Ticker

6/recent/ticker-posts

NBK 108 Title : గిప్పడి సంది ఖేల్‌ అలగ్‌...బాలయ్య టైటిల్‌ అదిరిపోయిందిగా !


నందమూరి బాలకృష్ణ ( Nandamuri Balakrishna) కథానాయకుడిగా అనిల్‌ రావిపూడి ( Anil Ravipudi) దర్శకత్వంలో ఓ చిత్రం తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. బాలయ్య 108వ చిత్రంగా షైన్‌ స్క్రీన్‌ పతాకంపై రూపొందుతున్న ఈ చిత్రానికి ‘భగవంత్‌ కేసరి’ (Bhagavath Kesari) టైటిల్‌ ఖరారు చేశారు. ఇంతకుముందెప్పుడూ చూడని సరికొత్త పాత్రలో బాలకృష్ణ కనిపించనున్నారు. అంతేకాదు, అనిల్‌ రావిపూడి శైలి ఎంటర్‌టైన్‌మెంట్‌ ఏమాత్రం మిస్‌కాకుండా సినిమాను తీర్చిదిద్దినట్లు సమాచారం. ఈ నెల 10న బాలకృష్ణ పుట్టినరోజును పురస్కరించుకుని గురువారం చిత్ర బృందం టైటిల్‌ను ప్రకటించింది. పోస్టర్‌ చూస్తుంటే బాలయ్య ఇంతకుముందు ఎప్పుడూ కనిపించని రీతిలో కనిపిస్తున్నారు. కొత్త హెయిర్‌ స్టైల్‌, చేతిలో కొత్త ఆయుధంతో బరిలో దిగారు బాలయ్య. ఇప్పటికే ఆయన లుక్‌ను రివీల్‌ చేశారు. కానీ ఆయన చేతిలో ఉన్న ఆయుధం కొత్తగా ఆకర్షిస్తోంది.

‘గిప్పడి సంది ఖేల్‌ అలగ్‌’ అంటూ దర్శకుడు అనిల్‌ రావిపూడి ట్వీట్‌ చేశారు. ‘అన్న దిగిండు.. ఇగ మాస్‌ ఊచకోత షురూ’ షైన్‌స్క్రీన్‌ సంస్థ ట్విట్టర్‌లో పేర్కొంది. ప్రస్తుతం ఈ లుక్‌ సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతోంది. బాలకృష్ణ సరసన కాజల్‌ (Kajal) కథానాయికగా నటిస్తోంది. శ్రీలీల (Srileela) కీలక పాత్రలో కనిపించనుంది. షైన్‌ స్క్రీన్‌ పతాకంపై సాహు గారపాటి, హరీశ్‌ పెద్ది ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. దసరా కానుగా ఈ చిత్రం విడుదల కానుంది.

Post a Comment

0 Comments

Popular Posts

sri chaitanya : తవ్వేకొద్ది బయటపడుతున్న శ్రీచైతన్య షెల్‌ కంపెనీల అక్రమాలు !
Sri chaitanya : శ్రీచైతన్య స్కూల్‌ సీజ్‌ !
Sri Chaitanya Trust : ఇష్టారాజ్యంగా ఎడ్యుకేషనల్‌ ట్రస్ట్‌లు/ సొసైటీలు !
Scholarships : కార్పొరేట్‌ విద్యాసంస్థల కుతంత్రం ! బోగస్‌ స్కాలర్‌షిప్‌లతో విద్యార్థులపై దండయాత్ర !!
SRI CHAITANYA NEET 2025 : కూలిపోతున్న డాక్టర్‌ కలలు !
JEE ADVANCED 2025 : IIT ర్యాంకుల పేరుతో తల్లిదండ్రుల్ని బకరాల్ని చేస్తున్న శ్రీచైతన్య !
SriChaitanya School : సుచిత్రలో శ్రీచైతన్య బరితెగింపు !!
Sri Chaitanya Sisters : శ్రీచైతన్య షెల్‌ కంపెనీల గుట్టు రట్టు !
Suicides in Sri chaityana Hostels: కార్పొరేట్‌ హాస్టల్స్‌లో ఘోషిస్తున్న ఆత్మలు !
INFINITY META JR APP పేరుతో అడ్డంగా దండుకుంటున్న శ్రీచైతన్య !