Ticker

6/recent/ticker-posts

Sri Chaitanya Score 2024 : శ్రీచైతన్య ఆటలు సాగటం లేదు !

  • శ్రీచైతన్య స్కోర్‌...ఈసారి ఉత్తిత్తి స్కాలర్‌షిప్‌ మాత్రమే !
  • 2022, 2023 ఏళ్ళలో రూ.1000 కోట్ల స్కాలర్‌షిప్‌ అంటూ అర్భాటం !
  • రూ.1000 కోట్ల స్కాలర్‌షిప్‌ పొందిన విద్యార్థుల జాబితాను కోరిన ‘ప్రజాస్వామ్యం’
  • నీళ్ళు నమిలిన శ్రీచైతన్య యాజమాన్యం !
  • 1000 కోట్ల స్కాలర్‌షిప్‌పై వెనక్కి తగ్గిన శ్రీచైతన్య
  • 2024 లో రూ. 1000 కోట్లు మాయం, బహుమతులు, మెమెంటోలతో సరి !
  • గత సంవత్సరమే మోసం బట్టబయలు చేయటంతో పలాయనవాదం !
  • ఐఎన్‌టీఎస్‌ఓ, క్యాట్‌ వంటి ఫేక్‌ ఒలింపియాడ్స్‌ నిర్వహణపై వెనకడుగు !
  • ఫలించిన ప్రజాస్వామ్యం పత్రిక పోరాటం !

స్కాలర్‌షిప్‌ వస్తే అమ్మాయి/ అబ్బాయి ఫ్రీగా చదువుకుంటాడు అనుకుని భావించే తల్లిదండ్రులకు ఎప్పుడూ నిరాశే మిగులుతుంది. ఎందుకంటే  శ్రీచైతన్య నిర్వహించిన రూ. 1000/` కోట్ల స్కాలర్‌షిప్‌లో విజేతలుగా నిలిచిన అభ్యర్థుల వివరాలు ఎప్పుడూ ప్రకటించలేదు. కేవలం బహుమతులు, మెమెంటోలు మాత్రమే అందించి చేతులు దులుపుకుంటోంది శ్రీచైతన్య. ఈ స్కాలర్‌షిప్‌ ఎగ్జామ్‌ కూడా శ్రీచైతన్యలో చదివే విద్యార్థులకు వర్తించదు. వేరే ఇతర స్కూల్స్‌లో చదివే విద్యార్థులకు మాత్రమే నిర్వహిస్తోంది. ఈ స్కాలర్‌షిప్‌ కూడా ఇతర స్కూల్స్‌ నుండి వచ్చి శ్రీచైతన్యలోనే చేరితేనే స్కాలర్‌షిప్‌ వర్తిస్తుంది అని షరతులు విధిస్తుంది. అంటే దేశవ్యాప్తంగా శ్రీచైతన్యలో కాకుండా ఇతర స్కూల్స్‌లో చదివే ప్రతిభావంతులైన విద్యార్థులకు వెతికి పట్టుకుని వారిని శ్రీచైతన్యలోకి తీసుకరావటమే శ్రీచైతన్య స్కోర్‌ ఎగ్జామ్‌ వెనుక ఉన్న అసలు ఉద్దేశ్యం.

1000 కోట్లపై వెనక్కి తగ్గిన శ్రీచైతన్య !

1000 కోట్లు రూపాయలు స్కాలర్‌షిప్‌ అనేది ఓ గాలిబుడగ అనే విషయం ప్రజల్లోకి తీసుకెళ్ళింది ప్రజాస్వామ్యం ఆన్‌లైన్‌ పత్రిక.  2022, 2023 సంవత్సరాలలో శ్రీచైతన్య స్కోర్‌ స్కాలర్‌షిప్‌ రూ. 1000/` అని ఆర్భాటంగా ప్రకటించిన శ్రీచైతన్య...2024 సంవత్సరానికి వచ్చే సరికి పూర్తిగా చేతులెత్తేసింది. అక్టోబర్‌ 6, 2024 నిర్వహించనున్న శ్రీచైతన్య స్కోర్‌ స్కాలర్‌షిప్‌ ఎగ్జామ్‌కు ఈ సారి డబ్బులు లేకుండా  కేవలం వివిధ తరగతుల్లో 10 స్థానాలు సాధించిన వారికి నగడు బహుమతులు , మెమెంటోలు ఇవ్వనుంది. ఎందుకు ఈసారి శ్రీచైతన్యకు ఏమైంది ? అని అందరి నోళ్ళలో నానుతోంది. సడెన్‌గా ఈ నిర్ణయానికి కారణం ఏంటని ఆరాలు తీస్తున్నారు. దానిపై వివరణ ఇచ్చే ప్రయత్నం చేస్తోంది ప్రజాస్వామ్యం ఆన్‌లైన్‌ దినపత్రిక. గతంలో నిర్వహించిన స్కాలర్‌షిప్‌ ఎగ్జామకి సంబంధించి స్కాలర్‌షిప్‌ వివరాలు బహిర్గతం చేయకపోవటం, శ్రీచైతన్యలో చేరిన వారికే స్కాలర్‌షిప్‌ అని ప్రకటించటం, ఎగ్జామ్‌ ఫీజు పేరుతో ఆదాయాన్ని సమకూర్చుకోవటం వంటి అంశాలను వెలుగులోకి తీసుకరావటంతో పాటు శ్రీచైతన్య యాజమాన్యం ఆధ్వర్యంలోని ర్యాంక్‌గురు టెక్నాలజీస్‌ ప్రై.లి. కంపెనీకి ఈ నిర్వహణ బాధ్యత అప్పగించటం,  స్కోర్‌ స్కాలర్‌షిప్‌ని ఉపయోగించుకుని కోట్లాది రూపాయలు సొసైటీ/ ట్రస్ట్‌ ల నుండి ప్రై.లి. కంపెనీలోకి మళ్ళించుకుంటోంది. ఈ విషయాలను ప్రజల్లోకి తీసుకెళ్ళి అవగాహన కల్పించింది. దీంతో అప్రమత్తమైన శ్రీచైతన్య యాజమాన్యం రూ. 1000 కోట్ల భారీ స్కాలర్‌షిప్‌ ప్రకటనపై తోకముడిచింది. ఇప్పటికే ఐఎన్‌టీఎస్‌ఓ, క్యాట్‌ వంటి శ్రీచైతన్య నిర్వహించే ఫేక్‌ ఒలింపియాడ్స్‌తో పాటు నల్లదనం మార్గాలు, దోపిడీ విధానాలను ప్రజల ముందు ఉంచింది. దీంతో చేసేది లేక శ్రీచైతన్య రూ.1000 కోట్ల స్కాలర్‌షిప్‌కు మంగళం పాడిరది. కేవలం బహుమతులు, మెమెంటోలతో సరిపెట్టింది. ఇక ముందు కూడా శ్రీచైతన్య మోసాలను  ప్రజల ముందుకు తీసుకరావడానికి సిద్ధంగా ఉంది ప్రజాస్వామ్యం ఆన్‌లైన్‌ దినపత్రిక.

Post a Comment

0 Comments