Ticker

6/recent/ticker-posts

Varsity Education : నల్లధనానికి కేరాఫ్‌ అడ్రస్‌గా వర్సిటీ ఎడ్యుకేషన్‌ మేనేజ్‌మెంట్‌ ప్రై.లి.

 

రాష్ట్రవ్యాప్తంగా మరియు దేశవ్యాప్తంగా ఉన్న శ్రీచ్కెతన్య విద్యాసంస్థల్లోని అన్ని బ్రాంచీల విద్యార్థుల ఫలితాలను క్రోడీకరించి ఒకే ఒక సంస్థ సాధించిన ఫలితాలుగా ప్రకటించే తల్లిదండ్రులను మోసం చేస్తున్న శ్రీచ్కెతన్య, తను నిర్వహించే శ్రీచ్కెతన్య విద్యాసంస్థలను మాత్రం వివిధ రకాల సొసైటీలు, ట్రస్ట్‌ల పేరుతో వేర్వేరుగా నిర్వహిస్తోంది. భారతీయ చట్టాల ప్రకారం స్కూల్స్‌ మరియు కాలేజీలలోని విద్యార్థుల నుండి వసూలు చేసే సొమ్మును ప్రైవేట్‌ లిమిటెడ్‌ పేరు మీద వసూలు చేయడానికి వీలు లేదు. ట్రస్ట్‌లు లేదా సొసైటీల పేరు మీదే కార్యకలాపాలు నిర్వహించాలి. దీనిని ఆసరా చేసుకుని శ్రీచైతన్య ఎడ్యుకేషనల్‌ ట్రస్ట్‌ అని ఒకే పేరుతో కార్యకలాపాలు నిర్వహించే అవకాశం ఉన్నా  శ్రీచైతన్య స్కూల్స్‌కి ఒక ట్రస్ట్‌, కాలేజీలకు ఒక ట్రస్ట్‌, అకాడమీలకు ఒక ట్రస్ట్‌, వేరే రాష్ట్రంలోని స్కూల్స్‌కి ఒక సొసైటీ ఇలా విభజించి వివిధ రకాల సొసైటీలు, ట్రస్ట్‌ల పేరుతో తన కార్యకలాపాలు నిర్వహిస్తోంది. 

సొసైటీల చట్టం దుర్వినియోగం చేస్తున్న శ్రీచైతన్య !

శ్రీ చైతన్య సొసైటీ మరియు ట్రస్టుల్లోని రోజు వారి కార్యకలాపాలు, వివిధ సేవల నిర్వహణ నిమిత్తం మరో సంస్థకు (వెండర్‌) నిర్వహణ బాధ్యతలు  కట్టబెట్టింది. దాని పేరే వర్సిటీ ఎడ్యుకేషన్‌ మేనేజ్మెంట్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌. వెరైటీ ఏమిటంటే ఈ సంస్థ నిర్వాహకులు కూడా శ్రీచైతన్య యాజమాన్యమే. ఇటు ట్రస్టు లు నిర్వహించేది అటు నిర్వహణ బాధ్యతల పేరుతో డబ్బు మళ్ళించేది ఒక్కరే, అది శ్రీచైతన్య యాజమాన్యమే. ట్రస్టులు, సొసైటీల ద్వారా నిర్వహించలేని పనులన్నీ ప్రైవేట్‌ లిమిటెడ్‌ కంపెనీ చేస్తుంది అని జనాన్ని, ప్రభుత్వాన్ని నమ్మిస్తున్నారు అని అర్థం అవుతోంది. ట్రస్టుల నుండి డబ్బును బదలాయింపు కోసమే ఈ ఎత్తుగడను వాడుకుంటున్నట్లు తెలుస్తోంది. ఇక వివరాల్లోకి వెళితే శ్రీచ్కెతన్య విద్యాసంస్థల మేనేజ్‌మెంట్‌ ఆధ్వర్యంలోనే ‘వర్సిటీ ఎడ్యుకేషన్‌ మేనేజ్‌మెంట్‌ ప్రై.లి.’ అనే కంపెనీని ఏర్పాటు చేశారు. శ్రీచ్కెతన్య హైస్కూల్‌, శ్రీచ్కెతన్య స్కూల్స్‌, టెక్నో కరిక్యులమ్‌, శ్రీచ్కెతన్య జూనియర్‌ కాలేజీలు, శ్రీచ్కెతన్య ఐఐటి అకాడమీ, శ్రీచ్కెతన్య నీట్‌ అకాడమీ ఇలా వందల కొద్ది బ్రాంచీలు ఏర్పాటు చేసిన శ్రీచ్కెతన్య వీటన్నింటిని వివిధ రకాల ట్రస్ట్‌లు, సొసైటీల పేరు మీద రిజిస్టర్‌ చేసింది. శ్రీచైతన్య ఎడ్యుకేషనల్‌ సొసైటీ, శ్రీచైతన్య ఎడ్యుకేషనల్‌ ట్రస్ట్‌, నెక్ట్‌జన్‌ ఎడ్యుకేషనల్‌ ట్రస్ట్‌, సిద్ధి వినాయక ఎడ్యుకేషనల్‌ ట్రస్ట్‌, శ్రీ కళ్యాణ చక్రవర్తి మెమోరియల్‌ ఎడ్యుకేషనల్‌ ట్రస్ట్‌, జి.టి. ఎడ్యుకేషనల్‌ ట్రస్ట్‌, ఇన్ఫినిటీ లెర్న్‌ ఇలా పదుల సంఖ్యలో ట్రస్ట్‌లు, సొసైటీల పేరుతో వ్యాపారాన్ని నిర్వహిస్తోంది. ఎందుకంటే ఈ సొసైటీలు, ట్రస్ట్‌లు అన్నీ చాలా వరకు నష్టాలు చూపిస్తూ బ్లాక్‌మనీని, వైట్‌గా మార్చుకునేందుకు ఈ సొసైటీలను, ట్రస్ట్‌లను వాడుకుంటున్నారు. సొమ్మును పక్కదారి పట్టిస్తున్నారు. సొసైటీల చట్టం ప్రకారం శ్రీచైతన్యను లాభపేక్ష లేని సంస్థగా చూపిస్తున్నారు. ఈ ట్రస్ట్‌లు, సొసైటీలకు సంబంధించిన నిధులను శ్రీచ్కెతన్య కుటుంబ సభ్యులు తమ వ్యక్తిగత, కుటుంబ అవసరాలకు మళ్ళించేందుకు వీలు లేదు. దీంతో నిధుల మళ్ళింపు కోసం వేసిన ఎత్తుగడలో భాగంగా శ్రీచ్కెతన్య సంస్థలోని బొప్పన సుష్మ, బొప్పన సీమ, వై. శ్రీధర్‌లు మేనేజ్‌మెంట్‌ ఆధ్వర్యంలో వర్సిటీ ఎడ్యుకేషన్‌ మేనేజ్‌మెంట్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ని స్థాపించారు. నిజంగా శ్రీచ్కెతన్య తన సంస్థలో ఎలాంటి అవకతవకలకు పాల్పడక పోతే శ్రీచ్కెతన్య ఎడ్యుకేషనల్‌ సొసైటీ పేరు మీద ఒకే సంస్థ పేరు మీద అన్ని రకాల కార్యకలాపాలు నిర్వహించవచ్చు అనేది తల్లిదండ్రుల అభిప్రాయపడుతున్నారు. శ్రీచైతన్య విద్యాసంస్థలకు సంబంధించి అన్ని రకాల కొనుగోళ్లు, మౌలిక వసతుల కల్పన, పుస్తకాలు ముద్రణ, ఎగ్జామ్‌ పేపర్ల తయారీ, నిర్వహణ, ఉద్యోగులు, సిబ్బందికి జీతాల చెల్లింపుల కోసం దీన్ని ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు.

