Ticker

6/recent/ticker-posts

AP Governor Reacts on Babu Arrest : చంద్రబాబు అరెస్ట్‌పై ఏపీ గవర్నర్‌ విస్మయం !

 

 

మాజీ ముఖ్యమంత్రి, ప్రతిపక్షనేత చంద్రబాబు అరెస్టుపై సమాచారం ఇవ్వకపోవడం పట్ల ఏపీ గవర్నర్‌ జస్టిస్‌ అబ్దుల్‌ నజీర్‌ విస్మయం వ్యక్తం చేశారు. అరెస్టు విషయంలో ప్రభుత్వ తీరుపై గవర్నర్‌ అసంతృప్తిగా ఉన్నట్టు సమాచారం. అవినీతి నిరోధకర చట్టం-2018 సవరణల తర్వాత రాష్ట్రంలో ప్రజాప్రతినిధులు, అంతకుముందు మంత్రులుగా పనిచేసి వారు.. వారు నిర్వహించిన శాఖల్లో అవినీతి జరిగినట్టు ప్రభుత్వం దృష్టికి వస్తే వాటన్నింటినీ క్రోడీకరిస్తూ గవర్నర్‌కు నివేదిక సమర్పించాలి. ఆ తర్వాత గవర్నర్‌ను నుంచి అనుమతి తీసుకొని విచారణ చేపట్టాల్సి ఉంటుంది. కానీ, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబును అరెస్టుపై రాష్ట్ర ప్రభుత్వం గవర్నర్‌కు ఎలాంటి సమాచారం ఇవ్వలేదు.

తెదేపా అధినేత చంద్రబాబు అరెస్టు అక్రమం, చట్ట విరుద్ధమని ఇప్పటికే సీబీఐ మాజీ డైరెక్టర్‌ ఎం.నాగేశ్వరరావు స్పష్టం చేశారు. గవర్నర్‌ అనుమతి లేకుండా చంద్రబాబును అరెస్టు చేయడం, దర్యాప్తు చేపట్టడం చట్టవిరుద్ధమని చెప్పారు. అవినీతి నిరోధక చట్టంలోని సెక్షన్‌ 17ఎ(సి) ప్రకారం గవర్నర్‌ అనుమతి తప్పనిసరని వెల్లడిరచారు. ఒకవేళ గవర్నర్‌ అనుమతి తీసుకుని ఉంటే.. ఆ పత్రాలు చూపించాల్సి ఉంటుందని నాగేశ్వరరావు తెలిపారు. గవర్నర్‌ అనుమతి లేకపోతే దర్యాప్తు చెల్లుబాటు కాదని స్పష్టం చేశారు. గవర్నర్‌ అనుమతి లేకుండా అదుపులోకి తీసుకుంటే.. అక్రమ నిర్బంధం అవుతుందని తెలిపారు. ఆ చర్యకు పాల్పడిన పోలీసు అధికారులపై చట్టపరమైన చర్యలు ఉంటాయని హెచ్చరించారు. మీడియాలో వచ్చిన వార్తల ద్వారానే గవర్నర్‌ తెలుసుకున్నారన్న వర్గాలు. చంద్రబాబు అరెస్టుపై ఆశ్చర్యం వ్యక్తం చేసినట్లు సమాచారం

Post a Comment

0 Comments

Popular Posts

Sri Chaitanya Sisters : శ్రీచైతన్య షెల్‌ కంపెనీల గుట్టు రట్టు !
Sri Chaitanya : వర్సిటీ మూసివేత ! శ్రీచైతన్య ఉద్యోగుల్లో కలవరం ?
JEE MAIN 2025 ఫలితాల్లో మరో సరికొత్త మోసానికి తెరతీసిన శ్రీచైతన్య !
Scholarships : కార్పొరేట్‌ విద్యాసంస్థల బోగస్‌ స్కాలర్‌షిప్‌ ట్రాప్‌  !!
SRI CHAITANYA NEET 2025 : కూలిపోతున్న డాక్టర్‌ కలలు !
JEE ADVANCED 2025 : IIT ర్యాంకుల పేరుతో తల్లిదండ్రుల్ని బకరాల్ని చేస్తున్న శ్రీచైతన్య !
INFINITY META JR APP పేరుతో అడ్డంగా దండుకుంటున్న శ్రీచైతన్య !
Sri Chaitanya : షెల్‌ కంపెనీల పుట్ట...నల్లధనం గుట్ట ....శ్రీచైతన్య !
 SRI CHAITANYA : షెల్‌ కంపెనీలతో  శ్రీచైతన్య డైరెక్టర్ల అంతులేని అక్రమాలు !
Sri Chaitanya Trust : ఇష్టారాజ్యంగా ఎడ్యుకేషనల్‌ ట్రస్ట్‌లు/ సొసైటీలు !