Ticker

6/recent/ticker-posts

sri chaitanya : విద్యను పూర్తిస్థాయి వ్యాపారంగా మార్చిన శ్రీచైతన్య !

 

 


  • ప్రమోషన్స్‌కు బ్రాండ్‌ అంబాసిడర్‌లు !
  • ఎంత మంది చదివారో ప్రకటనలో ఎందుకు వేయటం లేదు.
  • ఏ సొసైటీ లేదా  ట్రస్ట్‌ నుండి సొమ్ము చెల్లిస్తునారో చెప్పగలరా ?
  • శ్రీచైతన్యకు దాసోహం అంటున్న వ్యవస్థలు !

భారతదేశంలో విద్యను వ్యాపారంగా మార్చి ఒక్క రూపాయి సంపాదించిన అది శిక్షార్కమైన నేరం. కానీ మన దేశంలో విద్యను పూర్తి స్థాయి వ్యాపారంగా మార్చుకున్నాయి శ్రీచైతన్య లాంటి కొన్ని విద్యాసంస్థలు. రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధంగా యధేచ్చగా నిబంధనలకు తూట్లు పొడుస్తూ తమ కార్యకలాపాలను కొనసాగిస్తోంది శ్రీచైతన్య. ఏది చేసినా అడిగేవాడు అన్న చందంగా సొంత రాజ్యాంగాన్ని అమలు చేసుకుంటున్నాయి. అదే కోవలో ఇప్పుడు మరో అడుగు ముందుకు గత రెండేళ్ళుగా శ్రీచైతన్య బ్రాండ్‌ అంబాసిడర్‌లను నియమించింది. అదీ కూడా మార్కెట్లో కోట్లలో రెమ్యునరేషన్‌ తీసుకునే సినిమా హీరో అల్లు అర్జున్‌ మరియు స్టార్‌ క్రికెటర్‌ అయిన రోహిత్‌ శర్మలను శ్రీచైతన్య తన బ్రాండ్‌ అంబాసిడర్‌లుగా నియమించుకుని ప్రచారం చేస్తోంది. శ్రీచైతన్యకు బ్రాండ్‌ వాల్యును పెంచే క్రమంలో ఈ చర్యలు చేపట్టారు అని అనుకుందాం. భారతదేశంలో విద్య అనేది నాన్‌ ప్రాఫిటబుల్‌ సర్వీస్‌... విద్య అన్నది సేవ, వ్యాపారం కాదు అని నిర్వచించిన మహనీయులు డా॥బి.ఆర్‌. అంబేడ్కర్‌ రాజ్యాంగ నిబంధనల్ని పెడచెవిన పెడుతున్నారు. ఇది ఒక రకంగా రాజ్యాంగాన్ని అవమానపరచటమే. విద్యపై సంపాదించిన ప్రతి రూపాయి మళ్ళీ విద్య కోసమే కేటాయించాలన్న నిబంధనలు ఉన్నా, శ్రీచైతన్య కోట్లాది రూపాయలు తమ బ్రాండ్‌ అంబాసిడర్‌లకు ఎలా చెల్లిస్తోంది. 

నిబంధనల ఉల్లంఘనే !