భారీగా నల్లధనం మళ్లింపు.. 

శ్రీచ్కెతన్య విద్యాసంస్థలకు సంబంధించి అన్ని రకాల చెల్లింపులు నిర్వహిస్తున్నందుకు వర్సిటీ ఎడ్యుకేషన్‌ మేనేజ్‌మెంట్‌ ప్రై.లి. సంస్థకు  10 శాతం కమిషన్‌ చెల్లిస్తున్నారు. ఇదే సమయంలో అన్ని రకాల చెల్లింపులో అవకతవకలు పాల్పడుతూ రెట్టింపు వ్యయం చూపుతూ నల్లధనాన్ని వైట్‌మనీగా మార్చుకునేందుకు వర్సిటీ ఎడ్యుకేషన్‌ మేనేజ్‌మెంట్‌ ప్రై.లి.ను ఉపయోగించుకుంటున్నారు. ఇదే అవకాశంగా వర్సిటీ ఎడ్యుకేషన్‌ మేనేజ్‌మెంట్‌ ప్రై.లి.లోకి ఇతర సంస్థల పేరుతో భారీగా నిధులు మళ్లించారు. వర్సిటీ ఎడ్యుకేషన్‌ మేనేజ్‌మెంట్‌ ప్రై.లి. ఇతర కంపెనీలు భారీగా పెట్టుబడులు పెట్టినట్లు చూపుతున్నారు. 


Post a Comment

0 Comments

Popular Posts

JEE ADVANCED 2025 : IIT ర్యాంకుల పేరుతో తల్లిదండ్రుల్ని బకరాల్ని చేస్తున్న శ్రీచైతన్య !
Sri Chaitanya : వర్సిటీ మూసివేత ! శ్రీచైతన్య ఉద్యోగుల్లో కలవరం ?
Digital India Bill : సైబర్‌ నేరాలకు చెక్‌ పెట్టేందుకు డిజిటల్‌ ఇండియా బిల్లు !
amitshah Comments 2g-3g-4g parties : కాంగ్రెస్‌, డీఎంకేలు తరాలుగా అవినీతిని కొనసాగిస్తున్నాయి
JEE MAIN 2025 ఫలితాల్లో మరో సరికొత్త మోసానికి తెరతీసిన శ్రీచైతన్య !
IT Rides on Sri Chaitanya : కొత్త తరహా మోసంలో శ్రీచైతన్య నేషనల్‌ రికార్డ్‌ !
IT RIDES : రూ. 230 కోట్లకు పైగా పన్ను ఎగవేతకు పాల్పడిన శ్రీచైతన్య !
corporate colleges gimmicks in neet results : ఓపెన్‌ కేటగిరీ ర్యాంకులే అసలైన ర్యాంకులు !
 Vizag MP Family Kidnap : విశాఖలో రెచ్చిపోయిన కిడ్నాపర్లు ! ఉలిక్కిపడ్డ తెలుగు రాష్ట్రాలు !
anasuya-talks-about-war-with-vijay : ఇంతటితో ముగించాలనుకుంటున్నా - అనసూయ