Ticker

6/recent/ticker-posts

BRSకు శ్రీచైతన్య రూ. 12 కోట్లు విరాళం ! క్విడ్‌ ప్రోలో శ్రీచైతన్య యాజయాన్యం ?

రియల్‌ ఎస్టేట్‌, కన్‌స్ట్రక్షన్‌, ఇన్‌ఫ్రా, ఫార్మా వంటి ప్రముఖ సంస్థలు కోట్లాది రూపాయలు పార్టీలకు విరాళాలు సమర్పించుకున్నాయి. సుప్రీంకోర్టు తీర్పుతో స్టేట్‌ బ్యాంక్‌ అఫ్‌ ఇండియా ఎలక్టోరల్‌ బాండ్స్‌ వివరాలను సమర్పించింది. వీటిలో ప్రముఖ విద్యాసంస్థ ఉండటం విస్తుగొలుపుతోంది. కోకపేటలాంటి హాట్‌కేక్‌ ప్రాంతంలో భూమికి సహకరించినందుకు గాను  ప్రతిగానే శ్రీచైతన్య యాజమాన్యం శ్రీ చైతన్య స్టూడెంట్స్‌ ఫెసిలిటీ మేనేజ్‌మెంట్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ కంపెనీ ద్వారా ఏప్రిల్‌ 8, 2022న బీఆర్‌ఎస్‌ పార్టీకి రూ. 10 కోట్లు , వర్సిటీ ఎడ్యుకేషన్‌ మేనేజ్‌మెంట్‌ ప్రై.లి. పేరు మీద బీఆర్‌ఎస్‌ పార్టీకి మరో రూ. 2 కోట్లు మొత్తం రూ. 12 కోట్లు బీఆర్‌ఎస్‌ పార్టీకి ఎలక్టోరల్‌ బాండ్స్‌ ద్వారా పార్టీకి విరాళాలు అందించినట్లు ఊహగానాలు చెలరేగుతున్నాయి. వీటితో పాటు కోట్లాది రూపాయలు చేతులు మారినట్టు తెలుస్తోంది. ఇవే కాకుండా జనవరి 11, 2024న తెలుగుదేశం పార్టీకి 5 కోట్లు , జనవరి 11, 2024న జనసేన పార్టీకి  రూ.1 కోటి చెల్లింపులు జరిపింది. కేవలం పార్టీ ఫండ్‌ కోసం కోట్ల విలువైన ఎలక్టోరల్‌ బాండ్లను కొనుగోలు చేసినట్లు ఈసీ రికార్డుల్లో తేలింది. 



శ్రీచైతన్య  క్విడ్‌ ప్రో కు పాల్పడిరదా ?

