Ticker

6/recent/ticker-posts

Narayana Hostel Warden Bhavani Suicide Mystery: నారాయణలో మహిళా వార్డెన్‌ మిస్టరీ డెత్‌ !

 

మాదాపూర్‌ అయ్యప్ప సోసైటిలో నారాయణ కళాశాలలో పనిచేస్తున్న అసిస్టెంట్‌ వార్డెన్‌ భవానీ ఆత్మహత్య చేసుకోవడం కలకలం రేపుతోంది. యాదాద్రి జిల్లా మెహర్‌నగర్‌కు చెందిన భవానీ హాస్టల్‌ భవనంలోనే ఫ్యాన్‌కు ఉరివేసుకోని ఆత్మహత్య చేసుకుని చనిపోయింది. అయితే ఉదయం చనిపోతే మధ్యాహ్నం 1:30 వరకు హాస్టల్‌ యాజమాన్యం తల్లిదండ్రులకు ఎటువంటి సమాచారం ఇవ్వకపోవటంతో పలు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. కాలేజీ యాజమాన్యం వేధింపుల వలనే ఆమె సూసైడ్‌ చేసుకుందా అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఆత్మహత్య చేసుకున్న గదిలో ఎలాంటి సూసైడ్‌ లెటర్‌ లేకపోవటం గమనార్హం. డిగ్రీ చదువుతూ వార్డెన్‌గా పనిచేస్తున్న భవానీ ఎందుకు సూసైడ్‌ చేసుకున్నదన్న దానిపై పోలీసులు అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు. అటు సూసైడ్‌ గురించి ఎటువంటి సమాచారం ఇవ్వలేదంటున్నారు బంధువులు ఆరోపిస్తున్నారు. భవానీ సూసైడ్‌ పట్ల అనేక అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు బంధువులు. ఎందుకు ఆత్మహత్య చేసుకుంది? భవానికి ఎలాంటి ఆరోగ్య సమస్యలు లేవని తల్లిదండ్రులు చెబుతున్నారు.. ఎవరిని అడగాలి న్యాయమని ప్రశ్నిస్తున్నారు. నాకెందుకో భయం భయంగా ఉందమ్మా అంటే ఇంటికి రమ్మని చెప్పానని భవానీ తల్లి కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. పర్మిషన్‌ అడిగి రెండు రోజుల్లో వస్తానని భవానీ చెప్పిందని.. ఎవరో ఆశ అనే ఆవిడ బెదిరిస్తుంది అని ఒకసారి తనతో అన్నట్టు గుర్తుచేసుకున్నారు భవానీ తల్లి.. ఆశ అక్క భయపెట్టిందమ్మ అందుకే జ్వరం వచ్చిందని తనతో భవానీ చెప్పినట్టు తెలిపారు. భవానికి సీరియస్‌గా ఉందని.. తనకు పది గంటలకి ఫోన్‌ వచ్చిందని.. తన బిడ్డ ధైర్యవంతురాలని పిరికిది కానే కాదని తల్లిదండ్రులు స్పష్టంగా చెబుతున్నారు. భవానీని చంపారని.. తర్వాత సూసైడ్‌గా చిత్రీకరించారని ఆరోపిస్తున్నారు. నిజానికి గతంలో కూడా నారాయణ క్యాంపస్‌లో ఇలాంటి ఘటనలు జరిగాయి.

సిగ్నల్‌ ఎందుకు ఉండదు?

మార్నింగ్‌ ఈ ఘటన జరిగితే మధ్యాహ్నం 1:30 వరకు ఎందుకు చెప్పలేదు అని చెప్పి హాస్టల్‌ వాళ్ళని అడిగినట్టు కుటుంబసభ్యులు చెబుతున్నారు. సిగ్నల్‌ అందలేదు అని సమాధానం చెబుతున్నారని.. సిగ్నల్‌ ఎందుకు అందదని ప్రశ్నిస్తున్నారు. మేము ఏమైనా నల్లమల్ల అడవుల్లో ఉన్నామా అని నిలదీస్తున్నారు. రోజూ భవానీ నేను ఫోన్‌లో మాట్లాడుకుంటున్నాం కదా అని ఆమె తల్లి క్వశ్చన్‌ చేస్తున్నారు. ఎంతమంది పిల్లల్ని ఇలా పొట్టను పెట్టుకుంటారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వీళ్ళ కోసమా పిల్లలని కనేది అని విలపిస్తున్నారు. ముట్టుకుంటే మాసిపోయేటట్టు ఉంటుందమ్మా నా బిడ్డ అంటూ భవానీ తల్లి ఏడుస్తుంటే అక్కడున్న వారు కన్నీరు కార్చారు. చేతులారా చంపుకున్నట్టుందని.. హాస్టల్‌ వద్దకు వచ్చిన తర్వాత రెండు గంటల వరకు కూడా తమకు ఎలాంటి సమాచారం ఇవ్వలేదని ఆరోపిస్తున్నారు. కాలేజ్‌ వాళ్ళే ఏదైనా చేసి.. ఆత్మహత్యగా క్రియేట్‌ చేసినట్టు ఆరోపిస్తున్నారు. ఇక పొద్దున సూసైడ్‌ చేసుకుంటే మధ్యాహ్నం వరకు కుటుంబ సభ్యులకు ఎందుకు తెలియజేయలేదు. కాలేజీలో ఏమైనా సమస్య వల్ల ఆమె సూసైడ్‌ చేసుకుందా ..అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

Post a Comment

0 Comments

Popular Posts

Sri Chaitanya Sisters : శ్రీచైతన్య షెల్‌ కంపెనీల గుట్టు రట్టు !
Sri Chaitanya : వర్సిటీ మూసివేత ! శ్రీచైతన్య ఉద్యోగుల్లో కలవరం ?
JEE MAIN 2025 ఫలితాల్లో మరో సరికొత్త మోసానికి తెరతీసిన శ్రీచైతన్య !
Scholarships : కార్పొరేట్‌ విద్యాసంస్థల బోగస్‌ స్కాలర్‌షిప్‌ ట్రాప్‌  !!
SRI CHAITANYA NEET 2025 : కూలిపోతున్న డాక్టర్‌ కలలు !
JEE ADVANCED 2025 : IIT ర్యాంకుల పేరుతో తల్లిదండ్రుల్ని బకరాల్ని చేస్తున్న శ్రీచైతన్య !
INFINITY META JR APP పేరుతో అడ్డంగా దండుకుంటున్న శ్రీచైతన్య !
Sri Chaitanya : షెల్‌ కంపెనీల పుట్ట...నల్లధనం గుట్ట ....శ్రీచైతన్య !
 SRI CHAITANYA : షెల్‌ కంపెనీలతో  శ్రీచైతన్య డైరెక్టర్ల అంతులేని అక్రమాలు !
Sri Chaitanya Trust : ఇష్టారాజ్యంగా ఎడ్యుకేషనల్‌ ట్రస్ట్‌లు/ సొసైటీలు !