Ticker

6/recent/ticker-posts

SRI CHAITANYA : అవార్డులను కొనుక్కుంటున్న శ్రీచైతన్య !

2024 లో శ్రీచైతన్య రెండు అవార్డులను సొంతం చేసుకున్నట్లు తన బ్లాగ్స్‌లో వెల్లడిరచింది. రెండు ప్రముఖ మ్యాగజైన్స్‌లో కవర్‌ పేజీలో కథనం ప్రచురించింది. అందులో భారతదేశంలోనే అత్యంత గౌరవనీయమైన విద్యాసంస్థ పేరుతో శ్రీచైతన్య ప్రస్థానం మరియు సుష్మశ్రీ విద్యాప్రయాణం, భవిష్యత్తు ప్రణాళికల గురించి వివరించటం జరిగింది. బిజినెస్‌ మ్యాగజైన్‌ పేరుకు తగినట్టే ఇది కూడా ఒక బిజినెస్‌ ఆర్టికల్‌.  బిజినెస్‌ మ్యాగజైప్‌లో శ్రీచైతన్యను ప్రయోట్‌ చేసేందుకు అవార్డు పేరుతో హడావుడి చేసే ఒక పెయిడ్‌ ప్రమోషన్‌ ఇంటర్వ్యూ.  కానీ ప్రజలకు మాత్రం ఇది ఒక జెన్యూన్‌ ఇంటర్వ్యూలాగా కథనం వండి వార్చటం కొసమెరుపు. ఆయా ఆర్టికల్స్‌ను మ్యాగజైన్స్‌లో ప్రచురించినందుకు గాను శ్రీచైతన్య లక్షల్లో చెల్లించినట్లు తెలుస్తోంది. అంటే శ్రీచైతన్య తన అవార్డులను కొనుక్కుంటోంది అని చెప్పాలి.

అసలు నేటి రోజుల్లో అవార్డులకు అంత ప్రాధాన్యం ఉందా ?

అసలు అవార్డులు ఎవరు ఎవరికైనా ఇవ్వొచ్చా ? అవార్డులు తీసుకోవటం అంత ఈజీనా ? అసలు అవార్డులు ఇచ్చే సంస్థలకు అర్హత ఉందా ? ఒకవేళ ఉంటే అవార్డులు ఎంపిక చేసే సమయంలో ఎలాంటి అంశాలు పరిగణనలోకి తీసుకున్నారు ? ఆయా అవార్డు కమిటీలలో ఎవరెవరు ఉన్నారు ? వారి అర్హతలు ఏమిటి ? ర్యాంకులు వచ్చాయి అని చెప్తున్న ఎగ్జామ్స్‌లో అసలు మొత్తం ఎంత మంది చదివారు ? ఎంత మంది విజయం సాధించారు ? మిగతా విద్యార్థులు ఏం చేస్తున్నారు ? సక్సెస్‌ గురించి మాత్రమే చెప్పుకునే ఈ సంస్థలు ర్యాంకులు రాని లక్షలాది మంది గురించి ఎందుకు చెప్పటం లేదు ? కనీసం తక్కువ ఫీజులతో పేద విద్యార్థులకు చదువును దగ్గర చేస్తుందా ? సామాజిక బాధ్యతగా ఎలాంటి సేవలు చేస్తోంది ? వీటిలో ఏ ఒక్క అంశాన్ని అయినా పరిగణనలోకి తీసుకుని అవార్డు ఇచ్చారా ? లేక వారికి నచ్చిన అంశాలను పరిగణనలోకి తీసుకుని ఒకరి కోసం ఒకరు నిలబడి అవార్డులు ప్రదానం చేసుకుని ప్రజలను మభ్యపెడుతున్నారా ? అంటే అవును అనే సమాధానం వినిపిస్తోంది.  బిజినెస్‌ నిర్వహించే వ్యక్తుల సక్సెస్‌ స్టోరీలను మాత్రమే వెలుగులోకి తీసుకొచ్చే ఈ మ్యాగజైన్‌లు నాణానికి రెండో వైపు ఉన్న ర్యాంకులు సాధించలేని విద్యార్థుల జీవితాలను వెలుగులోకి తీసుకవచ్చే ప్రయత్నం చేశారా ? అంటే లేదు అనే మాటే వినిపిస్తుంది. అసలు చదువు అంటే వ్యాపారం కాదు, సేవ అని అవార్డులు ఇచ్చే మ్యాగజైన్స్‌కు తెలుసా ?

టాప్‌ ర్యాంకుల పేరుతో లక్షలాది మందికి ఎర !

