Ticker

6/recent/ticker-posts

SCORE EDGE 2024 : శ్రీచైతన్య బోగస్‌ స్కాలర్‌షిప్‌...మూడో‘సారీ’ బురిడీ !

  • SCORE EDGE స్కాలర్‌షిప్‌ ఫలితాలు కేవలం ఆన్‌లైన్‌కే పరిమితం.
  • బహిరంగ పరిచేందుకు శ్రీచైతన్య విముఖం.
  • 2022, 2023, 2024 ఏళ్ళలో రూ. 1000 కోట్ల స్కాలర్‌షిప్‌ పొందిన విద్యార్థుల జాబితా ఎక్కడ ?
  • బోగస్‌ స్కాలర్‌షిప్‌ పేరుతో బి.ఎస్‌.రావుకి ఘోర అవమానం !?
  • ఒక్కో విద్యార్థి నుండి 150/- ఎగ్జామ్‌ ఫీజు
  • ఈసారి ఎగ్జామ్‌ ఫీజులతో రూ.10 కోట్లు వెనకేసుకున్న శ్రీచైతన్య.
  • 25 లక్షలలోపు నగదు బహుమతులు, మెమెంటోలతోనే మమ.

శ్రీచైతన్య ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్వహించిన SCORE EDGE 2024 స్కాలర్‌షిప్‌ టెస్ట్‌ ఫలితాలు వెలువడ్డాయి. కానీ స్కాలర్‌షిప్‌ సాధించిన విద్యార్థుల వివరాలను మాత్రం బహిరంగపరచలేదు. దీంతో పరీక్ష వ్రాసిన 7 లక్షల మంది విద్యార్థులకు నిరాశే మిగిలింది. అక్టోబర్‌ 6 నుండి 27 వరకు దాదాపు 15 రోజుల పాటు ONLINE మరియు OFFLINE ( శ్రీచైతన్య స్కూల్స్‌/ కాలేజ్‌ ) లలో నిర్వహించిన SCORE EDGE 2024 స్కాలర్‌షిప్‌కు ఎంతమంది విద్యార్థులు అర్హత సాధించారో శ్రీచైతన్య వెల్లడిరచలేదు. దేశవ్యాప్తంగా ఏ సంస్థ పరీక్ష నిర్వహించినా ఫలితాలలను బహిరంగంగా ప్రకటించటం సంప్రదాయం కానీ శ్రీచైతన్య దేశవ్యాప్తంగా రూ. 1000 CRORES  విలువైన స్కాలర్‌షిప్‌ నిర్వహించింది, కానీ అర్హత సాధించిన విద్యార్థుల వివరాలను ఆన్‌లైన్‌లో మాత్రమే ఉంచింది. ఆయా అభ్యర్థులు మాత్రమే చూసుకునేలా గోప్యత పాటిస్తోంది. బాధ్యత గల విద్యాసంస్థగా ఫలితాలను బహిరంగంగా ను మరియు మీడియాకు వెల్లడి చేయాల్సి ఉంది. కానీ ఎందుకు వెల్లడిరచటం లేదు అన్నది పలు సందేహాలకు తావిస్తోంది.

స్కాలర్‌షిప్‌ పొందిన విద్యార్థుల జాబితా ఎక్కడ ?

