Ticker

6/recent/ticker-posts

Bhatti Vikramarka : బీఆర్‌ఎస్‌ను దించుదాం...సంపదను ప్రజలకు పంచుదాం !

సీఎం, మంత్రులు అందుబాటులో లేని సెక్రటేరియేట్‌ ఎందుకు..? అని సీఎల్పీ నేత భట్టి విక్రమార్క ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రస్తుతం జరుగుతున్న ఎన్నిక దొర తెలంగాణకు.. ప్రజల తెలంగాణకు మధ్య జరుగుతోన్న యుద్దం అన్నారు. ముదిగొండ మండలం ఖానాపురం గ్రామంలో భట్టి కార్నర్‌ మీటింగ్‌ లో పలువురు బీఆర్‌ఎస్‌ నేతలకు కాంగ్రెస్‌ పార్టీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. భట్టి తెలంగాణ సీఎం కావాలంటూ ఖానాపూర్‌ గ్రామస్తుల ఆకాంక్ష అని అన్నారు. జలగం వెంగళరావు తర్వాత ఖమ్మం జిల్లా నుంచి భట్టికే అవకాశం ఉందన్న ఖానాపూర్‌ వాసులు తెలిపారు. ఖమ్మం జిల్లా మధిరలో ఎన్నికల ప్రచారంలో భట్టి మాట్లాడుతూ.. తెలంగాణ వచ్చి పదేళ్లు కావస్తోన్నా.. సీఎం, మంత్రులు సెక్రటేరీయేట్టుకు రావడం లేదని అన్నారు. సీఎం, మంత్రులు అందుబాటులో లేని సెక్రటేరీయేట్‌ ఎందుకు..? అని ప్రశ్నించారు. ఇరిగేషన్‌ ప్రాజెక్టులు కుంగిపోతున్నాయని తెలిపారు. కాళేశ్వరం పేరుతో రూ. 1లక్ష కోట్లు.. మిషన్‌ భగీరధ పేరుతో రూ. 50 వేల కోట్లు నిరుపయోగం చేశారని అన్నారు. ప్రాజెక్టుల పేరుతో దోపిడీ జరుగుతోందని మేం గొంతు చించుకుని అరిచాం.. గళమెత్తామని తెలిపారు. బీఆర్‌ఎస్‌ ప్రభుత్వాన్ని వదిలించుకోకుంటే రాష్ట్రానికే భవిష్యత్తే ఉండదని తెలిపారు. బీఆర్‌ఎస్‌ ప్రభుత్వాన్ని దించుదాం.. టీఆర్‌ఎస్‌ నేతలను దంచుదాం.. సంపదను ప్రజలకు పంచుదామన్నారు.

ఉద్యోగాలు ఇస్తాం !

ఇళ్ల స్థలం ఇవ్వనున్నాం.. ఇంటి నిర్మాణానికి రూ. 5 లక్షలు ఇవ్వనున్నామని తెలిపారు. రూ. 2 లక్షల రుణ మాఫీ ఇస్తామన్నారు. రైతులకే కాదు.. రైతు కూలీలను ఆదుకునే పథకాలు మేనిఫెస్టోలో పెట్టామన్నారు. ప్రతేడాది జాబ్‌ క్యాలెండర్‌ ప్రకటిస్తామన్నారు. మొదటి ఏడాదిలోనే 2 లక్షల ఉద్యోదాలిస్తామని తెలిపారు. రాబోయే కాంగ్రెస్‌ ప్రభుత్వంలో మధిర ప్రధాన భూమిక పోషించబోతోందని అన్నారు. పారిశ్రామికంగా మధిర అభివృద్ధికి ప్రణాళికలు రచిస్తున్నామని తెలిపారు. కాంగ్రెస్‌ పార్టీకి మద్దతిస్తున్న టీడీపీ, సీపీఐ పార్టీలకు ధన్యవాదాలు అన్నారు. ప్రజలకు మేం గాలి మాటలు చెప్పడం లేదు.. సంతకాలతో కూడిన గ్యారెంటీ కార్డు ఇస్తున్నామన్నారు. విభజన తర్వాత తెలంగాణకు వచ్చిన సంపద అంతా దొరల దగ్గరికే వెళ్లిందన్నారు. తెలంగాణ వచ్చిన తర్వాత కూడా పేదలు పేదలుగానే మిగిలిపోయారు.. అలిసిపోయారన్నారు. నిరుద్యోగులు.. నిరుద్యోగులుగానే మిగిలిపోయారని తెలిపారు. దొరలపై పేదలు గెలవాలన్నారు. పేదలు గెలవాలంటే కాంగ్రెస్‌ గెలవడమే అని తెలిపారు. ఆరు గ్యారెంటీలను కాంగ్రెస్‌ పార్టీ ప్రకటించిందన్నారు. విద్యార్థుల కోసం రూ. 5 లక్షల క్రెడిట్‌ కార్డు ఇస్తామని తెలిపారు. విద్యార్థినులకు బ్యాటరీ స్కూటర్‌ పంపిణీ చేస్తామన్నారు. అభివృద్ధి, సంక్షేమాన్ని నిర్లక్ష్యం చేసిన బీఆర్‌ఎస్‌ ప్రభుత్వాన్ని వదిలించుకుందామని భట్టి తెలిపారు.

Post a Comment

0 Comments

Popular Posts

sri chaitanya : తవ్వేకొద్ది బయటపడుతున్న శ్రీచైతన్య షెల్‌ కంపెనీల అక్రమాలు !
Sri chaitanya : శ్రీచైతన్య స్కూల్‌ సీజ్‌ !
Sri Chaitanya Trust : ఇష్టారాజ్యంగా ఎడ్యుకేషనల్‌ ట్రస్ట్‌లు/ సొసైటీలు !
Scholarships : కార్పొరేట్‌ విద్యాసంస్థల కుతంత్రం ! బోగస్‌ స్కాలర్‌షిప్‌లతో విద్యార్థులపై దండయాత్ర !!
SRI CHAITANYA NEET 2025 : కూలిపోతున్న డాక్టర్‌ కలలు !
JEE ADVANCED 2025 : IIT ర్యాంకుల పేరుతో తల్లిదండ్రుల్ని బకరాల్ని చేస్తున్న శ్రీచైతన్య !
Sri Chaitanya Sisters : శ్రీచైతన్య షెల్‌ కంపెనీల గుట్టు రట్టు !
Suicides in Sri chaityana Hostels: కార్పొరేట్‌ హాస్టల్స్‌లో ఘోషిస్తున్న ఆత్మలు !
INFINITY META JR APP పేరుతో అడ్డంగా దండుకుంటున్న శ్రీచైతన్య !
INFINITY META APP : ఆన్‌లైన్‌ పేరుతో ఇన్ఫినిటీ దోపిడీ !