Ticker

6/recent/ticker-posts

Next CM : తెలంగాణ తదుపరి ముఖ్యమంత్రిగా రేవంత్‌ రెడ్డి ?

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్‌ పార్టీ స్పష్టమైన ఆధిక్యం కనబర్చింది. దీంతో 64 స్థానాల్లో గెలిచి ప్రభుత్వ ఏర్పాటుకు సిద్ధమైంది. ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రిగా రేవంత్‌రెడ్డి సోమవారం ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. ఈమేరకు ప్రమాణ స్వీకారోత్సవానికి బందోబస్తు ఏర్పాట్లు చేయాలని ఇంటెలిజెన్స్‌ అదనపు డీజీ నుంచి ముగ్గురు కమిషనర్లకు ఆదేశాలు జారీ అయ్యాయి. ప్రమాణ స్వీకార కార్యక్రమానికి కాంగ్రెస్‌ ముఖ్యనేతలైన సోనియాగాంధీ, రాహుల్‌ గాంధీ, ప్రియాంక గాంధీ వాద్రా మరియు ఇతర పార్టీ ప్రముఖులు హాజరయ్యే అవకాశముంది. కాంగ్రెస్‌ పార్టీ సోమవారం ఉదయం సీఎల్పీ నేతను ఎన్నుకోనుంది. ఇందుకోసం హైదరాబాద్‌ గచ్చిబౌలిలోని ఎల్లా హోటల్లో సమావేశం ఏర్పాటు చేశారు. ఇప్పటికే సీఎల్పీ సమావేశం జరిగినా అది నామమాత్రంగా జరగనుంది. కాంగ్రెస్‌ హైకమాండ్‌ సిఎం అభ్యర్థిగా రేవంత్‌రెడ్డిని ఖరారు చేసింది. తెలంగాణ వ్యాప్తంగా గెలిచిన కాంగ్రెస్‌ అభ్యర్థులు ఒక్కొక్కరిగా ఎల్లా హోటల్‌కు చేరుకుంటున్నారు. ఏఐసీసీ పరిశీలకుల ఆధ్వర్యంలో సీఎల్పీ నేత ఎంపిక ప్రక్రియ జరగనుంది.

Post a Comment

0 Comments

Popular Posts

VIZAG :  రియల్ ఎస్టేట్ ముసుగులో మల్టీ లెవల్ మార్కెటింగ్: SSC DEVELOPERS అసలు రంగు చూస్తే షాక్ అవ్వాల్సిందే !
VIZAG : డబుల్ రిజిస్ట్రేషన్ల కిలాడీ..బుడారి లక్ష్మణరావు
 Genesis Capital : లక్ష పెట్టు...4 లక్షలు పట్టు....మరో ఇన్వెస్ట్‌మెంట్ స్కామ్ !
GUNTUR : భారీ ఇన్వెస్ట్‌మెంట్ కుంభకోణం: రూ. 20 కోట్లతో బోర్డు తిప్పేసిన ‘అవని’ ముఠా!
Ankura Hospitals : AS Rao Nagar LLP ఆర్ధిక లావాదేవీలపై సంచలన కథనం!
AVIGNA LABORATORIES : ఈ లెక్కల్లో పెద్ద లోసుగుంది ? భారీ పన్ను ఉల్లంఘనలు?
NEET 2024 ఫలితాలు ప్రకటించేసుకున్న శ్రీచైతన్య ! NTA ని అవమానిస్తున్న శ్రీచైతన్య !
Sri Chaitanya : తల్లిదండ్రుల్ని దోచేస్తున్న ఒలింపియాడ్స్‌ మాఫియా