ఈ బ్రాండ్‌ అంబాసిడర్‌లకు చెల్లించే సొమ్ము ఎక్కడి నుండి వస్తోంది. శ్రీచైతన్యకు సంబంధించిన ఏ ట్రస్ట్‌ లేదా సొసైటీ నుండి చెల్లిస్తోంది. ఇది కచ్చితంగా నిబంధనల ఉల్లంఘనే. మరో వైపు ఇన్ఫినిటీ లెర్న్‌ పేరులో (ర్యాంకుగురు టెక్నాలజీస్‌ ప్రై.లి) పేరుతో ఒక డిజిటల్‌ లెర్నింగ్‌ యాప్‌ పేరు ఒక సంస్థను ఏర్పాటు చేసి ఆ సంస్థ ద్వారా రోహిత్‌ వర్మ, అల్లు అర్జున్‌లకు కోట్లాది రూపాయలు చెల్లిస్తున్నట్లు తెలుస్తోంది. విద్య ఏ రూపంలో ఉన్న సేవ క్రిందకే వస్తుంది. కానీ డిజిటల్‌ లెర్నింగ్‌ యాప్‌ని ఒక ప్రైవేటు లిమిటెడ్‌ కంపెనీ పేరు మీద నిర్వహిస్తోంది. ఇక పోతే బ్రాండ్‌ అంబాసిటర్లు అయిన అల్లు అర్జున్‌, రోహిత్‌ శర్మలు చెల్లించేది ప్రైవేటు లిమిటెడ్‌ కంపెనీ అయితే...వారిని శ్రీచైతన్య లాంటి సంస్థ తన బ్రాండ్‌ అంబాసిడర్‌లు ఫలితాలకు వాడుకుంటోంది. ఇది మరో ఉల్లంఘన, ఒక తీవ్రమైన నేరం. ఒక వైపు సొసైటీల పేరుతో ఎలాంటి లాభాలు పొందటం లేదని ప్రభుత్వానికి చూపిస్తూ మరో వైపు కోట్లాది రూపాయలు బ్రాంచ్‌ అంబాసిడర్‌లకు చెల్లించటంలో అంతరార్థం శ్రీచైతన్యకే తెలియాలి. ప్రజల్ని, వ్యవస్థల్ని తప్పుదోవ పట్టించటమే. ఇంకో వైపు అకాడమీల పేరుతో ఎలాంటి అనుమతులు లేకుండా కాలేజీలు, రెసిడెన్షియల్స్‌ నడుపుతున్నారు. ఒక స్కూల్‌కి, కాలేజీకి అనుమతి తీసుకుని రెండు, మూడు స్కూల్స్‌ని నడుపుతున్నారు. అడిగేవాడు లేక ఇష్టారాజ్యంగా తయారైంది. మల్టీనేషనల్‌ కార్పొరేట్‌ కంపెనీగా తీర్చిదిద్దాలనే ఉద్ధేశ్యం శ్రీచైతన్య యాజమాన్యానికి ఉంటే వేరే రంగాన్ని ఎంచుకోవాల్సింది. కానీ విద్యను కార్పొరేట్‌ కంపెనీగా మార్చి పేద, మధ్యతరగతి వర్గాలకు అందుబాటులో లేకుండా దూరం చేసే కుట్ర చేస్తున్నట్లు కనిపిస్తోంది. ప్రభుత్వం దృష్టిలో సేవ చేస్తున్నట్లు బిల్డప్‌ ఇస్తూ శ్రీచైతన్యకు నష్టాలు చూపిస్తూ, టాక్స్‌లు ఎగవేతకు పాల్పడుతూ మరో వైపు బ్రాండ్‌ అంబాసిడర్‌లతో పాటు విపరీతంగా ప్రకటనలు ఇస్తూ అన్నీ వ్యసస్థలను మోసం చేస్తున్న తీరు అందరినీ విస్మయానికి గురిచేస్తోంది. ఇవన్నీ అందరికీ తెలిసినా ఎవరూ ఎలాంటి చర్యలు తీసుకోరు. అసలు నిబంధనలు ఉన్న సంగతి అధికారులు మరిచిపోయారు, నాయకులు విస్మరించారు. పోలీసులు చూసీ చూడనట్టు వ్యవహరిస్తున్నారు. పత్రికలు ప్రకటనతో సరిపెట్టుకుంటున్నాయి. కానీ దేశానికి ముఖ్యమైన గుండెకాయ లాంటి న్యాయవ్యవస్థ కూడా సుమోటాగా కేసును నమోదు చేయటం లేదు బాధాకరం. 

ర్యాంకులు కోసం అల్లు అర్జున్‌, రోహిత్‌ శర్మ గ్యారెంటీ ఇస్తున్నారా ?

