- హైదరాబాద్ బులియన్ మార్కెట్‌లో IT అలర్ట్?
- వింధ్య ఏయు బులియన్ ఎలఎల్‌పి’ లెక్కల్లో భారీ తేడాలు..
- పరిశోధనాత్మక కథనం!
హైదరాబాద్: బంగారం, వెండి వ్యాపారాలకు కేరాఫ్ అడ్రస్‌గా నిలిచే హైదరాబాద్ సనత్‌నగర్ వేదికగా కొత్తగా ఏర్పాటైన ఒక బులియన్ ట్రేడింగ్ సంస్థ ఇప్పుడు కార్పొరేట్ వ్యవహారాల మంత్రిత్వ శాఖ రికార్డుల్లో తీవ్రమైన చర్చకు దారితీస్తోంది. 2024 జూలై 22న అధికారికంగా రిజిస్టర్ అయిన “వింధ్య ఏయు బులియన్ ఎలఎల్‌పి” (VIINDHYA AU BULLION LLP) సమర్పించిన ఆర్థిక నివేదికలను క్షుణ్ణంగా పరిశీలిస్తే, సాధారణ కంటికి కనిపించని ఎన్నో విస్తుపోయే నిజాలు, లెక్కల తారుమారులు బయటపడుతున్నాయి. ఆదాయపు పన్ను శాఖ నిబంధనల ఉల్లంఘనల దిశగా ఈ సంస్థపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఈ సంస్థకు సంబంధించిన ప్రభుత్వ పత్రాలను ఫోరెన్సిక్ తరహాలో విశ్లేషించగా 4 ప్రధాన లోపాలు బయటపడ్డాయి.
రూ.4.75 కోట్ల పెట్టుబడి ఎటు పోయింది?
ఈ సంస్థకు సంబంధించిన అధికారిక మాస్టర్ డేటా మరియు వీరు దాఖలు చేసిన Form 8 (Solvency Report) ప్రకారం కంపెనీ మొత్తం భాగస్వామ్య పెట్టుబడి బాధ్యత (Total Obligation of Contribution) అక్షరాలా రూ.5,25,00,000 (రూ.5.25 కోట్లు) గా చూపించారు. కానీ ఆశ్చర్యకరంగా, అదే కాలానికి వీరు సమర్పించిన Form 11 (Annual Return) లో మాత్రం భాగస్వాములైన చల్లా అంజన్ ప్రసాద్, వింధ్య చల్లాలు కేవలం రూ.25 లక్షల చొప్పున మొత్తం రూ.50,00,000 (రూ.50 లక్షలు) మాత్రమే పెట్టుబడి బాధ్యతగా పేర్కొన్నారు! కానీ అధికారిక రికార్డుల్లో సంస్థ విలువను పెంచి చూపిస్తూ, వార్షిక రిటర్న్స్‌లో రూ.4.75 కోట్ల మేర పెట్టుబడిని దాచడం వెనుక అసలు ఉద్దేశం ఏమిటి? ఇది అప్రకటిత నల్లధనాన్ని వ్యవస్థలోకి తెచ్చే ప్రయత్నమా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
రూ.10 లక్షల వ్యాపారం.. రూ.18 లక్షల అడ్మిన్ ఖర్చులు!
కంపెనీ ప్రారంభమైన మొదటి 8 నెలల కాలానికి (31 మార్చి 2025 వరకు) చూపిన లాభ నష్టాల వివరాలు అత్యంత విచిత్రంగా ఉన్నాయి. మొత్తం టర్నోవర్ (వ్యాపారం): రూ.10,10,957, కొనుగోలు చేసిన ముడిసరుకు: రూ. 9,81,509 అడ్మినిస్ట్రేటివ్ (ఆఫీస్/నిర్వహణ) ఖర్చులు: రూ.1,898,051, మొత్తం నష్టం: రూ. 2,553,487 (సుమారు రూ.25.5 లక్షలు). కేవలం రూ. 10 లక్షల టర్నోవర్ ఉన్న ఒక చిన్న బులియన్ స్టార్టప్ సంస్థ, ఆఫీస్ నిర్వహణ కోసం టర్నోవర్‌కు రెట్టింపు స్థాయిలో రూ.18.9 లక్షల ఖర్చు చూపించడం ట్యాక్స్ ఎగవేత ప్లానింగ్‌లో ఒక భాగమని తెలుస్తోంది. అసలు ఈ సంస్థకు ఉద్యోగుల లేనట్లు తెలుస్తోంది. ఉద్యోగుల జీతాలు, ఆఫీసు నిర్వహణ అంటూ 18,98,000 చూపింది. ఈ సంస్థ కేవలం వింద్య బులియన్ ప్రై.లి. కంపెనీకి సూట్‌కేస్ (shell company) కంపెనీగా వ్యవహరిస్తోంది. గత రెండు సంవత్సరాలుగా ఉన్న ఉద్యోగుల వివరాలు మరియు వారికి చెల్లించిన బ్యాంగ్ జీతాల వివరాలు బయటపెట్టే దమ్ము ఉందా ? వింద్య ఏయు బులియన్ ఎల్.ఎల్.పి. యాజమాన్యానికి. ట్యాక్స్ కట్టకుండా తప్పించుకోవడానికి సొంత ఖర్చులను లేదా బోగస్ బిల్లులను అడ్మిన్ ఖర్చులుగా మళ్లించారా అన్న కోణంలో ఐటీ అధికారులు ఈ కంపెనీ రికార్డులపై నిఘా పెట్టాల్సిన అవసరం ఎంతైనా ఉంది.
