Ticker

6/recent/ticker-posts

Ponguleti : ప్రజాతీర్పుకు ఎవ్వరైనా తలవంచాల్సిందే !

ఎంత పెద్ద మొనగాడైన ప్రజా తీర్పుకు తల వంచాల్సిందే అని మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఖమ్మం జిల్లా పెనుబల్లి మండలంలో కాంగ్రెస్‌ పార్టీ ఆత్మీయ సమ్మేళనంలో మాట్లాడుతూ.. కాంగ్రెస్‌లో అనేక గ్రూప్‌లు ఉన్నాయని అన్నారు. అందరం ఐక్యతతో ఉన్న సమయాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు. అహంకారంకు పోకుండా పని చేయాలని పిలుపునిచ్చారు. 10 ఏళ్లుగా ఈ ప్రాంతానికి పట్టిన దరిద్రంను పోగొట్టేందుకు ప్రతి ఒక్కరూ కష్టపడాలన్నారు. 10 రోజులలో 18 గంటలు కష్టపడి ఓటర్లను బూత్‌ ల వరకు తీసుకు వెళ్ళాలని అన్నారు. తెలంగాణ ప్రజలు మార్పు కోరుకుంటున్నారని తెలిపారు. 119 నియోజకవర్గాల్లో కాంగ్రెస్‌ పార్టీ ప్రభంజనం వీస్తుందన్నారు. అధికారంలో ఉన్న వ్యక్తికి హుజూరాబాద్‌ లో వందల కోట్లు ఖర్చు పెట్టిన అధికార పార్టీకి ఫలితం దక్కలేదని.. అక్కడ వచ్చిన ఫలితమే సత్తుపల్లి లో వస్తుందన్నారు. డబ్బుతో రాజకీయం చేయలేం..అది సాధ్యం కాదన్నారు. బడా బాబులు వచ్చి డబ్బుల సంచులు ఇచ్చినంత మాత్రాన సత్తుపల్లి ప్రజలు మోసపోరని తెలిపారు. కరోనా సమయంలో నీళ్ల ఇంజక్షన్‌ లు చేసి డబ్బులు పోగేసి ఆ డబ్బులు ఇప్పుడు ఖర్చు పెడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.

డబ్బుతో రాజకీయాలను శాసించలేం !

గతంలో నియోజకవర్గానికి ఏం చేశారో చెప్పాలి? అని ప్రశ్నించారు. డబ్బుతో రాజకీయం చేయాలనుకోవడం మూర‰త్వమని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఉద్యోగస్తులకు జనం మీదకు పంపి వాళ్ళను మార్చాలి అనుకోవటం అమాయకత్వమన్నారు. వందల, కోట్లు పంచండి.. ఉమ్మడి జిల్లాలో ప్రజలు చైతన్యవంతులని తెలిపారు. కేసీఅర్‌ ను మించిన మంచి మాటకారి, అంతేకాదు పరోక్షంగా సండ్ర పై విమర్శలు గుప్పించారు. సామాన్య ప్రజలను,చిన్న చిన్న వారిని పెట్టిన ఇబ్బందులు ఎవరు మర్చిపోరు..రిటర్న్‌ గిఫ్ట్‌ ఇవ్వటానికి సిద్ధంగా ఉన్నారని అన్నారు. వచ్చే ప్రభుత్వం ఎంటో అందరికీ తెలుసన్నారు. డిసెంబర్‌ 9 తరువాత తోత్తులకు, కబ్జాదారులు అర్థం అవుతుంది.. తెలంగాణ ప్రజల తీర్పు ఏంటో అని ధీమా వ్యక్తం చేశారు. ప్రజా బలం మనది.. డబ్బు బలం వాళ్ళదని పొంగులేటి అన్నారు. ప్రజా తీర్పులో ఎంత పెద్ద మొగోడైన తల వంచాల్సిందే అని సంచలన వ్యాఖ్యలు చేశారు. గ్రామాల్లో లీడర్షిప్‌ ఎక్కువగా ఉంది.. ఐక్యతగా పనిచేయాల్సిన అవసరం ఉందన్నారు. రెండో ఆలోచన లేకుండా సత్తుపల్లిలో కాంగ్రెస్‌ పార్టీ గెలవాలని అన్నారు. దొరల పాలన కు,ఇందిరమ్మ రాజ్యం కు మధ్యలో మనం ఉన్నామని తెలిపారు. హస్తం గుర్తుకు ఓటేసి కాంగ్రెస్‌ అభ్యర్థి మట్టా రాగమయినీ గెలిపించాలని కోరారు.

Post a Comment

0 Comments

Popular Posts

Sri Chaitanya Sisters : శ్రీచైతన్య షెల్‌ కంపెనీల గుట్టు రట్టు !
Sri Chaitanya : వర్సిటీ మూసివేత ! శ్రీచైతన్య ఉద్యోగుల్లో కలవరం ?
JEE MAIN 2025 ఫలితాల్లో మరో సరికొత్త మోసానికి తెరతీసిన శ్రీచైతన్య !
Scholarships : కార్పొరేట్‌ విద్యాసంస్థల బోగస్‌ స్కాలర్‌షిప్‌ ట్రాప్‌  !!
SRI CHAITANYA NEET 2025 : కూలిపోతున్న డాక్టర్‌ కలలు !
JEE ADVANCED 2025 : IIT ర్యాంకుల పేరుతో తల్లిదండ్రుల్ని బకరాల్ని చేస్తున్న శ్రీచైతన్య !
INFINITY META JR APP పేరుతో అడ్డంగా దండుకుంటున్న శ్రీచైతన్య !
Sri Chaitanya : షెల్‌ కంపెనీల పుట్ట...నల్లధనం గుట్ట ....శ్రీచైతన్య !
 SRI CHAITANYA : షెల్‌ కంపెనీలతో  శ్రీచైతన్య డైరెక్టర్ల అంతులేని అక్రమాలు !
Sri Chaitanya Trust : ఇష్టారాజ్యంగా ఎడ్యుకేషనల్‌ ట్రస్ట్‌లు/ సొసైటీలు !