Ticker

6/recent/ticker-posts

corporate colleges gimmicks in neet results : ఓపెన్‌ కేటగిరీ ర్యాంకులే అసలైన ర్యాంకులు !

 




  • విద్యాసంస్థల మోసపూరిత ప్రకటనల పట్ల తస్మాత్‌ జాగ్రత్త !
  • అన్నీ ఒకే బ్రాంచ్‌ నుండి సాధించన ర్యాంకులు కావు.

నీట్‌ 2023 ర్యాంకులు వెలవడ్డాయి. ఇక మోసపూరిత ర్యాంకులతో తల్లిదండ్రులను మభ్యపెట్టడం కార్పొరేట్‌ సంస్థలకు అలవాటుగా మారింది. నేషనల్‌ టెస్టింగ్‌ ఏజెన్సీ (ఎన్‌టీఏ) విడుదల చేసిన ఓపెన్‌ కేటగిరీ లేదా జనరల్‌ కేటగిరీ ర్యాంకులే అసలైన ర్యాంకులుగా పరిగణనలోకి తీసుకోవల్సి ఉంటుంది. కానీ చాలా వరకు కార్పొరేట్‌ సంస్థలు ఆల్‌ కేటగిరీ ర్యాంకులను ప్రకటిస్తూ ఓపెన్‌ కేటగిరీ ర్యాంకులుగా మభ్యపెడుతున్నాయి. ఉత్తరాది (నార్త్‌) రాష్ట్రాల్లో ఇలాంటి జిమ్మిక్కులు నడవవు. మన తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన సంస్థలు నార్త్‌లో హవా కొనసాగిస్తున్నా అక్కడ ప్రకటించేది కేవలం ఓపెన్‌ కేటగిరీ ర్యాంకులే. నీట్‌ కౌన్సిలింగ్‌ సమయంలో ఎలాంటి రిజర్వేషన్‌ లేని వారికి ఓపెన్‌ కేటగిరీ ర్యాంకులు, రిజర్వేషన్‌ కేటగిరీ ఉన్న వారికీ రిజర్వేషన్‌ కేటగిరీనీ పరిగణనలోకి తీసుకుంటారు. ఇంకా క్లియర్‌గా చెప్పాలంటే ఈ ర్యాంకులన్నీ ఒకే బ్రాంచీ నుండి సాధఙంచినట్టు చెప్పటం అసలైన గమనించదగ్గ విషయం. ఈ ర్యాంకులన్నీ దేవ:లోని వందలాది బ్రాంచీలలో 10 నుండి 15 బ్రాంచీల నుండి సాధించిన ర్యాంకులు మాత్రమే. అంటే మిగతా వాటిల్లో లక్షల్లో ర్యాంకు సాధించిన వారే. ఓపెన్‌ కేటగిరీలో 10 లోపు, 100 లోపు ర్యాంకులు ప్రకటించే ఈ కార్పొరేట్‌ సంస్థలు ఆయా సంస్థల్లో ఎంత మంది విద్యార్థులు నీట్‌ పరీక్ష వ్రాశారో లెక్కలు చెప్పగలరా ?  ఎంత మంది విజేతలుగా నిలిచారో గుట్టు విప్పగలరా ? చెప్పలేవు. ఒకటి, రెండు ర్యాంకులు చూసి కార్పొరేట్‌ సంస్థల వెంట పరుగులు పెట్టే తల్లిదండ్రులు ఉన్నంత కాలం ఆయా సంస్థలు మోసం చేస్తూనే ఉంటాయి. సో...బికేర్‌ ఫుల్‌ పేరేంట్స్‌.

Post a Comment

0 Comments

Popular Posts

 Genesis Capital : లక్ష పెట్టు...4 లక్షలు పట్టు....మరో ఇన్వెస్ట్‌మెంట్ స్కామ్ !
ANKURA HOSPITALS : మదీనాగూడ బ్రాంచ్‌లో అసలు ఏం జరుగుతోంది ?
My Land Infra : బోర్డు తిప్పేసేందుకు సిద్ధమైన మైల్యాండ్ ఇన్‌ఫ్రా కంపెనీ!
Resonance : రెజొనెన్స్‌ బరితెగింపు !
 My Land Infra : రియల్ ఎస్టేట్ ముసుగులో ‘మై ల్యాండ్ ఇన్‌ఫ్రా’ మహా మోసం
Opposition Parties meeting in Bihar :  విపక్ష నేతల ఐక్యతా రాగం...ప్రధాని అభ్యర్థి ఎవరు ?
Fake Ayurvedic Doctor : పట్టీల నాగరాజు కాదు...దోపిడీ కాట్‌రాజ్ !
Ankura Hospitals : AS Rao Nagar LLP ఆర్ధిక లావాదేవీలపై సంచలన కథనం!
Sri Chaitanya : తల్లిదండ్రుల్ని దోచేస్తున్న ఒలింపియాడ్స్‌ మాఫియా
GUNTUR : భారీ ఇన్వెస్ట్‌మెంట్ కుంభకోణం: రూ. 20 కోట్లతో బోర్డు తిప్పేసిన ‘అవని’ ముఠా!