ఏదైనా ఒక కంపెనీకి చెందిన ప్రాడక్ట్‌ కొంటే ఆ వస్తువుపై కొన్ని రోజులు వారంటీ లేదా కొన్ని సంవత్సరాలు గ్యారెంటీ ఉంటుంది. దానిని బేస్‌ చేసుకుని కస్టమర్లు ఒక ప్రాడక్ట్‌ని కొంటారు. ఆ ప్రాడక్ట్‌పై నమ్మకం కలిగించడానికి పెద్దపెద్ద ప్రముఖులతో, హీరోలతో ప్రకటనల రూపంలో ప్రచారం చేసుకుంటారు. కానీ రేపు ఎలా ఉంటుందో తెలియని భవిష్యత్తుపై ఆశలు రేపుతూ ర్యాంకుల్ని ప్రాడక్ట్‌లుగా మార్చుకుంటూ, తల్లిదండ్రుల్ని కస్టమర్లుగా భావిస్తూ విద్యావ్యాపారాన్ని నిరాటంకంగా కొనసాగిస్తోంది శ్రీచైతన్య. మరీ శ్రీచైతన్యలో చేరిన ప్రతి విద్యార్థికి ర్యాంకు గ్యారెంటీ ఉందా ? అంటే అదీ లేదు. అల్లు అర్జున్‌, రోహీత్‌ శర్మ చెప్పారని శ్రీచైతన్యలో చేరిన వారందరికీ ర్యాంకు రాకపోతే సమాధానం ఎవరు ఇస్తారా ? అల్లు అర్జున్‌ లాంటి ఫేమస్‌ సినీహీరో చెపితే అందరూ ఇట్టే నమ్మేస్తారు. అందుకే శ్రీచైతన్య అల్లు అర్జున్‌ లాంటి ఫేమస్‌ హీరోని ఎంచుకుంది. అలాంటప్పుడు ర్యాంకులు రాని వారందరూ అల్లు అర్జున్‌ చెప్పాడని వెళ్ళాం అని ప్రశ్నిస్తే... అల్లు అర్జున్‌ సమాధానం చెప్తారా ? శ్రీచైతన్య  ఎప్పుడూ మొదటి 10 లోపు, 100 లోపు ర్యాంకులే ప్రకటనల్లో చెప్తుంది, చూపుతుంది. ఒక్క 2023 నీట్‌లో దాదాపు 48000 ( 28000 మంది సీనియర్‌ ఇంటర్‌తో డైరెక్ట్‌గా పరీక్షరాయగా, 20000 లకు పైగా విద్యార్థులు లాంగ్‌టర్మ్‌ చదివి పరీక్ష వ్రాసిన వారు ఉన్నారు) మందికి పైగా పరీక్ష వ్రాస్తే సీటు సాధించే ర్యాంకులు వచ్చింది 8973 మంది. మిగిలిన విద్యార్థుల భవిష్యత్తు ఏంటి అంటే... సమాధానం చెప్పలేని స్థితిలో శ్రీచైతన్య ఉంది. మళ్ళీ లాంగ్‌టర్మ్‌ చదవటం ర్యాంకు సాధించండి. మళ్ళీ వ్యాపార దృక్పథమే తప్ప, మానవత్వం లేని సంస్థ శ్రీచైతన్య.  శ్రీచైతన్య అంత గొప్ప సంస్థ అయితే చదివిన విద్యార్థులందరికీ 100 లోపు ర్యాంకు ఎందుకు రావటం లేదు అన్నది సత్యం. ర్యాంకు రాని వాళ్ళు వేలల్లో ఉంటారని అల్లు అర్జున్‌కి తెలియదు. వాళ్ళందరూ ఒక్కసారిగా కేసులు పెడితే పరిస్థితి ఏమిటి? ఇలాంటి వివాదం నుండి  శ్రీచైతన్య కూడా ప్రక్కకు తప్పుకుంటుంది.

Post a Comment

0 Comments

Popular Posts

Scholarships : కార్పొరేట్‌ విద్యాసంస్థల కుతంత్రం ! బోగస్‌ స్కాలర్‌షిప్‌లతో విద్యార్థులపై దండయాత్ర !!
Sri chaitanya : శ్రీచైతన్య స్కూల్‌ సీజ్‌ !
Sri Chaitanya Trust : ఇష్టారాజ్యంగా ఎడ్యుకేషనల్‌ ట్రస్ట్‌లు/ సొసైటీలు !
JEE ADVANCED 2025 : IIT ర్యాంకుల పేరుతో తల్లిదండ్రుల్ని బకరాల్ని చేస్తున్న శ్రీచైతన్య !
Sri Chaitanya : వర్సిటీ మూసివేత ! శ్రీచైతన్య ఉద్యోగుల్లో కలవరం ?
SRI CHAITANYA NEET 2025 : కూలిపోతున్న డాక్టర్‌ కలలు !
JEE MAIN 2025 ఫలితాల్లో మరో సరికొత్త మోసానికి తెరతీసిన శ్రీచైతన్య !
SriChaitanya School : సుచిత్రలో శ్రీచైతన్య బరితెగింపు !!
Sri Chaitanya : షెల్‌ కంపెనీల పుట్ట...నల్లధనం గుట్ట ....శ్రీచైతన్య !
SriChaitanya Fake Olympiad Scam : ఫేక్‌ ఒలింపియాడ్స్‌కు అడ్డాగా శ్రీచైతన్య స్కూల్స్‌ !