Ticker

6/recent/ticker-posts

Komatireddy Venkat Reddy Meets Priyanka Gandhi : పార్టీని వీడినోళ్ళు మళ్ళీ కాంగ్రెస్‌లోకి వస్తారు



కాంగ్రెస్‌ తెలంగాణ ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌ రెడ్డి ఢల్లీిలో పార్టీ నాయకురాలు ప్రియాంక గాంధీతో సమావేశమయ్యారు. దాదాపు 10 నిమిషాల పాటు చర్చించారు. జులై 7 తర్వాత తెలంగాణలో ప్రియాంక గాంధీ పర్యటించనున్నారు.ఈ నేపథ్యంలో ఆ విషయంతో పాటు తెలంగాణ ఎన్నికలు, భట్టి విక్రమార్క చేస్తోన్న పాదయాత్రపై వారిద్దరు చర్చించినట్లు తెలుస్తోంది. అనంతరం కోమటిరెడ్డి వెంకట్‌ రెడ్డి మీడియాతో మాట్లాడారు. పార్టీని వీడిన వారంతా కాంగ్రెస్‌ లోకి మళ్లీ వస్తారని తెలిపారు.మీ సోదరుడు కోమటిరెడ్డి రాజగోపాల్‌ రెడ్డి తిరిగి కాంగ్రెస్‌ లోకి వస్తారా? ’’ అని విలేకరులు ప్రశ్నిస్తే అందరూ వస్తారని కోమటి రెడ్డి వెంకట్‌ రెడ్డి అన్నారు. తాను పదవులు ఆశించడం లేదని తెలిపారు. స్టార్‌ కంపెయినర్‌గా ప్రియాంక గాంధీని రాష్ట్రానికి రావాలని ప్రచారాల్లో పాల్గొనాలని ఆహ్వానించానని చెప్పారు. 

మూడు నెలల ముందే సీట్ల ప్రకటన

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు రెండు లేదా మూడు నెలల ముందే 60 శాతం సీట్ల ప్రకటన ఉంటుందని కోమటిరెడ్డి వెంకట్‌ రెడ్డి తెలిపారు. రాష్ట్రంలో ప్రతి పదిరోజులకు ఒకసారి పర్యటించాలని తాను ప్రియాంక గాంధీని విజ్ఞప్తి చేశానని చెప్పారు. రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో పర్యటించేలా ప్రచారం ఉండాలని కోరామని తెలిపారు.ఈ సందర్భంగా ప్రియాంక గాంధీ కొన్ని సూచనలు చేశారని కోమటిరెడ్డి వెంకట్‌ రెడ్డి చెప్పారు. తెలంగాణ నుంచి వీలైనన్ని అధికంగా ఎంపీ స్థానాలు గెలవడం, రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచి ప్రభుత్వం ఏర్పడేలా పనిచేయాలని చెప్పారని అన్నారు. కర్ణాటక ఎన్నికల్లో పోరాడిన విధంగానే తెలంగాణాలో పోరాడాలని సూచించారని తెలిపారు. తెలంగాణ సమస్యలు తనకు తెలుసని ప్రియాంక గాంధీ చెప్పారని కోమటిరెడ్డి వెంకట్‌ రెడ్డి తెలిపారు.

Post a Comment

0 Comments

Popular Posts

Viindhya Gold : అధిక వడ్డీ వల విసురుతూ అక్రమంగా డిపాజిట్లు సేకరిస్తున్న వింధ్య గోల్డ్ !
VIINDHYA BULLION : భారీ కుంభకోణం దిశగా ‘వింధ్యా బులియన’ అడుగులు
Ankura Hospitals : AS Rao Nagar LLP ఆర్ధిక లావాదేవీలపై సంచలన కథనం!
GUNTUR : భారీ ఇన్వెస్ట్‌మెంట్ కుంభకోణం: రూ. 20 కోట్లతో బోర్డు తిప్పేసిన ‘అవని’ ముఠా!
ALLEN : అలెన్‌ పేరుతో అక్షర మార్క్‌ దందా !
AVIGNA LABORATORIES : ఈ లెక్కల్లో పెద్ద లోసుగుంది ? భారీ పన్ను ఉల్లంఘనలు?
Resonance School : తల్లిదండ్రుల నమ్మకం కోల్పోయిన రెజొనెన్స్‌ !
AVI CLINIC : IT కన్నుగప్పేలా ‘AVI’ మాయాజాలం ?
AP Governor Reacts on Babu Arrest  : చంద్రబాబు అరెస్ట్‌పై ఏపీ గవర్నర్‌ విస్మయం !
Sri Chaitanya Prodigy : తల్లిదండ్రులపై మోయలేని పెనుభారం !