10 లోపు 2 ర్యాంకులు, 100 లోపు 23 ర్యాంకులు అని విద్యాసంస్థలు ప్రకటిస్తుంటే...ఏ మాత్రం ఆలోచించకుండా పిల్లల్ని ఆయా కార్పొరేట్‌ సంస్థల్లో వారి అడిగినంత ఫీజు కట్టి తమ పిల్లల్ని బలవంతంగా అక్కడే చేర్చుతుండటం తల్లిదండ్రులకు పరిపాటిగా మారిపోయింది. మార్కులు, ర్యాంకుల మాయలో పడిపోయిన తల్లిదండ్రులు తమ పిల్లలు సైతం టాప్‌ ర్యాంకులు సాధిస్తారనే భ్రమలోనే శ్రీచైతన్యలాంటి సంస్థల్లో చేర్చుతున్నారు. సమయం గడిచే కొద్ది తత్వం బోధపడుతుంది. రెండేళ్ళ తర్వాత అసలు విషయం బయటపడుతుంది.  శ్రీచైతన్యలో చేరితే ర్యాంకు రాదు, స్వతహాగా ప్రతిభావంతుడైతేనే ర్యాంకు వస్తుందని తెలుస్తుంది. అప్పుడు మోసం పోయామని అర్థం అవుతుంది. ఏమి చేయాలో తెలియక, ఎవరిని అడగాలో అర్థం కాక తల్లిదండ్రులు మిన్నకుండిపోతున్నారు.  శ్రీచైతన్యలో చేర్పిస్తే ఎందుకు చదవలేదని తమ పిల్లల్ని నిందించే తల్లిదండ్రుల్ని చూస్తూనే ఉన్నాం. మీరు అదే తప్పు చేస్తేన్నారా ? ఇకనైనా తెలివిగా ఆలోచిచండి, మోసం పోవటం మానేయండి. ఇక్కడ ఒక విషయం నిశితంగా గమనించండి. శ్రీచైతన్యకు తెలుగు రాష్ట్రాల్లో దేశవ్యాప్తంగా వందాలాది బ్రాంచీలు ఉన్నాయి. వాటిల్లో 10 లేదా 20 బ్రాంచీల నుండి మాత్రమే ఒకటో రెండో ర్యాంకులు వస్తున్నాయి. అసలు ప్రతి బ్రాంచ్‌కి ప్రభుత్వ గుర్తింపు ఉంటుంది. ఆ బ్రాంచ్‌ ఫలితాలు అక్కడే ప్రకటించుకోవాల్సి ఉంటుంది. కానీ రాష్ట్రం అంతటా ఆయా ర్యాంకులు ప్రకటిస్తున్నా ప్రభుత్వాలు పట్టించుకోవకపోవటం చూస్తూనే ఉన్నాం. మిగిలిన బ్రాంచీల్లో సాధారణ ఫలితాలు ఉంటాయి. కానీ టాప్‌ 10 ర్యాంకులే అన్నీ బ్రాంచీలలో ప్రచురించి పి.ఆర్‌.ఓ లతో మార్కెటింగ్‌ చేసుకుంటూ అడ్మిషన్లు చేసుకోవటం, కోట్లాది రూపాయలు దండుకోవటం తప్పించి నైతికతకు చోటు ఎక్కడుంది.

Post a Comment

0 Comments

Popular Posts

Resonance Schools : J.D.లక్ష్మీనారాయణ రెజొనెన్స్‌కి ప్రచారకర్తగా మారారా ?
Resonance Schools : టీచర్లు లేకుండా బోధన ఎలా ?
Kadapa Sri Chaitanya : శ్రీచైతన్య హాస్టల్స్‌లో ఆగని మరణమృదంగం !
Physics Wallah : 'సరసమైన ధరకే చదువు' ఫిజిక్స్‌ వాలా IPOని గట్టెక్కిస్తుందా ?
Sri Chaitanya Fake Olympiads : ఆగని శ్రీచైతన్య ఫేక్‌ ఒలింపియాడ్స్‌ దందా !
Sri Chaitanya Score Scholarship : శ్రీచైతన్య రూ.350 కోట్లు మాయాజాలం !
sri chaitanya : తవ్వేకొద్ది బయటపడుతున్న శ్రీచైతన్య షెల్‌ కంపెనీల అక్రమాలు !
Resonance Schools : పర్మిషన్లు లేకుండా అడ్మిషన్లు ఎలా ?
Sri Chaitanya Sisters : శ్రీచైతన్య షెల్‌ కంపెనీల గుట్టు రట్టు !
Sri Chaitanya Prodigy : తల్లిదండ్రులపై మోయలేని పెనుభారం !