స్కాలర్‌షిప్‌ వస్తే అమ్మాయి/ అబ్బాయి ఫ్రీగా చదువుకుంటారు, ఆర్థిక భారం తగ్గుతుంది అని భావించే తల్లిదండ్రులకు మరోసారి నిరాశే మిగిలింది. ఎందుకంటే శ్రీచైతన్య నిర్వహించిన రూ. 1000/- కోట్ల స్కాలర్‌షిప్‌లో విజేతలుగా నిలిచిన అభ్యర్థుల వివరాలు ప్రకటించలేదు. ఈ స్కాలర్‌షిప్‌ ఎగ్జామ్‌ కూడా శ్రీచైతన్యలో చదివే విద్యార్థులకు వర్తించదు. వేరే ఇతర స్కూల్స్‌లో చదివే విద్యార్థులకు మాత్రమే వర్తించేలా షరతులు విధించింది. ఈ స్కాలర్‌షిప్‌ కూడా ఇతర స్కూల్స్‌ నుండి వచ్చి శ్రీచైతన్యలోనే చేరితేనే స్కాలర్‌షిప్‌ వర్తిస్తుంది అని నిబంధనలు పెట్టింది. అంటే దేశవ్యాప్తంగా శ్రీచైతన్యలో కాకుండా ఇతర స్కూల్స్‌లో చదివే ప్రతిభావంతులైన విద్యార్థులకు వెతికి పట్టుకుని వారిని శ్రీచైతన్యలోకి తీసుకరావటమే KNOWLEDGE HUB SCORE EDGE 2024 ఎగ్జామ్‌ వెనుక ఉన్న అసలు ఉద్దేశ్యం. రూ.1000 కోట్ల స్కాలర్‌షిప్‌ అనేది బూటకం మాత్రమే. ప్రతి తరగతిలో అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు  కేవలం బహుమతులు, మెమెంటోలు మాత్రమే అందిస్తోంది శ్రీచైతన్య.  ప్రతి తరగతిలో మొదటి 50 లోపు ర్యాంకులు సాధించిన వారికి వివిధ స్థాయిల్లో నగదు బహుమతులు మాత్రమే ప్రకటించి చేతులు దులుపుకుంది శ్రీచైతన్య నాలెడ్జ్‌ హబ్‌.  ఈ నగదు బహుమతుల విలువ 25 లక్షలు లోపే ఉండటం గమనార్హం. శ్రీచైతన్య ప్రతినిధులను ఫోన్‌లైన్‌లో సంప్రదించగా, ఫలితాలు ఆన్‌లైన్‌లో మాత్రమే అందుబాటు ఉంటాయి, ఆప్‌లైన్‌లో వ్రాసిన వారి వివరాలు ఆయా బ్రాంచీలలో మాత్రమే అందుబాటులో ఉంటాయని తెలియజేయటం జరిగింది. మొత్తం ఫలితాలకు సంబంధించిన సమాచారం మా వద్ద లేదు అని తెలియజేయటం కొసమెరుపు.

లాభసాటి వ్యాపారంగా పరీక్షలు !

విద్యను లాభసాటి వ్యాపారంగా మలుచుకున్న శ్రీచైతన్య ...అవకాశాలు సృష్టించుకుని ఆదాయ మార్గాలను పెంచుకుంటోంది. స్కాలర్‌షిప్‌ పేరుతో ప్రతి విద్యార్థి నుండి రూ. 150/- వసూలు చేసింది. 150/- చిన్న అమౌంటే. కానీ లక్షలాది మంది విద్యార్థుల నుండి లాగేస్తే కోట్లాది రూపాయలు. ఈ సూత్రాన్ని విజయవంతంగా అమలు చేస్తోంది. ఒక్క 2024 లోనే శ్రీచైతన్య అధికారికంగా  7 లక్షల మందికి పైగా విద్యార్థులు పరీక్ష వ్రాసినట్టు వెల్లడిరచింది. అంటే 700000 మందికి రూ. 150/- చొప్పున రూ. 10 కోట్లు 50 లక్షలు. 50 లక్షలు ఖర్చు చేసిన 10 కోట్లు శ్రీచైతన్య అకౌంట్‌లోకి వెళ్ళిపోతున్నాయి. ఇదీ శ్రీచైతన్య చేసే మాయాజాలం. ఇదే కాకుండా  INTSO, KAT వంటి ( తన సొంతంగా నిర్వహిస్తున్న పరీక్షలు ) శ్రీచైతన్య నిర్వహించే FAKE OLYMPIADSతో శ్రీ చైతన్య తన విద్యార్థుల నుండి పాటు ఏటేటా కోట్లాది రూపాయలను వెనకేసుకుంటోంది. ఇప్పటికే శ్రీచైతన్య మరియు యాజమాన్యం చేస్తున్న దురాగతాలు, నల్లదనం మార్గాలు, దోపిడీ విధానాలను ప్రజల ముందు ఉంచింది ప్రజాస్వామ్యం ఆన్‌లైన్‌ దినపత్రిక. 


