Ticker

6/recent/ticker-posts

varuntej and lavanya tripathi engagement : మెగా ఫ్యామిలీలో పెళ్ళి సందడి...వరుణ్‌తేజ్‌, లావణ్యల నిశ్చితార్థం !


మెగా ఇంట పెళ్లి బాజాలు మోగనున్నాయి. మెగా ప్రిన్స్‌ వరుణ్‌ తేజ్‌ త్వరలోనే పెళ్లి పీటలెక్కబోతున్నారు. నాగబాబు తనయుడు వరుణ్‌ తేజ్‌, హీరోయిన్‌ లావణ్య త్రిపాఠి నిశ్చితార్థం జూన్‌ 9న హైదరాబాద్‌లో జరగనుంది. ఈ విషయాన్ని వరుణ్‌ తేజ్‌ ప్రతినిధి ట్వీట్‌ చేశారు. ఈ నిశ్చితార్థ వేడుకకు కుటుంబ సభ్యులు, కొంత మంది సినీ ప్రముఖులను మాత్రమే ఆహ్వానించినట్లు సమాచారం. ఈ ఏడాది చివర్లో వీరి పెళ్లి జరగనున్నట్లు తెలుస్తోంది. దీనికి సంబంధించి ‘రెండు హృదయాలు.. ఒకటే ప్రేమ’ అంటూ ఓ ఇన్విటేషన్‌ కార్డ్‌ నెట్టింట వైరల్‌ అవుతుంది. ఇక వరుణ్‌తేజ్‌, లావణ్య త్రిపాఠి కలిసి ‘మిస్టర్‌’, ‘అంతరిక్షం’ చిత్రాల్లో నటించారు. ఈ సినిమా షూటింగ్‌ సమయంలోనే వీరిద్దరి మధ్య ప్రేమ చిగురించింది. అప్పటి నుంచి వీరు ప్రేమలో ఉన్నారన్న వార్తలు ఫిల్మ్‌ నగర్‌లో వైరలయ్యాయి. ఇక ఇప్పుడు ఈ ప్రేమ జంట పెళ్లి బంధంతో ఒక్కటి కాబోతున్నారు. ప్రస్తుతం వీళ్లిద్దరికీ నెటిజన్లు శుభాకాంక్షలు చెబుతున్నారు. ప్రస్తుతం వరుణ్‌ తేజ్‌ ‘గాండీవధారి అర్జున’ చిత్రంలో నటిస్తున్నారు. 

Post a Comment

0 Comments

Popular Posts

VIZAG :  రియల్ ఎస్టేట్ ముసుగులో మల్టీ లెవల్ మార్కెటింగ్: SSC DEVELOPERS అసలు రంగు చూస్తే షాక్ అవ్వాల్సిందే !
VIZAG : డబుల్ రిజిస్ట్రేషన్ల కిలాడీ..బుడారి లక్ష్మణరావు
 Genesis Capital : లక్ష పెట్టు...4 లక్షలు పట్టు....మరో ఇన్వెస్ట్‌మెంట్ స్కామ్ !
GUNTUR : భారీ ఇన్వెస్ట్‌మెంట్ కుంభకోణం: రూ. 20 కోట్లతో బోర్డు తిప్పేసిన ‘అవని’ ముఠా!
Ankura Hospitals : AS Rao Nagar LLP ఆర్ధిక లావాదేవీలపై సంచలన కథనం!
AVIGNA LABORATORIES : ఈ లెక్కల్లో పెద్ద లోసుగుంది ? భారీ పన్ను ఉల్లంఘనలు?
NEET 2024 ఫలితాలు ప్రకటించేసుకున్న శ్రీచైతన్య ! NTA ని అవమానిస్తున్న శ్రీచైతన్య !
Sri Chaitanya : తల్లిదండ్రుల్ని దోచేస్తున్న ఒలింపియాడ్స్‌ మాఫియా