వడ్డీ లేని అప్పులు.. ఆస్తుల్లో భారీ మాయాజాలం!
కంపెనీ ఆస్తులు మరియు అప్పుల నివేదిక ప్రకారం సంస్థకు మార్కెట్‌లో రూ.35,15,954 (రూ.35.15 లక్షలు) షార్ట్ టర్మ్ అప్పులు ఉన్నాయి. అయితే, ఇంత పెద్ద మొత్తంలో అప్పు తెచ్చినప్పటికీ, దానికి చెల్లించిన వడ్డీ మాత్రం రూ.0 (సున్నా) గా చూపించారు. అలాగే కంపెనీ ఆస్తుల విభాగంలో ఎలాంటి స్టాక్ (Inventories రూ.0) లేనప్పటికీ, ‘Other Current Assets (ఇతర ప్రస్తుత ఆస్తులు) కింద రూ. 36,81,262 (రూ.36.81 లక్షలు) దాచారు. వడ్డీ లేని ఈ రూ.35 లక్షల అప్పులు ఎక్కడి నుండి వచ్చాయి? ఆదాయపు పన్ను చట్టం ‘సెక్షన్ 68’ ప్రకారం ఇలాంటి లెక్కలు తేలని క్రెడిట్స్ తీవ్రమైన నేరంగా పరిగణించబడతాయి. అలాగే ఇతర ఆస్తుల పేరిట చూపించిన రూ. 36 లక్షల నగదును భాగస్వాములు తమ వ్యక్తిగత ప్రయోజనాల కోసం వాడుకున్నారా అనేది తేలాల్సి ఉంది.
రికార్డుల నమోదులో కాలయాపన
31 మార్చి 2025 నాటి ఆర్థిక నివేదికలపై ఆడిటర్ అక్టోబర్ 31, 2025న సంతకం చేయగా, కేంద్ర ప్రభుత్వ MCA సర్వర్లు దీనిని నవంబర్ 5, 2025 నాటికి కానీ పూర్తి స్థాయిలో రికార్డుల్లోకి తీసుకోలేదు. ఈ సుదీర్ఘ కాలయాపన, ఆర్థిక సంవత్సరం ముగిసిన తర్వాత సమర్పించటం వెనుక రికార్డులను తమకు అనుకూలంగా మార్చుకోవడానికి (Back-dated modifications) లూప్‌హోల్‌గా మారిందా అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ’వింధ్య AU BULLION LLP. కేవలం కాగితాలకే పరిమితమైన సంస్థా? లేక దీని వెనుక పెద్ద ఎత్తున నిధుల మళ్లింపు జరుగుతోందా? ఒకే పాన్ నంబర్ పరిధిలో ఉన్న వీరి ఇతర అనుబంధ సంస్థలైన ‘వింధ్య జ్యువెల్స్ ఎలఎల్‌పి’, ‘వింధ్య బలియన్ ప్రైవేట్ లిమిటెడ’ ల లెక్కలను కూడా ఐటీ శాఖ ఫారెన్సిక్ ఆడిట్ చేస్తే తప్ప అసలు నిజాలు బయటకు రావు. బులియన్ మార్కెట్ ముసుగులో జరుగుతున్న ఈ నిశ్శబ్ద ఆర్థిక లావాదేవీలపై తదుపరి పరిశోధనాత్మక కథనం త్వరలోనే మీకు అందించబోతున్నాం.




0 Comments