శ్రీచైతన్య విశ్వసనీయతకు బీటలు !

2022 లో, 2023లో మరోసారి ఇప్పుడు 2024లో మోసానికి పరాకాష్టగా నిలుస్తోంది శ్రీచైతన్య. 1000 కోట్ల స్కాలర్‌షిప్‌ పేరుతో తల్లిదండ్రుల ఆకాంక్షలకు, విద్యార్థుల ఆశయాలకు ఎరవేసి గత 3 ఏళ్ళుగా విద్యార్థులను మోసగిస్తూనే ఉంది. కనీసం రూ. 500 కోట్ల స్కాలర్‌షిప్‌ విద్యార్థులకు ఇచ్చినట్లు ఎక్కడా ప్రకటించలేదు. దీంతో శ్రీచైతన్యపై అటు విద్యార్థుల్లో, ఇటు తల్లిదండ్రుల్లో విశ్వసనీయత సన్నగిల్లుతోంది. శ్రీచైతన్య మోసాలు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తుండటంతో తల్లిదండ్రులు కూడా ప్రత్యామ్నాయ మార్గాలను అన్వేషిస్తున్నారు.  అన్నింటినీ మించి శ్రీచైతన్య సంస్థ వ్యవస్థాపకులు డా॥బి.ఎస్‌.రావు విద్యాజ్యోతి స్కాలర్‌షిప్‌ ఫౌండేషన్‌ పేరుతో డా॥బి.యస్‌.రావు పేరుకు తీరని అవమానం చేస్తున్నారు. ఇవ్వని స్కాలర్‌షిప్‌లకు ఆయన పేరు పెట్టడం ఎంత వరకు సమంజసం శ్రీచైతన్య యాజమాన్యం తీరుపై విరుచుకపడుతున్నారు.  బి.ఎస్‌.రావు గారి మీద ప్రేమ ఉంటే శ్రీచైతన్య 1000 కోట్లు స్కాలర్‌షిప్‌ ఎవరెవరికీ ఎంత ఇస్తుందో బహిరంగంగా ప్రకటించి విశ్వసనీయత చాటుకోవలసిన అవసరం ఎంతైనా ఉంది.  లేదంటే అందరిలాగే శ్రీచైతన్య కూడా ఒక మోసపూరిత సంస్థగా భావించవలసి ఉంటుంది. శ్రీచైతన్య విశ్వసనీయత చాటుకుంటుందా ? మోసపూరిత సంస్థగా మిగిలిపోతుందా అనేది త్వరలోనే తేలనుంది.


 

Post a Comment

0 Comments

Popular Posts

Resonance Schools : J.D.లక్ష్మీనారాయణ రెజొనెన్స్‌కి ప్రచారకర్తగా మారారా ?
Resonance Schools : టీచర్లు లేకుండా బోధన ఎలా ?
Kadapa Sri Chaitanya : శ్రీచైతన్య హాస్టల్స్‌లో ఆగని మరణమృదంగం !
Physics Wallah : 'సరసమైన ధరకే చదువు' ఫిజిక్స్‌ వాలా IPOని గట్టెక్కిస్తుందా ?
Sri Chaitanya Fake Olympiads : ఆగని శ్రీచైతన్య ఫేక్‌ ఒలింపియాడ్స్‌ దందా !
Sri Chaitanya Score Scholarship : శ్రీచైతన్య రూ.350 కోట్లు మాయాజాలం !
sri chaitanya : తవ్వేకొద్ది బయటపడుతున్న శ్రీచైతన్య షెల్‌ కంపెనీల అక్రమాలు !
Resonance Schools : పర్మిషన్లు లేకుండా అడ్మిషన్లు ఎలా ?
Sri Chaitanya Sisters : శ్రీచైతన్య షెల్‌ కంపెనీల గుట్టు రట్టు !
Sri Chaitanya Prodigy : తల్లిదండ్రులపై మోయలేని పెనుభారం !