Ticker

6/recent/ticker-posts

Ram Charan Talking About Mega Priences : పాప ఖచ్చితంగా నాన్నలానే ఉంటుంది

 

మెగా పవర్‌ స్టార్‌ రామ్‌ చరణ్‌- ఉపాసన దంపతులు ఇటీవల తల్లిదండ్రులైన సంగతి తెలిసిందే. ఈనెల 20న ఉపాసన ఆడబిడ్డకు జన్మనిచ్చారు. దాదాపు 11 ఏళ్ల నిరీక్షణ తరువాత మెగా కుటుంబంలో వారసురాలు అడుగుపెట్టింది. మెగా ప్రిన్సెస్‌ రాకతో మెగా కుటుంబంలోనే కాదు మెగా అభిమానుల్లో కూడా సంతోషం వెల్లివిరిసింది. దీంతో సంబురాలు అంబరాన్ని అంటాయి. ఇక మూడు రోజులు హాస్పిటల్‌ల్లోనే చికిత్స తీసుకుంటున్న ఉపాసన కొద్దిసేపటి క్రితమే డిశ్చార్జ్‌ అయ్యింది. భార్యను కూతురును ఇంటికి తీసుకువెళ్ళడానికి చరణ్‌ హాస్పిటల్‌కు చేరుకొని.. అక్కడ మీడియా వారితో ముచ్చటించాడు. ఇక పాప పుట్టిన తరువాత చరణ్‌ మొదటిసారి మీడియా ముందుకు రావడంతో జర్నలిస్టులు అందరు ప్రశ్నల వర్షం కురిపించారు. 

 అందరికీ థ్యాంక్యూ..

చరణ్‌ మీడియాతో మాట్లాడుతూ.. ’’ మీడియా మిత్రులకు, అభిమానులకు, మా వెల్‌ విషర్స్‌కు థాంక్స్‌. పాప.. 20 వ తేదీ ఉదయం జన్మించింది. ఈరోజే పాపను, ఉపాసనను డిశ్చార్జ్‌ చేశారు. ముందుగా అపోలో వైద్యులకు, స్టాఫ్‌కు చాలా థాంక్స్‌. ఉపాసనను, పాపను బాగా చూసుకున్నారు. ఇక అభిమానులు.. వారు చేసిన పూజలు.. పాప కోసం వారు ఎదురుచూసిన తీరు.. థాంక్స్‌. ఇంతకన్నా అభిమానులను ఏం అడుగగలుగుతాను. అభిమానుల ఆశీస్సులు ఎప్పుడు మా పాపకు ఉంటాయి. ఉండాలని కోరుకుంటున్నాను. మీరు చూపిస్తున్న ప్రేమకు నాకు మాటలు రావడం లేదు. మీ ఆశీస్సులు ఎప్పుడూ ఇలాగే ఉండాలని కోరుకుంటున్నా. ఒక తండ్రికి ఇంతకు మించిన వేరే ఆనందం ఏమీ ఉండదు. నాన్న కూడా చాలా సంతోషంగా ఉన్నారు. బాబు/పాప ఎవరు పుట్టినా ఏ పేరు పెట్టాలనే విషయమై నేనూ ఉపాసన ముందే మాట్లాడుకున్నాం. అదేంటో ఇప్పుడే చెప్పలేను. పేరు పెట్టే రోజున నేనే స్వయంగా మీతో పంచుకుంటా’’ అని రామ్‌చరణ్‌ అన్నారు. ఇంతకన్నా ఎక్కువ చెప్తే స్క్రిప్ట్‌ అనుకుంటారు’’ అని చెప్పుకొచ్చాడు. ఇక పాప ఎవరి పోలికలతో ఉంది మీదా.. లేదా అని ప్రశ్న ముగించకముందే.. ’’ ఖచ్చితంగా నాన్నలానే ఉంటుంది’’ అని చెప్పి చరణ్‌ గర్వంగా ఫీల్‌ అవ్వడం ఆకట్టుకుంటుంది. ఇందుకు సంబంధించిన ఫోటోలు వీడియోలు నెట్టింట వైరల్‌గా మారాయి.

Post a Comment

0 Comments

Popular Posts

Scholarships : కార్పొరేట్‌ విద్యాసంస్థల కుతంత్రం ! బోగస్‌ స్కాలర్‌షిప్‌లతో విద్యార్థులపై దండయాత్ర !!
Sri Chaitanya Trust : ఇష్టారాజ్యంగా ఎడ్యుకేషనల్‌ ట్రస్ట్‌లు/ సొసైటీలు !
Sri chaitanya : శ్రీచైతన్య స్కూల్‌ సీజ్‌ !
JEE ADVANCED 2025 : IIT ర్యాంకుల పేరుతో తల్లిదండ్రుల్ని బకరాల్ని చేస్తున్న శ్రీచైతన్య !
SRI CHAITANYA NEET 2025 : కూలిపోతున్న డాక్టర్‌ కలలు !
Sri Chaitanya : వర్సిటీ మూసివేత ! శ్రీచైతన్య ఉద్యోగుల్లో కలవరం ?
JEE MAIN 2025 ఫలితాల్లో మరో సరికొత్త మోసానికి తెరతీసిన శ్రీచైతన్య !
SriChaitanya School : సుచిత్రలో శ్రీచైతన్య బరితెగింపు !!
INFINITY META JR APP పేరుతో అడ్డంగా దండుకుంటున్న శ్రీచైతన్య !
Sri Chaitanya : షెల్‌ కంపెనీల పుట్ట...నల్లధనం గుట్ట ....శ్రీచైతన్య !