Ticker

6/recent/ticker-posts

inter student commits suicide : బాచుపల్లి నారాయణ కాలేజీ విద్యార్థిని ఆత్మహత్య !

 

బాచుపల్లి నారాయణ కాలేజీలో విషాదం చోటుచేసుకుంది. బాలికల క్యాంపస్‌ హాస్టల్‌లో విద్యార్థిని ఆత్మహత్యకు పాల్పడిరది. వంశిక అనే విద్యార్థిని హాస్టల్‌ భవనం 5వ అంతస్తు నుంచి దూకి విద్యార్థిని మృతి చెందింది. కామారెడ్డి జిల్లాకు చెందిన ఇంటర్‌ ఫస్ట్‌ ఇయర్‌ చదువుతున్న ఆర్‌.వంశిక (16) వారం రోజుల క్రితమే క్యాంపస్‌లో చేరినట్లు తెలిసింది. మంగళవారం ఉదయం ఆమె భవనంపై నుంచి కింద పడి రక్తపు మడుగులో పడి ఉండడాన్ని గమనించిన సహ విద్యార్థులు కళాశాల నిర్వాహకులకు సమాచారం అందించారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు వివరాలు సేకరించారు. విద్యార్థిని తల్లిదండ్రులకు సమాచారం అందించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. సమాచారం అందుకున్న పోలీసులు హాస్టల్‌ వద్దకు చేరుకున్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం తరలించారు. వంశిక ఆత్మహత్య చేసుకుందా?. ప్రమాదవశాత్తు కింద పడి చనిపోయిందా? అన్నది స్పష్టత లేదు. అనుమానాస్పద మరణంగా కేసు నమోదు చేసిన పోలీసులు.. మృతికి గల కారణలపై దర్యాప్తు చేస్తున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Post a Comment

0 Comments

Popular Posts