Ticker

6/recent/ticker-posts

Hunting Talented Students: ప్రతిభావంతులకు వల ! స్కాలర్‌షిప్‌ పేరుతో ఎర !



  • 100 /- నుండి 250/- రూపాయల వరకు ఫీజు పేరుతో దోపిడీ.
  • బహుమతులు, స్కాలర్‌ఫిస్‌ పేరుతో ఆకర్షణీయ ప్రకటనలు.
  •  అరకొర భహుమతులు, స్కాలర్‌ఫిస్‌లు వట్టిమాటే.
  • ఇతర స్కూల్స్‌/కాలేజీల్లో టాపర్స్‌ను లాగేసుకోవటమే లక్ష్యం.

టాలెంట్‌ హంట్‌...స్కాలర్‌ఫిప్‌ షిప్‌...రివార్డ్‌ ఇలా పేరు ఏదైతేనేం పెట్టేది టాలెంట్‌ టెస్ట్‌లే.  టాలెంట్‌టెక్స్‌...స్కోర్‌...యాంతే...ఎన్‌శాట్‌...దేశంలోని నాలుగు పెద్ద విద్యాసంస్థలు ఇలా ఆకర్షణీమమైన పేర్లతో ప్రతిభావంతులైన విద్యార్థుల కోసం వేట సాగిస్తున్నాయి. ఆయా సంస్థల్లోని విద్యార్థులు కాకుండా ఇతర విద్యాసంస్థల్లోని ప్రతిభావంతులైన విద్యార్థులకు వల వేసేందుకు వివిధ రకాలైన పేర్లతో టాలెంట్‌ టెస్ట్‌లు నిర్వహిస్తున్నాయి. స్కాలర్‌ఫిస్‌, బహుమతులను ఎరగా వేస్తున్నాయి. ఈ వలకు చిక్కారా అంతే. ఆయా విద్యాసంస్థలకు కావల్సింది విద్యార్థులు, వారి తల్లిదండ్రుల డిజైట్స్‌ మాత్రమే. అద్భుతమైన ప్రతిభ చూపి వారు ఇతర విద్యాసంస్థల్లో చదువుతుంటే వారికి ఉచిత విద్యను ఆఫర్‌ చేయటం దగ్గర నుండి ఎంతైనా డబ్బులు చెల్లించేందుకు వెనుకాడటం లేదు. ఎందుకంటే ఆలాంటి టాలెంటెడ్‌ విద్యార్థులు రాబోయే రోజల్లో నీట్‌, జెఈఈ అడ్వాన్స్‌డ్‌ లాంటి ఎగ్జామ్స్‌లో 10 లోపు ర్యాంకు సాధిస్తే సంస్థ తలరాతే మారిపోతుంది. ఒక్క ర్యాంకు సాధిస్తే చాలు వేలాది అడ్మిషన్లు వచ్చేస్తాయి. ఒక్కసారి అలెన్‌, ఆకాష్‌, శ్రీచైతన్య, నారాయణ సంస్థలను గమనించండి 2023లో జెఈఈ మెయిన్‌, జెఈఈ అడ్వాన్స్‌డ్‌, నీట్‌ వంటి ప్రతిష్టాత్మక జాతీయస్థాయి పోటీ పరీక్షల్లో ఆలిండియా ర్యాంకులు సాధించినట్టు చూపారు.. సాధించిన విద్యార్థులు కొందరే. వచ్చిన ర్యాంకులు కొన్నే. కానీ ఆయా సంస్థల్లో  అడ్మిషన్లు లక్షల్లో జరిగాయి అంటే నమ్ముతారా ?. ఎందుకంటే తమ పిల్లాడికి మంచి ర్యాంకు వస్తుందేమోనని ఆశ. అదే ఆశే ప్రైవేటు విద్యాసంస్థలకు వరంగా మారింది. కాసుల వర్షం కురిపిస్తోంది.

స్కాలర్‌ఫిస్‌లు ఇచ్చేది వట్టిమాట !

