Ticker

6/recent/ticker-posts

NEET UG 2023 RESULT : నీట్‌ ఫలితాలు విడుదల.. తెలుగు విద్యార్థికి తొలి ర్యాంక్ !

 

దేశవ్యాప్తంగా లక్షలాది మంది విద్యార్థులు ఎంతో ఆత్రుతగా ఎదురుచూస్తోన్న NEET UG-2023 ఫలితాలు విడుదలయ్యాయి. ఈ ఫలితాల్లో ఏపీకి చెందిన విద్యార్థి ఆల్‌ ఇండియా ఫస్ట్‌ ర్యాంకుతో సత్తా చాటాడు. ఆంధ్రప్రదేశ్‌కు చెందిన బోర వరుణ్‌ చక్రవర్తి, తమిళనాడుకు చెందిన ప్రభంజన్‌ ఇద్దరూ 720/720 మార్కులు సాధించి ఆలిండియా ఫస్ట్‌ ర్యాంక్‌ సాధించారు. 720 మార్క్‌లతో ఇరువురికీ సంయుక్తంగా ఫస్ట్‌ ర్యాంక్‌ దక్కింది. ఈడబ్ల్యూఎస్‌ కేటగిరీలో ఏపీ విద్యార్థి వైఎల్‌ ప్రవధాన్‌ రెడ్డి రెండో ర్యాంకు సాధించగా.. ఎస్సీ కేటగిరీలో ఏపీకి చెందిన కె.యశశ్రీకి రెండో ర్యాంకు వచ్చింది. తెలంగాణకు చెందిన కె.జి.రఘురాం రెడ్డి జాతీయ స్థాయిలో 15వ ర్యాంకు సాధించాడు. NEET కు అర్హత సాధించిన వారిలో యూపీ, మహారాష్ట్ర, రాజస్థాన్‌ల నుంచి అత్యధిక సంఖ్యలో అభ్యర్థులు ఉన్నట్టు NTA తెలిపింది. ఈ ఏడాది నీట్‌కు దేశ వ్యాప్తంగా మొత్తం 11,45,976మంది అర్హత సాధించగా.. ఏపీ నుంచి 42,836, తెలంగాణ నుంచి  42,654మంది అభ్యర్థులు ఉన్నారు. 

వైద్య విద్యా కోర్సుల్లో ప్రవేశాల కోసం భారత్‌తో పాటు విదేశాల్లోని పలు నగరాల్లో 4,097 కేంద్రాల్లో మే 7న నిర్వహించిన ఈ పరీక్షకు 20,87,449మంది విద్యార్థులు హాజరయ్యారు. జూన్‌ 4న ప్రిలిమినరీ ఆన్షర్‌ కీని విడుదల చేసిన NTA. దీనిపై జూన్‌ 6వరకు విద్యార్థుల నుంచి అభ్యంతరాలను స్వీకరించిన విషయం తెలిసిందే. వాటిని పరిగణనలోకి తీసుకున్న NTA అధికారులు తాజాగా తుది ఆన్సర్‌ కీతో పాటు ఫలితాలను విడుదల చేశారు.

Post a Comment

0 Comments

Popular Posts

 Genesis Capital : లక్ష పెట్టు...4 లక్షలు పట్టు....మరో ఇన్వెస్ట్‌మెంట్ స్కామ్ !
ANKURA HOSPITALS : మదీనాగూడ బ్రాంచ్‌లో అసలు ఏం జరుగుతోంది ?
My Land Infra : బోర్డు తిప్పేసేందుకు సిద్ధమైన మైల్యాండ్ ఇన్‌ఫ్రా కంపెనీ!
Resonance : రెజొనెన్స్‌ బరితెగింపు !
 My Land Infra : రియల్ ఎస్టేట్ ముసుగులో ‘మై ల్యాండ్ ఇన్‌ఫ్రా’ మహా మోసం
Opposition Parties meeting in Bihar :  విపక్ష నేతల ఐక్యతా రాగం...ప్రధాని అభ్యర్థి ఎవరు ?
Fake Ayurvedic Doctor : పట్టీల నాగరాజు కాదు...దోపిడీ కాట్‌రాజ్ !
Ankura Hospitals : AS Rao Nagar LLP ఆర్ధిక లావాదేవీలపై సంచలన కథనం!
Sri Chaitanya : తల్లిదండ్రుల్ని దోచేస్తున్న ఒలింపియాడ్స్‌ మాఫియా
GUNTUR : భారీ ఇన్వెస్ట్‌మెంట్ కుంభకోణం: రూ. 20 కోట్లతో బోర్డు తిప్పేసిన ‘అవని’ ముఠా!