జూలై 16, 2021లో నియోపోలీస్‌ పేరుతో హెచ్‌ఎండిఏ భూముల అమ్మకం ద్వారా 2000 కోట్లు సమకూర్చుకుంది. ఆ భూముల్లో ఎకరం 42.2 కోట్లు అత్యధికంగా పలికింది. ఈ భూములన్నీ అప్పటి ప్రభుత్వం సొంత వారికి,అనుయాయులకు కట్టబెట్టినట్లు ఆరోపణలు వెల్లువెత్తాయి.  వేలానికి ముందే పలువురు రియల్టర్లకు హెచ్‌ఎండీఏలోని అధికారులు సమాచారం చేరవేశారట. తద్వారా ఆ ఫలానా రియాల్టర్లకే భూములు దక్కేలా అధికారుల చర్యలు తీసుకున్నట్లు తేలింది. దీనిలో భాగంగా ముందుగానే నిర్ణయించిన శ్రీచైతన్య యాజమాన్యానికి చెందిన వర్సిటీ ఎడ్యుకేషన్‌ మేనేజ్‌మెంట్‌కి 7.57 ఎకరాల భూమికి అప్పటి ప్రభుత్వం కట్టబెట్టింది. అదే భూమికి దగ్గరలో  రెండేళ్ళ లోపే ఆగష్టు 3, 2023 నాటికి నియోపోలీస్‌లో సమీపంలోని భూములను వేలం వేసింది. అప్పటికి భూముల ధర ఎకరం రూ. 100 కోట్లు పలికింది. కేవలం రెండేళ్ళ వ్యవధిలో దాదాపు  ఎకరానికి 60 కోట్ల లాభాలు ఆర్జించింది. ఇదంతా 2021లో నియోపోలీస్‌లో భూవేలం ద్వారా 7.57 దక్కించుకున్న 9 నెలల తర్వాత బీఆర్‌ఎస్‌ ప్రభుత్వానికి రూ. 12 కోట్లు ఎలక్టోరల్‌ బాండ్స్‌ ద్వారా విరాళం అందించింది. 2023 ఆగష్టు నాటికి ఆ భూమలు విలువ రూ. 100 కోట్లకు చేరింది. ఇప్పుడు నియో పోలీస్‌లో పాట్లు దక్కించుకున్న వారందరూ బీఆర్‌ఎస్‌ పార్టీకి విరాళాలు అందించిన వారిలో ఉండటం గమనార్హం. వీరితో పాటుగా సత్యనారాయణ రెడ్డి మన్నె (యం.ఎస్‌.ఎన్‌.గ్రూప్‌) 7. 72 ఎకరాలకు గాను 20 కోట్లు ఎలక్టోరల్‌ బాండ్స్‌ రూపంలో బీఆర్‌ఎస్‌కు సమర్పించుకుంది. రాజ్‌పుష్ప ప్రాపర్టీస్‌ ప్రై.లి. కంపెనీకి 7. 75 ఎకరాలకు గాను 20 కోట్ల ఎలక్టోరల్‌ బాండ్స్‌లు, ఆక్వా స్పేస్‌ డెవలపర్స్‌ ప్రై.లి. కంపెనీకి 7. 73 ఎకరాలు లబ్ది పొందినందుకు గాను 15 కోట్లు ఎలక్టోరల్‌ బాండ్స్‌ను బీఆర్‌ఎస్‌ పార్టీకి అందించింది. అలాగే ప్రస్టీజ్‌ ఎస్టేట్‌ ప్రాజక్ట్‌ డెవలపర్స్‌ 7.56 ఎకరాలకు గాను రూ. 15 కోట్లు ఎలక్టోరల్‌ బాండ్స్‌ అందించింది. ప్రభుత్వమే వారికి కావలసిన వారికి భూవేలం పేరుతో అయిన వారికి కట్టబెట్టింది. తాజాగా.. హెచ్‌ఎండీఏలో జరిగిన భూముల వేలంలో అక్రమాలు జరిగినట్టు ఏసీబీ గుర్తించింది. వేలానికి ముందే పలువురు రియల్టర్లకు హెచ్‌ఎండీఏలోని అధికారులు సమాచారం చేరవేశారట. తద్వారా ఆ ఫలానా రియాల్టర్లకే భూములు దక్కేలా అధికారుల చర్యలు తీసుకున్నట్లు తేలింది.ఈ మేరకు.. వేలంపాటపై ప్రభుత్వానికి ఏసీబీ నివేదిక ఇచ్చింది. దీంతో వేలంపాటను ఆపేయాలని కాంగ్రెస్‌ ప్రభుత్వం నిర్ణయించినట్లు సమాచారం. అంతేకాదు.. ఇప్పటికే వేలం వేసిన భూములపై అధికారులు విచారణ చేపట్టారు. భూములను వెనక్కి తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.
 



Post a Comment

0 Comments

Popular Posts

Resonance Schools : J.D.లక్ష్మీనారాయణ రెజొనెన్స్‌కి ప్రచారకర్తగా మారారా ?
Resonance Schools : టీచర్లు లేకుండా బోధన ఎలా ?
Kadapa Sri Chaitanya : శ్రీచైతన్య హాస్టల్స్‌లో ఆగని మరణమృదంగం !
Physics Wallah : 'సరసమైన ధరకే చదువు' ఫిజిక్స్‌ వాలా IPOని గట్టెక్కిస్తుందా ?
Sri Chaitanya Fake Olympiads : ఆగని శ్రీచైతన్య ఫేక్‌ ఒలింపియాడ్స్‌ దందా !
Sri Chaitanya Score Scholarship : శ్రీచైతన్య రూ.350 కోట్లు మాయాజాలం !
Knowledge Hub : పేదవాడికి చదువుని దూరం చేయటమే శ్రీచైతన్య నాలెడ్జ్‌హబ్‌ ఉద్దేశ్యమా ?
Sri Chaitanya : షెల్‌ కంపెనీల పుట్ట...నల్లధనం గుట్ట ....శ్రీచైతన్య !
No Qualified Teachers in SriChaitanya : అనర్హులతో శ్రీచైతన్య పాఠాలు ... విద్యార్థుల భవితపై నీలినీడలు !
Resonance Schools : పర్మిషన్లు లేకుండా అడ్మిషన్లు ఎలా ?