Ticker

6/recent/ticker-posts

Anasuya Controvasy Tweet : అనసూయ కాంట్రవర్సీ ట్వీట్‌..! బేబీ చిత్రం ప్రమోషన్‌ కోసమేనా ?

సినిమా హిట్‌ కోసం కొందరు కాంట్రవర్సీలను ఎంచుకుంటున్నారు. అనసూయను టార్గెట్‌ చేస్తే రెచ్చిపోతుంది. దానిని కొన్ని రోజులు కొనసాగిస్తే క్యాష్‌ చేసుకోవచ్చు అని కొందరు మేకర్స్‌ ఆలోచనగా తెలుస్తోంది. ప్రతి చిన్న దానికి స్పందించే అనసూయే అందుకు టార్గెట్‌ అయ్యింది. అర్జున్‌ రెడ్డి సమయం నుంచి అనసూయ, విజయ్‌ దేవరకొండ మధ్య వివాదం నడుస్తున్న సంగతి తెలిసిందే. విజయ్‌ ఎప్పుడో ఈ గొడవని వదిలేసినా అనసూయ మాత్రం ఏదో ఒక సమయంలో ఏదో ఒక ట్వీట్‌ చేసి విజయ్‌ ఫ్యాన్స్‌ని రెచ్చగొడుతూ ఉండేది. దీంతో అనసూయపై విజయ్‌ ఫ్యాన్స్‌ దారుణంగా ట్రోల్‌ చేసేవారు. అయితే ఇటీవల దీని గురించి స్పందిస్తూ ఇక ఈ విషయాన్నీ వదిలేస్తాను, సోషల్‌ మీడియాలో ఇలాంటి వాటిపై ట్వీట్స్‌ పెట్టను, నాకు మనశ్శాంతి కావాలి అని వ్యాఖ్యలు చేసింది.

అనసూయ  ట్వీట్‌

ఈ వ్యాఖ్యలు చేసి నెల రోజులు కూడా కాలేదు మళ్ళీ ఓ ట్వీట్‌ చేసి అనసూయ వైరల్‌ అవుతుంది. ఈ సారి అనసూయ.. వావ్‌.. నేను అందరికి చాలా చాలా ఇంపార్టెంట్‌. నా ప్రమేయం ఉన్నా లేకున్నా, నాకు సంబంధం ఉన్నా లేకున్నా, నా పేరు ఎత్తకుండా ఒక్క డిస్కషన్‌ కూడా జరగదంటే మీ అందరికి నేను చాలా అవసరం. నా మీద అంత డిపెండ్‌ అయి ఉన్నారు. నా పేరు లేకుండా పాపం ఏది చేయలేకపోతున్నారు అని ట్వీట్‌ చేసింది. ఇప్పుడు అసలు ఎలాంటి సందర్భం లేకుండానే తనే ఏదో ట్వీట్‌ చేసేసింది. కనీసం అది ఎందుకు చేసింది, ఎవరి కోసం చేసింది కూడా చెప్పలేదు. దీంతో మరోసారి అనసూయ వైరల్‌ గా మారింది. అసలు ఇలాంటి ట్వీట్స్‌ చేయను అని మళ్ళీ మొదలుపెట్టడంతో మరోసారి అనసూయపై ట్రోల్స్‌ చేస్తూనే ఈ ట్వీట్‌ ఎవరికోసం అంటూ ప్రశ్నిస్తున్నారు. అయితే ఇటీవల ఆనంద్‌ దేవరకొండ నటించిన బేబీ సినిమా రిలీజయింది. ఈ సినిమా ప్రమోషన్స్‌ లో అందరూ ఆనంద్‌ దేవరకొండని అనసూయ, విజయ్‌ వివాదం గురించి అడిగారు. దాని కోసమే అనసూయ ఈ ట్వీట్‌ చేసిందేమో అని పలువురు అభిప్రాయపడుతున్నారు.

బేబీలో ఆంటీ అని వాడేశారా ?

ఇక అనసూయ చేసిన ఈ ట్వీట్‌ నెటిజన్లకి కూడా అర్థం కాలేదు. అందుకే మళ్లీ ఏమైంది మేడమ్‌ అంటూ కామెంట్స్‌ చేస్తున్నారు. అనునీ ఏమైనా అంటే శవాలు లేస్తాయి అంటూ ఆమె ఫ్యాన్స్‌ కొందరు వార్నింగ్స్‌ కూడా ఇస్తున్నారు. మరికొందరు ఎప్పుడూ ట్రోలర్స్‌ గురించేనా? కాస్త నిన్ను ఆరాధించే వారి గురించి కూడా పట్టించుకో.. అని అంటున్నారు. ‘బేబీ మూవీలో మీ పేరు బాగా వినబడుతుందండీ.. హీరోయిన్‌ కంటే కూడా అది మీకే సెట్‌ అవుతుంది’ అని ఓ నెటిజన్‌ కామెంట్‌ చేశాడు. సినిమాలో ఆంటీ అని పిలిచే సన్నివేశాలు.. అనసూయని దృష్టిలో పెట్టుకునే రాసినట్లుగా నెటిజన్‌ అభిప్రాయం. ఏదైతేనేం.. సోషల్‌ మీడియాకు కావాల్సిన మేతని అనసూయ మరోసారి ఇచ్చేసింది. దీంతో ఆమె పేరు ప్రస్తుతం టాప్‌లో ట్రెండ్‌ అవుతోంది.

Post a Comment

0 Comments

Popular Posts

VIZAG :  రియల్ ఎస్టేట్ ముసుగులో మల్టీ లెవల్ మార్కెటింగ్: SSC DEVELOPERS అసలు రంగు చూస్తే షాక్ అవ్వాల్సిందే !
My Land Infra : బోర్డు తిప్పేసేందుకు సిద్ధమైన మైల్యాండ్ ఇన్‌ఫ్రా కంపెనీ!
VIZAG : డబుల్ రిజిస్ట్రేషన్ల కిలాడీ..బుడారి లక్ష్మణరావు
 My Land Infra : రియల్ ఎస్టేట్ ముసుగులో ‘మై ల్యాండ్ ఇన్‌ఫ్రా’ మహా మోసం
 Genesis Capital : లక్ష పెట్టు...4 లక్షలు పట్టు....మరో ఇన్వెస్ట్‌మెంట్ స్కామ్ !
GUNTUR : భారీ ఇన్వెస్ట్‌మెంట్ కుంభకోణం: రూ. 20 కోట్లతో బోర్డు తిప్పేసిన ‘అవని’ ముఠా!
AVIGNA LABORATORIES : ఈ లెక్కల్లో పెద్ద లోసుగుంది ? భారీ పన్ను ఉల్లంఘనలు?
NEET 2024 ఫలితాలు ప్రకటించేసుకున్న శ్రీచైతన్య ! NTA ని అవమానిస్తున్న శ్రీచైతన్య !
Ankura Hospitals : AS Rao Nagar LLP ఆర్ధిక లావాదేవీలపై సంచలన కథనం!
Sri Chaitanya : తల్లిదండ్రుల్ని దోచేస్తున్న ఒలింపియాడ్స్‌ మాఫియా