Ticker

6/recent/ticker-posts

Janasaniks Fires on Mudragada : ముద్రగడ పద్మనాభంపై జనసైనికుల విమర్శనాస్త్రం !

కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం రాసిన లేఖపై జనసేన సైనికుల సోషల్‌ మీడియా యుద్ధం మొదలు పెట్టారు. ముద్రగడను ఉద్దేశిస్తూ ఓ పేద కాపు యువకుడి ఆవేదన అంటూ సోషల్‌ మీడియాలో లేఖను వైరల్‌ చేస్తున్నారు. ‘‘ఈ లేఖ మీకు రాసినందుకు.. మీకు కోపం రావాలన్నా రెడ్డి గారి పర్మిషన్‌ కావాలి కదండీ. ఆంధ్రప్రదేశ్‌లో కాపులను విలన్లుగా చూపించి మీ పబ్బం గడుపుకున్నారు. కాపులకు రిజర్వేషన్‌ ఇవ్వను అని జగన్‌ చెప్పినా.. మీరు ఆయనకు మద్దతు ఎందుకిచ్చారండీ?

రోజురోజుకి ప్రజల ప్రేమను పొందుతున్నాం !

కాపుల రిజర్వేషన్‌ అంశాన్ని జనసేన మేనిఫెస్టోలో పెట్టిన పవన్‌ కళ్యాణ్‌ మీకు శత్రువు ఎలా అయ్యారండీ? కులాన్ని అడ్డుపెట్టుకుని కాంగ్రెస్‌, తెలుగుదేశం ప్రభుత్వాలలో మంత్రి పదవులు చేపట్టి, ఇప్పుడు కులంతో సంబంధం లేనట్టు మాట్లాడతారు ఏంటండీ? ప్రజారాజ్యం పార్టీకి ఎదురు నిలబడి ఓటమి చెందారండి మీరు. పవన్‌ కల్యాణ్‌ ధైర్యానికి, కమిట్మెంట్‌కి సరితూగే వ్యక్తి మీరు కానే కాదు.. ముద్రగడ గారూ. ప్రజల్లో ప్రేమను మేము రోజురోజుకూ పొందుతూ ఉంటే మీ కళ్ళను రెడ్డి గారి పంచె సందులో ఏమైనా పెట్టుకున్నారా? ప్రజలు మంత్రులను నిలదీయడం మీరు రెడ్డి గారి పంచె సందులో నుంచి మీ కళ్ళను తీసి బాహ్య ప్రపంచాన్ని చూస్తే తెలుస్తుంది అండి.

కౌలు రైతులను ఆదుకున్న పవన్‌ !

మీ మోసాలను చూసి కాపు జాతి మొత్తం మేల్కున్నా మండి.. మీరు బీపీ ట్యాబ్లెట్‌ వేసుకుని పడుకోండి ..మీ ఆరోగ్యానికి మంచిది. పొత్తుల విషయం ఇంకా తేలలేదండి.. అందుకే ఆయన దారిలో ఆయన అధికార పక్షాన్ని ఎదిరిస్తూ వెళ్తున్నారండి. మీకు ఈ విషయం అర్థం కాకపోవడం అనేది రెడ్డి గారి పాలేరుగా దశాబ్దాల పాటు ఉండిపోవడమేనండి, వాళ్ళు ఏం చెబితే అది పాటించడమేనండి మీ బతుకంతా. మంత్రిగా మీరు ఘనకార్యాలు.. మా పెద్దలు చెబుతూనే ఉంటారండీ. ఈ కుల ద్రోహి ముద్రగడని నమ్మకండి అని. ద్వారంపూడి మీకు గొప్పెమో .. కౌలు రైతులకు తలా లక్ష ఇచ్చిన పవన్‌ కళ్యాణ్‌ కాలి గోటికి మీరు సరిరారు’’ అని జన సైనికులు లేఖలో పేర్కొన్నారు.

Post a Comment

0 Comments

Popular Posts

Sri Chaitanya Sisters : శ్రీచైతన్య షెల్‌ కంపెనీల గుట్టు రట్టు !
Sri Chaitanya : వర్సిటీ మూసివేత ! శ్రీచైతన్య ఉద్యోగుల్లో కలవరం ?
JEE MAIN 2025 ఫలితాల్లో మరో సరికొత్త మోసానికి తెరతీసిన శ్రీచైతన్య !
Scholarships : కార్పొరేట్‌ విద్యాసంస్థల బోగస్‌ స్కాలర్‌షిప్‌ ట్రాప్‌  !!
SRI CHAITANYA NEET 2025 : కూలిపోతున్న డాక్టర్‌ కలలు !
JEE ADVANCED 2025 : IIT ర్యాంకుల పేరుతో తల్లిదండ్రుల్ని బకరాల్ని చేస్తున్న శ్రీచైతన్య !
INFINITY META JR APP పేరుతో అడ్డంగా దండుకుంటున్న శ్రీచైతన్య !
Sri Chaitanya : షెల్‌ కంపెనీల పుట్ట...నల్లధనం గుట్ట ....శ్రీచైతన్య !
 SRI CHAITANYA : షెల్‌ కంపెనీలతో  శ్రీచైతన్య డైరెక్టర్ల అంతులేని అక్రమాలు !
Sri Chaitanya Trust : ఇష్టారాజ్యంగా ఎడ్యుకేషనల్‌ ట్రస్ట్‌లు/ సొసైటీలు !