarships : కార్పొరేట్‌ విద్యాసంస్థల బోగస్‌ స్కాలర్‌షిప్‌ ట్రాప్‌  !!
SRI CHAITANYA NEET 2025 : కూలిపోతున్న డాక్టర్‌ కలలు !
JEE ADVANCED 2025 : IIT ర్యాంకుల పేరుతో తల్లిదండ్రుల్ని బకరాల్ని చేస్తున్న శ్రీచైతన్య !
INFINITY META JR APP పేరుతో అడ్డంగా దండుకుంటున్న శ్రీచైతన్య !
Sri Chaitanya : షెల్‌ కంపెనీల పుట్ట...నల్లధనం గుట్ట ....శ్రీచైతన్య !
 SRI CHAITANYA : షెల్‌ కంపెనీలతో  శ్రీచైతన్య డైరెక్టర్ల అంతులేని అక్రమాలు !
Sri Chaitanya Trust : ఇష్టారాజ్యంగా ఎడ్యుకేషనల్‌ ట్రస్ట్‌లు/ సొసైటీలు !