Ticker

6/recent/ticker-posts

Sri Chaitanya : Jee Main 2025లో శ్రీచైతన్య గోల్‌మాల్‌ రిజల్ట్స్‌ !

  • NTA ఫలితాలకు వక్రభాష్యం ! 
  • రెండు సబ్జెక్టులో 100 మార్కులు సాధించిన విద్యార్థులను చూపుతూ తప్పుడు ప్రకటనలు ! 
  • తల్లిదండ్రులను బురిడీ కొట్టిస్తున్న వైనం !

NTA ప్రకటించిన JEE MAIN 2025 సెషన్‌ -1 ఫలితాల్లో శ్రీచైతన్య బాగా వెనుకబడిరది. ఎప్పుడు లేనంతగా చెత్త రిజల్ట్స్‌ను సాధించింది. దీంతో SRI CHAITANYA తనదైన మాయాజాలంతో ప్రజలను బురిడీ కొట్టించేందుకు సిద్ధం అయ్యింది. దీని కోసం మభ్యపెట్టే మార్గాన్ని ఎంచుకుంది. అసలు వివరాల్లోకి వెళితే ఎన్‌టీఏ రూల్స్‌ ప్రకారం 3 సబ్జెక్లుల్లో (మ్యాథ్స్‌, ఫిజిక్స్‌, కెమిస్ట్రీ) 100 మార్కుల చొప్పున 300 మార్కులు సాధించిన విద్యార్థులకు 100 (PERCENTILE) పర్సంటైల్‌కి అర్హత సాధిస్తారు. ఈసారి దేశవ్యాప్తంగా 14 మంది విద్యార్థులు మాత్రమే 100 పర్సంటైల్‌ సాధించారు. 100 పర్సంటైల్‌ సాధించిన విద్యార్థులు శ్రీచైతన్య నుండి ఒక్కరంటే ఒక్కరూ లేకపోవటంతో SRI CHAITANYA ఖంగుతింది. ఈసారికి విద్యార్థిలోకాన్ని మభ్యపెట్టేందుకు సిద్ధం అయ్యింది. ఒక్కో సబ్జెక్టులో విడివిడిగా 100 మార్కులు సాధించిన వారు 42 మంది, రెండు సబ్జెక్టుల్లో విడివిడిగా 100 మార్కులు సాధించిన వారు 8 మంది ఉండటంతో, ఆ 8 మంది విద్యార్థులతో 100 పర్సంటైల్‌ పేరుతో మభ్యపెట్టే ప్రకటనలను జనాల్లోకి వదిలింది. ఇంకా శ్రీచైతన్య దౌర్భాగ్యం ఏమిటంటే ఈ ఎనిమిది (8) మందిలోనూ 5 గురు మాత్రమే SRI CHAITANYA క్లాస్‌రూమ్‌ ప్రోగ్రామ్‌లో చదివిన వారు మాత్రమే. మిగిలిన (3 ) ముగ్గురు విద్యార్థులు డిస్టెన్స్‌ లెర్నింగ్‌ ప్రోగ్రామ్‌ లేదా ఆలిండియా టెస్ట్‌ సిరీస్‌ పేరుతో వేరే కాలేజీలో చదువుతూ, శ్రీచైతన్య ఆన్‌లైన్‌లో రిజిస్టర్‌ అయిన వారి వివరాలను ప్రకటించి ప్రజలను తప్పుదోవ పట్టిస్తోంది.

తప్పుడు ప్రకటనలు ఇస్తున్న సంస్థలపై చర్యలేవి ?

కోచింగ్‌ రంగంలో పారదర్శకతకు పెద్దపీట వేసి విద్యార్థుల ప్రయోజనాలను రక్షించడానికి కేంద్ర ప్రభుత్వం ఎప్పడో చర్యలు చేపట్టింది. విద్య, ఉద్యోగార్థులను తప్పుదోవ పట్టిస్తూ జారీచేసే ప్రకటనల నియంత్రణకు కేంద్ర వినియోగదారుల వ్యవహారాల శాఖ మార్గదర్శకాలు స్పష్టంగా జారీచేసింది. అయినా సరే నిబంధనలు తుంగలో తొక్కి, ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తోంది శ్రీచైతన్య. సోషల్‌ మీడియా, టీవీ ప్రకటనల్లో బరితెగించి అసత్య ప్రకటనలతో ప్రజలను మభ్యపెడుతోంది. అనుచిత వ్యాపార విధానాలు అనుసరించకూడదు. తప్పుదోవపట్టించే ఎలాంటి ప్రకటనలనూ ఇవ్వకూడదు అని స్పష్టమైన మార్గదర్శకాలు ఉన్నా లెక్కలేని తనాన్ని ప్రదర్శిస్తోంది శ్రీచైతన్య. శ్రీచైతన్య తన ప్రకటనతో ప్రజలను తప్పుదోవ పట్టించింది అనడానికి స్పష్టమైన అధారాలు ఉన్నాయి. కేంద్ర వినియోగదారుల వ్యవహారాల శాఖ ఎలాంటి చర్యలు తీసుకుంటుందో చూడాలి.

Post a Comment

0 Comments

Popular Posts

Resonance Schools : J.D.లక్ష్మీనారాయణ రెజొనెన్స్‌కి ప్రచారకర్తగా మారారా ?
Resonance Schools : టీచర్లు లేకుండా బోధన ఎలా ?
Kadapa Sri Chaitanya : శ్రీచైతన్య హాస్టల్స్‌లో ఆగని మరణమృదంగం !
Physics Wallah : 'సరసమైన ధరకే చదువు' ఫిజిక్స్‌ వాలా IPOని గట్టెక్కిస్తుందా ?
Sri Chaitanya Fake Olympiads : ఆగని శ్రీచైతన్య ఫేక్‌ ఒలింపియాడ్స్‌ దందా !
Sri Chaitanya Score Scholarship : శ్రీచైతన్య రూ.350 కోట్లు మాయాజాలం !
sri chaitanya : తవ్వేకొద్ది బయటపడుతున్న శ్రీచైతన్య షెల్‌ కంపెనీల అక్రమాలు !
Resonance Schools : పర్మిషన్లు లేకుండా అడ్మిషన్లు ఎలా ?
Sri Chaitanya Sisters : శ్రీచైతన్య షెల్‌ కంపెనీల గుట్టు రట్టు !
Sri Chaitanya Prodigy : తల్లిదండ్రులపై మోయలేని పెనుభారం !