రూ.1000 కోట్లు అని ఒకరు, రూ. 250 కోట్లు అని మరొకరు ఇలా కోట్లులో స్కాలర్‌ఫిప్‌ ఇవ్వటం అనేది ఉత్తమాట. తమ సంస్థలో అడ్మిషన్‌ తీసుకున్న వారికే మాత్రమే ఇది వర్తిస్తుంది. కావలంటే నిశితంగా గమనించండి రూ. 1000 కోట్ల వద్ద స్టార్‌ మార్క్‌తో షరతులు వర్తిస్తాయి అని ఉంటుంది. ఆ షరతులు అన్నీ ఆయా సంస్థలకు అనుకూలంగా ఉంటాయి. చివరికి మోసపోతున్నది విద్యార్థులే. ఇక్కడ అన్నీ విద్యాసంస్థలది ఒకటే ఉద్ధేశ్యం. ప్రతిభావంతులని గుర్తించటం, వారిని తమ సంస్థల్లో చేర్చుకోటం. ఎలాగూ ప్రతి స్టూడెంట్‌ దగ్గర నుండి 100/` నుండి 250/` వసూలు చేసి వారి సొమ్ముతో చిన్న చిన్న బహుమతులు ఇచ్చి చేతులు దులుపుకోవటం కనిపిస్తుంది. ఇప్పటి వరకు ఏ విద్యాసంస్థ అయినా ఎవరైనా విద్యార్థి కోటి రూపాయల బహుమతి గెలుచుకున్నట్లు ఒక్క విద్యాసంస్థ అయినా ప్రకటించిందా ? లేదు. ఎందుకంటే ప్రతి విద్యాసంస్థ తమ బ్రాండ్‌ని ప్రమోట్‌ చేసుకుంటుంది లేదా లాభం అయినా చూసుకుంటుంది.

ప్రభుత్వాల ఉదాసీనత

టాలెంట్‌టెస్ట్‌లు నిర్వహించరాదని కోర్టుల తీర్పులు ఉన్నా విద్యాసంస్థలకు ఏ మాత్రం పట్టడం లేదు. వ్యవస్థలంటే వారికి లెక్క లేదు. విచిత్రమైన పేర్లతో ఎగ్జామ్స్‌ నిర్వహిస్తున్నాయి. ఏ పేరు పెట్టినా అది టాలెంట్‌టెస్ట్‌లే. విచిత్రమైన పేర్ల మార్పుతో విద్యార్థులను, తల్లిదండ్రులకు ఏమార్చుతున్నారు. ఈ ఎగ్జామ్‌ పేరుతో, ఆ ఎగ్జామ్‌ పేరుతో వందలాది రూపాయలు ఫీజుల రూపంలో కొల్లగొడుతూ తల్లిదండ్రుల జేబులు గుల్ల చేస్తున్నాయి విద్యాసంస్థలు. తల్లిదండ్రులు ఇప్పటికైనా కళ్ళు తెరవకపోతే మున్ముందు ఇంకా కోల్పోయే అవకాశం ఉంది. ఏ ఫీజు ఎందుకు కడుతున్నారో, దాని వలన ఉపయోగం ఎంటో తెలుసుకుని ఫీజులు చేల్లించటం ఉత్తమం. విద్యాసంస్థలన్నీ  ఒక్క ఫీజులతో ఆగిపోవటం లేదు, విద్యార్థుల దగ్గర నుండి సంవత్సరం మొత్తంలో ఎన్నో రకాలుగా డబ్బులు దోపిడీ చేసేందుకు చాలా మార్గాలు ఉన్నాయి. అందులో ఇది ఒకటి మాత్రమే. ఇంకా చాలా మార్గాలు ఉన్నాయి. విద్యాశాఖకు సంబంధించిన అధికారులు ఇప్పటికైనా కళ్ళు తెరిచి తల్లిదండ్రులను రక్షించవలసి ఉంది. లేదంటే కోర్టులైనా సుమోటాగా తీసుకుని విద్యాసంస్థల విపరీత చర్యలను కట్టడి చేయవలసి ఉంది.


Post a Comment

0 Comments

Popular Posts

Sri Chaitanya Fake Olympiads : ఆగని శ్రీచైతన్య ఫేక్‌ ఒలింపియాడ్స్‌ దందా !
Sri Chaitanya Score Scholarship : శ్రీచైతన్య రూ.350 కోట్లు మాయాజాలం !
Physics Wallah : 'సరసమైన ధరకే చదువు' ఫిజిక్స్‌ వాలా IPOని గట్టెక్కిస్తుందా ?
 Ram Charan Talking About Mega Priences : పాప ఖచ్చితంగా నాన్నలానే ఉంటుంది
 School Seized : నివాస భవనంలో శ్రీ చైతన్య స్కూల్‌.. కుత్బుల్లాపూర్‌లో పాఠశాల భవనం సీజ్‌
JADDAR NEW POLITAL PARTY IN TELANGANA : దొరలపాలనకు జరుగుతోంది అందుకే ‘‘గద్దర్‌’’  ప్రజాపార్టీ !
Resonance Schools : పర్మిషన్లు లేకుండా అడ్మిషన్లు ఎలా ?
Kadapa Sri Chaitanya : శ్రీచైతన్య హాస్టల్స్‌లో ఆగని మరణమృదంగం !
Sri Chaitanya : శేరిలింగంపల్లిలో శ్రీ చైతన్య స్కూల్‌ సీజ్‌.. భవన నిర్మాణంలో ఉల్లంఘనలు..!
Scholarships : కార్పొరేట్‌ విద్యాసంస్థల బోగస్‌ స్కాలర్‌షిప్‌ ట్రాప్‌  !!